సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్
హన్మకొండ : రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోవ లక్ష్మణ్ అన్నారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్‌హాల్‌లో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు రోజులపాటు వర్క్‌షాపు నిర్వహించామని తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఒం టరిగానే పోటీ చేస్తుందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జూన్ నుంచి రాష్ట్రంలో పార్టీ సమావేశాలు విస్తృతంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటన జూన్‌లో ఉంటుందన్నారు. ఈ నెల 14న ఢిల్లీలో జరుగనున్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల సమావేశంలో అమిత్‌షా పర్యటన ఖరారవుతుందని తెలి పారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో టీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుంటుం దని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉండే పార్టీలతో సమావేశమవుతున్నారని, గతంలో యూపీఏ ప్రభుత్వంలో రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వంలోను భాగస్వాములుగా ఉన్నారని గుర్తు చేశారు. ఒక్క ఎమ్మెల్యే లేని ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకుండా, కేంద్రం రాష్ట్రాలకు సహాయం అందించడం లేదని టీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
రైతు బంధుతో సమస్యలు తీరవు..
రైతు బంధు పథకంతో రైతుల సమస్యలు పరి ష్కారం కావని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మ ణ్ అన్నారు. అన్ని రోగాలకు జిందాతిలిస్మాత్ ఔషధమన్నట్లు, రైతుల సమస్యలన్నింటికీ రైతు బం ధు పథకం పరిష్కారమన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రైతులకు అదనంగా రైతులను, సాగు భూమిని అధికంగా చూపించిందని, ఈ మొత్తాన్ని ఎవరి జేబుల్లోకి నెట్టడానికని ప్రశ్నించారు. ఎన్నికల పెట్టుబడి కో సం రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు.
రైతుల రుణాల వడ్డీ మాఫీకి కేం ద్రం 4 శాతం సాయం అందిస్తుందని, రాష్ట్ర వాటా 3 శాతం చెల్లించకపోవడంతో వడ్డీ మాపీ కావడం లేదన్నారు. కౌలు, పోడు చేసుకుంటున్న రైతులకు రైతు బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు రేష్మారాథోడ్, గాదె రాంబాబు, పెదగాని సోమయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment