వరదయ్యుపాళెం, న్యూస్‌లైన్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వరదయ్యపాళెం బస్టాండ్ వద్ద శుక్రవారం భారీ ఎత్తున ధర్నా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభివూనులు వరదయ్యుపాళెం బస్టాండ్ ఆవరణలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని సమైక్య శంఖారావం యూత్రలో భాగంగా జనవరి 27న వరదయ్యుపాళెం వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఇక్కడ జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. దీనిని ఓర్వలేని కొందరు గురువారం రాత్రి వైఎస్‌ఆర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం ఎడవు చేతిని విరిచి దూరంగా పడేశారు. దిమ్మెను పాక్షికంగా ధ్వంసం చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ నేతల ధర్నా
విగ్రహం ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సత్యవేడు నియోజకవర్గ సవున్వయుకర్త ఆదివుూలం, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు బీరేంద్ర వర్మల నేతృత్వంలో పార్టీ వుండల నేతలు, స్థానికులు వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. విగ్రహ ధ్వంసాన్ని పిరికిపందల చర్యగా ఆదిమూలం అభివర్ణించారు. దుండగులను కఠినంగా శిక్షించాలంటూ వరదయ్యుపాళెం ఎస్‌ఐ వంశీధర్‌కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు.
విగ్రహాన్ని బాగుచేయించారు
వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అభిమానులకు తీవ్ర మనస్థాపం కలిగించింది. శుక్రవారం మధ్యాహ్నం నిపుణులను పిలిపించి విగ్రహాన్ని బాగుచేయించారు. తర్వాత పాలాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో కొలువై ఉన్న వైఎస్‌ఆర్ రూపాన్ని ఎవరూ చెరపలేరన్నారు. ఈ కార్యక్రవుంలో వైఎస్‌ఆర్‌సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదివుూలం, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బీరేంద్ర వర్మ, పార్టీ వుండల కన్వీనర్ సుబ్రవుణ్యం రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వెంకట కృష్ణయ్యు, కడూరు సహకార బ్యాంకు అధ్యక్షుడు హరిబాబు రెడ్డి, సర్పంచ్‌ల సంఘం వుండల అధ్యక్షుడు తిలక్ బాబు, నేతలు దామోదర్ రెడ్డి, చిన్న, డిబి, చంద్రారెడ్డి, విజయ్ రెడ్డి, చిన్న వెంకటయ్యు, శ్రీనివాసుల రెడ్డి, వుహిళా కన్వీనర్ ధనలక్ష్మి, యుూత్ నేతలు సందీప్(నాని) రెడ్డి, వుహేంద్ర, వుహేష్, తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుండగులను శిక్షించాలి
Published Sat, Feb 1 2014 3:54 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement