
సాక్షి, అమరావతి: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై టీడీపీ కుల ప్రస్తావన తీసుకురావడం దారుణమన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని తెలిపారు. (కౌంట్‌డౌన్ స్టార్ట్.. అచ్చెన్న ఆటకట్టు)
వందల కోట్ల ప్రజాధనం నొక్కేసి ఇప్పుడు కులాలను ఎలా ప్రస్తావిస్తారంటూ టీడీపీ నేతలపై మంత్రులు మండిపడ్డారు. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడుతో పాటు చంద్రబాబుకు కూడా సంబంధం ఉందని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే దోపిడీ జరిగిందన్నారు. టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. అందరి బండారం బయటపడుతుందన్నారు. త్వరలో మరికొన్ని అరెస్ట్‌లు తప్పవని మంత్రులు స్పష్టం చేశారు. (అచ్చెన్న.. ఖైదీ నెంబర్ 1573)