ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు | Cancel Elections and Declare Me Winner: Trump | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Published Fri, Oct 28 2016 9:22 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు - Sakshi

ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఎన్నికలు రద్దు చేసి తనను విజేతగా ప్రకటించాలని అన్నారు. హిల్లరీ అనుసరిస్తున్న విధానాలు చాలా చెత్తగా ఉన్నాయని ఆరోపించారు. అమెరికాలో ఎన్నికలకు మరో రెండు వారాల గడువుమాత్రమే ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పోటాపోటీగా దూసుకెళుతున్న ట్రంప్, హిల్లరీలు ఒకరిపై ఒకరు మాటల భాణాలు సందిస్తున్నారు. గురువారం ఓహియోలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ 'ఇప్పటికిప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే మనం వెంటనే ఎన్నికలు రద్దు చేయాలి. నన్ను విజేతగా ప్రకటించి నాకు అధికారం ఇవ్వాలి. ఎందుకంటే వారు ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తారు. మీడియా, ఇప్పటికే పాతుకుపోయిన ఉన్న నాయకులంతా నా వెనుక కుట్రలు చేస్తున్నారు' అని ట్రంప్ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement