Tamil media
-
అస్వస్థతతో సమంత ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు.. మేనేజర్ ఏం చెప్పారంటే..
స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆమె అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్టు తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులేనని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఇంట్లోనే క్షేమంగా ఉందంటూ స్పష్టం చేశారు. మరోవైపు సామ్ ఆరోగ్యంపై వస్తోన్న ఫేక్ న్యూస్‌ని నమ్మోద్దని ఆమె మేనేజర్ కోరాడు. (చదవండి: సమంత ‘యశోద’కు భారీ షాక్.. ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశం!) కాగా కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. There is a news doing the rounds about @Samanthaprabhu2 and her health. Sources close to her confirm that she is absolutely fine and is doing good. Pl do not spread wrong information. pic.twitter.com/STtZOJVDta — sridevi sreedhar (@sridevisreedhar) November 24, 2022 -
పవన్ కల్యాణ్‌పై తమిళ మీడియా సెటైర్లు
సాక్షి, చెన్నై: జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కల్యాణ్‌పై తమిళమీడియా సెటైర్లు విసిరింది. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీపై ఆయన అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకున్నారు, గందరగోళ రాజకీయవాదిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారని శుక్రవారం నాటి తమిళ సాయంకాల దినపత్రిక ‘తమిళ మురసు’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వివరాలు యథాతథంగా..్ఙహైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీచేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ముఖ్యనేత కే లక్ష్మణన్‌లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలుసుకున్న తరువాత తమ పార్టీ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేయడం లేదు, బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. అంతేగాక తమ పార్టీ తరఫున ప్రకటించిన అభ్యర్థులను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా వ్యవహరించారు. (బాబు డీఏ బకాయిలకు ఏటా రూ.2,400 కోట్లు) 2019 పార్లమెంటు ఎన్నికల్లో బహుజనసమాజ్ పార్టీ కూటమిలో చేరగా ఆ పార్టీ కేవలం 6 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. తరువాత కొద్ది నెలల్లోనే మాయావతి కూటమికి స్వస్తి పలికి ప్రస్తుతం బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారు. దీంతో పవన్‌ను ‘గందరగోళ రాజకీయ నేత అని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు విమర్శిస్తున్నారు’ అని బాక్స్ కట్టి మరీ కథనాన్ని ప్రచురించింది. -
టీడీపీకి చావుదెబ్బ
సాక్షి ప్రతినిధి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో కింగ్‌మేకర్ కావాలని పావులు కదిపిన చంద్రబాబుకు, ఆయన సారథ్యంలోని టీడీపీకి ఈ ఎన్నికల్లో గట్టిదెబ్బతగిలిందని తమిళనాడులోని మీడియా కథనాలు ప్రసారం చేసింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ టీడీపీని చావుదెబ్బకొట్టిందని పేర్కొన్నాయి. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఒక్క ఏపీలోనే అధికార పార్టీ అధికారాన్ని కోల్పోయింది అంటూ దినపత్రిక ‘దినమలర్’ కథనాన్ని ప్రచురించింది. ‘పాదయాత్ర నాయకుడు’ అంటూ వైఎస్ జగన్‌ను ప్రశంసించింది. జగన్ రాజకీయ జీవితంలో అనేక అడ్డంకులను అధిగమించారని పేర్కొంది. జగన్‌కు స్టాలిన్ శుభాకాంక్షలు సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అభినందనలు. ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఐదోసారి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌కు స్టాలిన్ ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
అపస్మారక స్థితిలోనే జయ తరలింపు!
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానికి సంబంధించి కొత్త విషయం వెలుగుచూసింది. గత ఏడాది సెప్టెంబర్ 22న జయలలితను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించినప్పుడు ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని ఓ వైద్య నివేదిక స్పష్టంచేస్తోంది. నివేదికలోని వివరాల ప్రకారం.. ఆ రోజు రాత్రి పదింటికి పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసం నుంచి ఆస్పత్రికి అంబులెన్స్ కోసం ఫోన్ వెళ్లింది. రాత్రి 10.20 గంటలకు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తరలిస్తున్నప్పుడు ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆమె గుండె వేగం, రక్తపోటు, చక్కెరస్థాయిలు మరీ ఎక్కువగా ఉన్నాయని అత్యవసర విభాగంలో చేసిన పరీక్షల్లో తేలింది. న్యూమోనియా, థైరాయిడ్ సమస్యలనూ వైద్యులు గుర్తించారు. అత్యవసర విభాగంలో అందించిన వైద్య చికిత్సకు సంబంధించిన ఓ నివేదికలో ఈ వివరాలున్నాయి. ఓ తమిళ మీడియా ఈ నివేదికను బహిర్గతం చేసింది. తొలుత సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, ఈ నివేదిక అందుకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. జయలలిత మరణంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నివేదిక కలకలం రేపింది. -
అమెరికా ఎన్నికలపై.. ఉత్కంఠ
ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తమిళనాడులోనూ ఆసక్తి పెరిగింది. ఎక్కడ చూసినా, గెలుపు ఎవరికి దక్కేనో అన్న చర్చే. తమిళ మీడియా సైతం ఈవార్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఫలితాల ప్రత్యక్ష ప్రసారాలకు సైతం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఓ స్టార్ హోటల్లో అమెరికా దౌత్య కార్యాలయం నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక, చాణక్య చేపల జోస్యం ట్రంప్ వైపుగా మల్లడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. సాక్షి, చెన్నై : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ట్రంప్, హిల్లరీల మధ్య సమరం హోరాహోరీగా మారి ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం ఎన్నికలు జరగడం, బుధవారం ఫలితాల వెల్లడి కానునడంతో ప్రపంచ దేశాలు అమెరికా వైపుగా చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాట ఆ ఎన్నికలపై ఆసక్తి మరింతగా పెరిగి ఉన్నది. అమెరికాలో ఉన్న తమిళుల మద్దతు హిల్లరీకే అన్నట్టుగా పలు తమిళ మీడియా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, ఆ వార్తలకు ప్రాధాన్య ఇచ్చే పనిలో పడా ్డరుు. ఓ మీడియా అయితే, ఏకంగా అమెరికాకు ప్రతినిధుల్ని పంపించి , తమిళుల అభిప్రాయాల్ని లైవ్‌లో ప్రసారం చేస్తుండడంతో జనంలో ఫలితాల ఆసక్తి మరింతగా పెరిగింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఏడు గంటల నుం చి ఫలితాల వెల్లడి కానున్నడంతో అందరి దృష్టి గె లుపు ఎవరిదో అన్న అంశం మీద పడింది. ఎక్కడ చూసినా గెలుపు హిల్లరీ కే అంటూ కొందరు, ట్రం ప్కే అంటూ మరి కొందరు చర్చించుకుంటుం డటం గమనించాల్సిన విషయం. ఇక, ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించే విధంగా చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయం నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు జరగడం విశేషం. అడయార్‌లోని ఓ హోటల్లో ఫలితాల ప్రకటన, ప్రతినిధులతో చర్చ, వంటి కార్యక్రమాలు ఉదయం నుంచి సాగనున్నది.దీంతో ఫలితాల కోసం ఆత్రూతగా ఎదు రు చూసే జనం ఎక్కువే. తమిళనాడుతో హిల్లరికి ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఆమే పగ్గాలు చేపట్టాలన్న ఆకాంక్షతో ఎదురు చూసే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. గతంలో చెన్నైతో పాటుగా రాష్ట్రం లో అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటన సాగించి ఉండటం గమనార్హం. ట్రంప్ వైపు చాణక్య చూపు.. ట్రంప్, హిల్లరి మధ్య సమరం హోరాహోరీ అన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో చాణక్య చూపు ట్రంప్ వైపుగా మళ్లి ఉన్నది. ఇండియన్ కమ్యూనిటీ వెల్పేర్ ఆర్గనైజేషన్(ఐసీడబ్ల్యువో) ఆధ్వర్యంలో అన్నాగనర్‌లోని ప్రధాన కార్యాలయంలో చాణక్య జోస్యం కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. అక్వేరియంలో చాణక్య చేపను వదలిపెట్టారు. ట్రంప్, హిల్లరీ ఫొటోలను ఉంచారు. అయితే, చాణక్య చేప ట్రంప్ ఫొటోను తాకడంతో, ఆయన వైపు గెలుపు ఉండొచ్చన్నట్టుగా నిర్వాహకులు జోస్యం చెప్పారు. ఈవిషయంగా ఐసీడబ్ల్యువో వ్యవస్థాపక కార్యదర్శి ఏజే హరిహరన్ మీడియాతో మాట్లాడుతూ, క్రికెట్, ఫుట్‌బాల్ టోర్నీ వంటి సమయల్లో చాణక్య చేప ద్వారా ముందస్తుగా ఫలితాలను తాము జోస్యంగా తెలుసుకుంటూ వస్తున్నామన్నారు. ఈ చేప ఇచ్చే ఫలితాలు 90 శాతం మేరకు అనుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు. తాజాగా చాణక్య ట్రంప్ వైపుగా తన చూపును మరల్చి ఉన్నదన్నారు. -
శభాష్ శరత్‌కుమార్!
సాక్షి, చెన్నై: సమత్తువ మక్కల్ కట్చి నేత, ఎమ్మెల్యే, నటుడు శరత్‌కుమార్ శభాష్ అనిపించుకున్నారు. అసెంబ్లీలో మూడేళ్ల కాలంలో మూడు వేలకు పైగా ప్రశ్నల్ని సంధించి అందరి దృష్టిలో పడ్డారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. ఈ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయింది. నాలుగో ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ కాలంలో బడ్జెట్ సమావేశాలు, ఏడాది ఆరంభంలో తొలి సమావేశం, ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ 234 మంది సభ్యుల పనితీరు అసెంబ్లీలో ఏ మేరకు ఉన్నదో అన్న వివరాల్ని ఓ తమిళ మీడియా సేకరించింది. మెజారిటీ శాతం మంది సభ్యులు ప్రజా సమస్యలు తమ గిట్టనట్టుగా వ్యవహరించి ఉండటం గమనించాల్సిన విషయం. ప్రతి పక్షాలు అయితే, వాకౌట్లతో కాలయాపన చేశాయే గానీ, గంటల తరబడి సభలో కూర్చున సందర్భమే లేదు. ఈ పరిస్థితుల్లో సమత్తువ మక్కల్ కట్చి నేత, నటుడు, ఎమ్మెల్యే శరత్‌కుమార్ అందరి దృష్టిలో పడ్డారు. ఇందుకు కారణం సభకు ఆయన 46 శాతం రోజులు వచ్చినా, 3,288 ప్రశ్నలను సంధించడం విశేషం. అలాగే, అదేపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ 1744 ప్రశ్నలను లేవదీసి ఉన్నారు. శరత్‌కుమార్ సంధించిన ప్రశ్నల్లో 679 ప్రశ్నలకు స్టార్ హోదా కల్పించి ఉన్నారు. ఇక సభలో అత్యధిక సమయం నిలుచుని ప్రసంగం చేసిన వారిలో సీఎం జయలలిత ముందు వరుసలో ఉన్నారు. ఆమె ప్రతి రోజూ ప్రత్యేక ప్రకటనల్ని అసెంబ్లీలో ప్రకటించడం గమనార్హం. ఇక సభకు వంద శాతం మేరకు హాజరు అయిన వారిలో కేవలం 38 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా అన్నాడీఎంకే సభ్యులే. ప్రతి పక్ష సభ్యులు సభలో కన్నా, లాబీల్లో ఎక్కువ సమయం గడిపి ఉన్నారు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి కేవలం మూడు శాతం రోజులు మాత్రమే సభకు చుట్టుపు చూపుగా వచ్చి వెళ్లారు. ఆయన వీల్ చైర్‌కు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం నిరాకరించ బట్టే, సమావేశాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ కూడా అదే బాటలోనే ఉన్నారు. ఆయన 14 శాతం రోజులే సభలో అడుగుపెట్టారు.