జన శంఖారావం | Y.S.JAGAN MOHAN REDDY Samiyakashkaram in codavaram | Sakshi
Sakshi News home page

జన శంఖారావం

Published Sat, Feb 8 2014 11:55 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

Y.S.JAGAN MOHAN REDDY Samiyakashkaram in codavaram

  •       సమైక్య సారథికి నీరా‘జనం’
  •      జగన్‌కు అడుగడుగునా అఖండ స్వాగతం
  •      చోడవరంలో పోటెత్తిన ప్రజానీకం
  •  దుడ్డుపాలెం (కె.కోటపాడు), న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ సీపీ సీఈసీ సభ్యుడు బూడి ముత్యాలునాయుడు ఆధ్వర్యంలో దేవరాపల్లి మండలప్రజలు చోడవరం మండలం దుడ్డుపాలెం జంక్షన్ వద్ద ఘనస్వాగతం పలికారు. చోడవరంలో సమైక్య శంఖారావం సభకు జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్న మార్గంలో సుమారు పదివేలమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు రెండు కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా నిలబడి శనివారం స్వాగతం పలికారు.

    దుడ్డుపాలెం జంక్షన్‌కు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న అభిమానులు ఎండను సైతం లెక్క చేయకుండా అభిమాన నాయకుడి రాక కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు.  పార్టీ అధినేతకు గిరిజనులు థింసా నృత్యం, కోలాటాలతో అపూర్వ స్వాగతం పలికారు. గంటల తరబడి వేచిఉన్న కార్యకర్తలు, మహిళలను పలుకరిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ను ముందుకు సాగించారు.

    ఈ సందర్భంగా అశేష  జనాన్ని చూసిన జగన్‌మోహన్‌రెడ్డి  బూడి ముత్యాలనాయుడుతో మాట్లాడారు. పార్టీ పట్టిష్టతకు చేసిన సేవలను బూడి వివరించారు. రెండు కిలోమీటర్ల పొడవునా ఉన్న మహిళలు, కార్యకర్తలకు జగన్‌మోహన్‌రెడ్డి  భివాదం చేసి ఉత్తేజపరిచారు. ఈ స్వాగత కార్యక్రమాల్లో దేవరాపల్లి వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి సత్యం, బూరె బాబూరావు, పోతల లక్ష్మి, గూడెపు రాము, రొంగలి శంకరరావు, రెడ్డి బలరాం, నాగిరెడ్డి శఠారినాయుడు, వరదపురెడ్డి లలితానాయుడు, బొడ్డు పేరునాయుడు, ఈర్లె గంగునాయుడు (నాని) పాల్గొన్నారు.
     
    విమానాశ్రయంలో హోరెత్తిన జగన్నినాదం
     
    విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో శని వారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ స్వాగతం లభించింది. సమైఖ్య శంఖారావం సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను కలిసేందుకు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో అభిమానులు, నేతలు తరలి వచ్చారు.

    పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, డాక్టర్ జహీర్‌అహ్మద్, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు చొక్కాకుల వెంకటరావు, ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, సమన్వయకర్తలు గండి బాబ్జీ, దాడి రత్నాకర్, తిప్పల నాగిరెడ్డి, జి.వి.రవిరాజు, కోలా గురువులు, కోరాడ రాజబాబు, పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి, చెంగల వెంకటరావు, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, పార్టీ నాయకురాలు పీలా ఉమారాణి, మాజీ కార్పొరేటర్ చొప్పా నాగరాజు తదితర నాయకులు జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఇక్కడి నుంచి దారిపొడువునా మహిళలు, యువకులు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మంగళ హారతులతో అభిమానాన్ని చాటుకున్నారు. జై..జగన్ నినాదాలతో హోరెత్తించారు.
     
    పులకించిన చోడవరం..


    చోడవరం, న్యూస్‌లైన్: తమప్రియతమ నాయకుడు రావడం తో చోడవరం పులకరించిపోయింది. సుమా రు మూడు సంవత్సరాల త ర్వాత వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు  వైఎస్ జగన్ మోహనరెడ్డి చోడవరం రావడంతో అభిమానులు ఆయనను చూసేందుకు బారులు తీరా రు.   చోడవరం పట్టణంలోని ప్రజలతోబాటు పరిసర మండలాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో చోడవరం జన సం ద్రంగా మారింది.  

    మద్యాహ్నం  రెం డు గం టల నుంచే అభిమాన నాయకుని రాకకోసం చోడవరం కార్యకర్తలు, అభిమానులు, సమైక్యవాదులు  చేరుకున్నారు. సుమారు మూడు గంటల పాటు జగన్ రాక ఆలస్యమైనా ఏ ఒక్కరూ నిరాశ చెందలేదు. అంతకంతకు జనం పెరగడంతో ఇసుక వేస్తే రాలనంతగా కొత్తూరు జంక్షన్ నిండిపోయింది. 2011 జనవరిలో ఓదార్పు యాత్ర అనంతరం మూడేళ్ల తర్వాత  వచ్చిన  జగన్‌ను  చూసేందుకు చిన్నా పెద్ద అంతా  ఉత్సాహం చూపారు.  

    మహిళలు, విద్యార్థులు, యువకులు, వృద్దులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభా స్థలి వద్ద చుట్టు పక్క ఉన్న  భవ నాల పైకి సైతం ఎక్కి తమ అభిమాన నాయకుడిని తనివి తీరా చూసుకున్నారు. జగన్ ప్రసంగానికి  అడుగడుగునా  కరతాళ ధ్వనులతో తమ స్పందనను వ్యక్తపరిచారు. చంద్రబాబుపై విమర్శలకు జనం నుంచి అనూహ్యస్పందన వచ్చింది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతోపాటు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది సభకు తరలిరావడంతో రోడ్లన్నీ నిండిపోయాయి. జగన్ నినాదంతో సభా ప్రాంతమంతా మారుమోగింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement