భార్యను హతమార్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భర్త
వరదయ్యపాళెంలో దారుణం
చెదులుపాకం(వరదయ్యుపాళెం): కట్టుకున్న భార్యను.. భర్తే దారుణంగా హతవూర్చిన ఘటన వరదయ్యుపాళెం వుండలంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. చెదులుపాకం గిరిజన కాలనీకి చెందిన చెంచయ్యు కు నెల్లూరుజిల్లా కోటపోలూరు గ్రావూనికి చెందిన సుజాతవ్ముతో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. అరుుతే కొంత కాలంగా భార్యపై అనుమానంతో తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ కారణంగానే శ్రీసిటిలోని ఓ పరిశ్రవులో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న చెంచయ్యు నెలరోజుల క్రితం ఉద్యో గం మానేశాడు. అరుుతే సోమావారంరాత్రి భార్యభర్తల వుధ్య తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది.
దీంతో చెంచయ్యు భార్య సుజాతవ్ము తలపై ఇనుపరాడ్డుతో మోది హతవూర్చాడు. దీంతో సుజాత (27) అక్కడికక్కడికే వుృతి చెందింది. అనంతరం తనతండ్రికి భార్యను హత్యచేసిన విషయం తెలిపిన చెంచయ్య వరదయ్యుపాళెం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. సవూచారం అందుకున్న సత్యవేడు సీఐ నరసింహులు, స్థానిక ఎస్‌ఐ షేఖ్‌షావల్లి సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులతో ఆరాతీశారు. పోస్టుమార్టం నిమిత్తం వుృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వ ఏరియూ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనాథ అయిన ఆరునెలల చిన్నారి
తల్లిహత్యకు గురవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో సుజాత ఆరునెలల కుమారుడు అనాథగా మారాడు. తల్లిపాల కోసం బిడ్డ ఏడుపులతో ఆ ప్రదేశం మారుమోగింది. కుటుంబ సభ్యుల రోదనలతో చెదులపాకం కాలనీ శోకసంద్రంగా మారింది.
పచ్చని కాపురంలో అనుమానపు చిచ్చు!
Published Wed, Jul 6 2016 3:37 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement
Advertisement