అమెరికా ఎన్నికలపై.. ఉత్కంఠ
ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తమిళనాడులోనూ ఆసక్తి పెరిగింది. ఎక్కడ చూసినా, గెలుపు ఎవరికి దక్కేనో అన్న చర్చే. తమిళ మీడియా సైతం ఈవార్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఫలితాల ప్రత్యక్ష ప్రసారాలకు సైతం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఓ స్టార్ హోటల్లో అమెరికా దౌత్య కార్యాలయం నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక, చాణక్య చేపల జోస్యం ట్రంప్ వైపుగా
మల్లడంతో మరింత ఉత్కంఠ పెరిగింది.
సాక్షి, చెన్నై : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ట్రంప్, హిల్లరీల మధ్య సమరం హోరాహోరీగా మారి ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం ఎన్నికలు జరగడం, బుధవారం ఫలితాల వెల్లడి కానునడంతో ప్రపంచ దేశాలు అమెరికా వైపుగా చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాట ఆ ఎన్నికలపై ఆసక్తి మరింతగా పెరిగి ఉన్నది. అమెరికాలో ఉన్న తమిళుల మద్దతు హిల్లరీకే అన్నట్టుగా పలు తమిళ మీడియా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, ఆ వార్తలకు ప్రాధాన్య ఇచ్చే పనిలో పడా ్డరుు.
ఓ మీడియా అయితే, ఏకంగా అమెరికాకు ప్రతినిధుల్ని పంపించి , తమిళుల అభిప్రాయాల్ని లైవ్‌లో ప్రసారం చేస్తుండడంతో జనంలో ఫలితాల ఆసక్తి మరింతగా పెరిగింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఏడు గంటల నుం చి ఫలితాల వెల్లడి కానున్నడంతో అందరి దృష్టి గె లుపు ఎవరిదో అన్న అంశం మీద పడింది. ఎక్కడ చూసినా గెలుపు హిల్లరీ కే అంటూ కొందరు, ట్రం ప్‌కే అంటూ మరి కొందరు చర్చించుకుంటుం డటం గమనించాల్సిన విషయం.
ఇక, ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించే విధంగా చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయం నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు జరగడం విశేషం. అడయార్‌లోని ఓ హోటల్‌లో ఫలితాల ప్రకటన, ప్రతినిధులతో చర్చ, వంటి కార్యక్రమాలు ఉదయం నుంచి సాగనున్నది.దీంతో ఫలితాల కోసం ఆత్రూతగా ఎదు రు చూసే జనం ఎక్కువే. తమిళనాడుతో హిల్లరికి ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఆమే పగ్గాలు చేపట్టాలన్న ఆకాంక్షతో ఎదురు చూసే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. గతంలో చెన్నైతో పాటుగా రాష్ట్రం లో అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటన సాగించి ఉండటం గమనార్హం.
ట్రంప్ వైపు చాణక్య చూపు..
ట్రంప్, హిల్లరి మధ్య సమరం హోరాహోరీ అన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో చాణక్య చూపు ట్రంప్ వైపుగా మళ్లి ఉన్నది. ఇండియన్ కమ్యూనిటీ వెల్పేర్ ఆర్గనైజేషన్(ఐసీడబ్ల్యువో) ఆధ్వర్యంలో అన్నాగనర్‌లోని ప్రధాన కార్యాలయంలో చాణక్య జోస్యం కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. అక్వేరియంలో చాణక్య చేపను వదలిపెట్టారు. ట్రంప్, హిల్లరీ ఫొటోలను ఉంచారు. అయితే, చాణక్య చేప ట్రంప్ ఫొటోను తాకడంతో, ఆయన వైపు గెలుపు ఉండొచ్చన్నట్టుగా నిర్వాహకులు జోస్యం చెప్పారు. ఈవిషయంగా ఐసీడబ్ల్యువో వ్యవస్థాపక కార్యదర్శి ఏజే హరిహరన్ మీడియాతో మాట్లాడుతూ, క్రికెట్, ఫుట్‌బాల్ టోర్నీ వంటి సమయల్లో చాణక్య చేప ద్వారా ముందస్తుగా ఫలితాలను తాము జోస్యంగా తెలుసుకుంటూ వస్తున్నామన్నారు. ఈ చేప ఇచ్చే ఫలితాలు 90 శాతం మేరకు అనుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు. తాజాగా చాణక్య ట్రంప్ వైపుగా తన చూపును మరల్చి ఉన్నదన్నారు.