సాక్షి, చెన్నై: జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కల్యాణ్‌పై తమిళమీడియా సెటైర్లు విసిరింది. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై ఆయన అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకున్నారు, గందరగోళ రాజకీయవాదిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారని శుక్రవారం నాటి తమిళ సాయంకాల దినపత్రిక ‘తమిళ మురసు’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వివరాలు యథాతథంగా..్ఙహైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీచేయాలని సంకల్పించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ముఖ్యనేత కే లక్ష్మణన్‌లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలుసుకున్న తరువాత తమ పార్టీ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేయడం లేదు, బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. అంతేగాక తమ పార్టీ తరఫున ప్రకటించిన అభ్యర్థులను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా వ్యవహరించారు. (బాబు డీఏ బకాయిలకు ఏటా రూ.2,400 కోట్లు)
2019 పార్లమెంటు ఎన్నికల్లో బహుజనసమాజ్ పార్టీ కూటమిలో చేరగా ఆ పార్టీ కేవలం 6 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. తరువాత కొద్ది నెలల్లోనే మాయావతి కూటమికి స్వస్తి పలికి ప్రస్తుతం బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారు. దీంతో పవన్‌ను ‘గందరగోళ రాజకీయ నేత అని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు’ అని బాక్స్ కట్టి మరీ కథనాన్ని ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment