సురుటపల్లి ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఆదిమూలం
పిచ్చాటూరు (నాగలాపురం): ప్రతిపక్ష నేత చంద్రబాబు, అతని కుమారుడు, గత టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఐదేళ్ల పాటు ఇసుకను ఎడాపెడా దోచుకుని..ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విధానంలో చంద్రబాబు మాటలు వింటుంటే దొంగే.. దొంగ అన్న చందంగా ఉందన్నారు.
శనివారం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురుటపల్లి ఇసుక రీచ్ వద్ద నిర్వహించిన ఇసుక వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, ఎమ్మెల్యే కె.ఆదిమూలంతో కలసి మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పారదర్శకంగా ఇసుక అందేలా రీచ్‌లను ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నారని, దీనిని చూసి ఓర్వలేని చంద్రబాబు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నామని సీఎం, మంత్రులు ఎమ్మెల్యేలపై చార్జిషీట్ వేశారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment