
'తొలగించిన చోటే విగ్రహం పెట్టాలి'
విజయవాడ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి హోదాలో విగ్రహ ఏర్పాటుకు తానే అనుమతిచ్చానని వెల్లడించారు. అన్ని అనుమతులు ఉన్నా.. ప్రభుత్వం కుట్రపూరితంగా విగ్రహాన్ని తొలగించిందని ఆయన మండిపడ్డారు. తొలగించిన చోటే విగ్రహాన్ని పనరుద్ధరించాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.