బలహీనవర్గాలకు కాంగ్రెస్‌ అండ | Bodh Constituency Anil Jadhav Criticize On TRS Govt | Sakshi
Sakshi News home page

బలహీనవర్గాలకు కాంగ్రెస్‌ అండ

Published Sat, Apr 28 2018 10:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Bodh Constituency Anil Jadhav Criticize On TRS Govt - Sakshi

 దిగ్నూర్‌లో మాట్లాడుతున్న అనిల్‌ జాదవ్‌

బజార్‌హత్నూర్‌ : తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది బడుగుల జీవితాలు మారుతాయేమోనని ఎదురుచూశామని కాని ఇక్కడ దొరల పాలనతో బడుగుల జీవితాలు దుర్భరంగా మారాయని ఒక్క సంవత్సరం ఆగితే బడుగుబలహీనవర్గాలకు అండగా ఉండే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్‌ జాదవ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని దిగ్నూర్‌ గ్రామంలో పల్లెపల్లెకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అరచేతిలో అద్భుతం చూపిస్తోందని, దళితబస్తీ భూములు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, ఇప్పటి వరకు ఎంత మందికి లబ్ధి చేకూర్చారో తెలిపాలని టీఆర్‌ఎస్‌ నాయకులను అడుగుతున్నానని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన చెరువులకు రంగులద్ది కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత నిరాశతో ఉన్నారని, యువత తిరగబడి దొరల పాలనకు చరమగీతం పాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల కన్వినర్‌ కానిందే ఉద్దవ్, ఎస్సీ కన్వీనర్‌ దావెంతు నర్సయ్య, యువజన సంఘం అధ్యక్షుడు సల్మాన్, రవి, సంజీవ్, కల్లెం విఠల్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement