అందరినీ కలుపుకుపోతాం | Donald Trump's Victory Speech | Sakshi
Sakshi News home page

అందరినీ కలుపుకుపోతాం

Published Thu, Nov 10 2016 2:15 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

అందరినీ కలుపుకుపోతాం - Sakshi

అందరినీ కలుపుకుపోతాం

 అమెరికా పునర్నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామే
 సహజ ధోరణికి విరుద్ధంగా ట్రంప్ ప్రసంగం
 నేను అమెరికన్లందరికీ అధ్యక్షుడిని

 
 న్యూయార్క్: విజయంతో వచ్చిన వినయం  ట్రంప్‌లో స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల విమర్శలకు దీటైన జవాబిచ్చిన ట్రంప్.. విజయోత్సవ వేడుకల్లో మాత్రం చాలా బాధ్యతగా స్పందించారు. తనకు సహకరించిన వారినీ, వ్యతిరేకించిన వారినీ కలుపుకుని ముందుకెళ్తానని స్పష్టం చేశారు. విమర్శలను పక్కనపెట్టి అమెరికా కోసం అందరం ఒక్కటిగా ముందుకెళ్లాలన్నారు. అనూహ్య విజయం తర్వాత తన ప్రచార ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విజయోత్సవ వేదికపైనుంచి తొలిసారి మద్దతుదారులను, అమెరికన్లనుద్దేశించి ప్రసంగించారు. ‘డెమొక్రాట్లు, రిపబ్లికన్లు, స్వతంత్రులు అందరూ అమెరికన్లే’ అని అన్నారు. ప్రసంగాన్ని ఉత్సాహంగా ప్రారంభించిన ట్రంప్.. అందరికీ ధన్యవాదాలు చెబుతూనే.. ‘పెన్సిల్వేనియా ఫలితం తేలగానే.. ఇంతకుముందే సెక్రటరీ(విదేశాంగ మంత్రి) హిల్లరీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు.
 
  హోరాహోరీ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించిన క్లింటన్‌కూ శుభాకాంక్షలు తెలిపాను’ అన్నారు. హిల్లరీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘దేశానికి ఆమె చేసిన సేవలకు మేం రుణపడి ఉన్నాం’ అని అన్నారు.‘ఈ విజయం నాకు చాలా కీలకం. నేను అమెరికన్లందరికీ అధ్యక్షుడిని. విభేదాలు పక్కనపెట్టి అమెరికన్లందరం ఒక్కటిగా ముందుకెళదాం’ అని అన్నారు. ‘మొదటినుంచి చెబుతున్నట్లుగానే మేం చేసింది ప్రచారం కాదు. ఉద్యమం. అమెరికాలోని అన్ని జాతులు, మతాలు, భిన్నరంగాల వారు, వివిధ విశ్వాసాల వాళ్లు ఇందులో భాగస్వాములు. వీరంతా తదుపరి వచ్చే ప్రభుత్వం ప్రజలకు సేవచేయాలనుకున్నారు. దేశాన్ని ప్రేమించే లక్షల మంది స్త్రీ, పురుషులు వారి కుటుంబం, దేశం ఉన్నతంగా, ఉజ్వలంగా ఉండాలని పరితపించారు.
 
 అదే ఈ ఫలితం’ అని అన్నారు. కలసి పనిచేయటమనేది జాతి పునర్నిర్మాణంలో, అమెరికన్ల ఆశలు నెరవేర్చటంలో తమ తొలి అత్యవసర పని అన్న ట్రంప్ అమెరికన్ల శక్తి సామర్థ్యాలు చాలా మెండుగా ఉన్నాయనే విషయం తనకు అవగతమైందన్నారు. మౌలిక వసతుల నిర్మాణంలో ప్రతి అమెరికన్‌ను భాగస్వామిని చేస్తామని తెలిపారు. ‘ఈ 18 నెలల్లో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. దేశాభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. మా వద్ద గొప్ప ఆర్థిక ప్రణాళికలున్నారుు.వృద్ధిని రెండింతలు చేస్తాం. అన్ని దేశాలను కలుపుకుని ముందుకెళ్తాం’ అన్నారు.  తల్లిదండ్రులకు గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతల కార్యక్రమాన్ని ప్రారంభించిన ట్రంప్ వారి నుంచి చాలా నేర్చుకున్నానన్నారు.
 
 చెల్లెల్లు మర్యానే, ఎలిజబెత్, సోదరులు రోబర్ట్, ఫ్రెడ్ (దివంగత) లకూ ధన్యవాదాలు తెలిపారు. గొప్ప తల్లిదండ్రులు, సోదర, సోదరీమణులు తనకున్నందుకు అదృష్టవంతుడినన్నారు. ‘భార్య మెలానియా, కూతురు ఇవాంకా, ఎరిక్, టిఫానీ, బారన్, లారా, వెనెస్సా.. కష్ట సమయంలో మీరందించిన ప్రోత్సాహం వల్లే ఈ విజయోత్సవం జరుగుతోంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్‌‌స గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. మా బృందంలోని కెల్యానే, క్రిస్, రూడీ, స్టీవ్, డేవిడ్ (వీరందరూ ట్రంప్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేశారు)అందరికీ ధన్యవాదాలు.. రెండు, మూడేళ్లు, నాలుగేళ్ల తర్వాత.. ఎనిమిదేళ్ల తర్వాతైనా కావొచ్చు. మీరంతా అధ్యక్షుడంటే గర్వపడేలా పనిచేస్తా. ప్రచారం అరుుపోరుుంది. పని ప్రారంభించటమే మిగిలుంది’ అని అన్నారు.
 
1820 తర్వాత మళ్లీ...
 న్యూయార్క్: ట్రంప్ గెలుపుతో భార్య మెలానియా అమెరికా ప్రథమ మహిళ కానున్నారు. అరుుతే ఆమె జన్మతః అమెరికన్ కాకపోవడంతో.. 1820 తర్వాత విదేశాల్లో పుట్టి ప్రథమ మహిళగా హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కనున్నారు. 1825-29 మధ్య అమెరికా ఆరో అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ క్విన్సీ ఆడమ్స్ భార్య లూసియా లండన్‌లో జన్మించారు. దాంతో జన్మతః అమెరికన్ కాకుండా ప్రథమ మహిళ హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు. మాజీ మోడల్ అయిన 46 ఏళ్ల మెలానియా 1970లో నాటియుగొస్లావియాలో జన్మించారు. 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ వృత్తిలోకి ప్రవేశించిన మెలానియా.. స్లోవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలు మాట్లాడగలరట. 1998లో ఆమె న్యూయార్క్‌లో ఓ ఫ్యాషన్ పార్టీలో ట్రంప్‌ను కలుసుకున్నారని, 2005లో ఫ్లోరిడాలో పెళ్లి చేసుకున్నారని సమాచారం. 1998లో అప్పటికే ట్రంప్ రెండో భార్యనుంచి విడాకులు తీసుకున్నారని అంటారు.
 
 వివాదాల ముద్దుబిడ్డ
 అమెరికా అధ్యక్షుడిగా అనూహ్యంగా విజయం సాధించిన ట్రంప్‌కు తొలినుంచీ వివాదాలతోనే సహజీవనం. అరుుతే అనుకున్నది సాధించటంలోనూ ట్రంప్ చాలా పట్టుదలగా వ్యవహరిస్తారనే పేరుంది. యువకుడిగా ఉన్నప్పుడే తండ్రి దగ్గర్నుంచి అప్పుతీసుకుని వ్యాపారం మొదలుపెట్టి.. తర్వాత మళ్లీ తండ్రి కంపెనీలోనే ఉద్యోగిగా చేరారు. తర్వాత అమెరికాలోనే, ప్రపంచంలోనే ఉత్తమ నివాససముదాయాల ప్రాజెక్టులను నిర్మించి శభాష్ అనిపించుకున్నారు.సినిమారంగంపై మక్కువ, సెలబ్రిటీలతో పరిచయం, టీవీ కార్యక్రమాల నిర్వహణ ద్వారా వివాదాలతో నూ సావాసం మొదలైంది. 1977లో తొలి వివాహం, తర్వాత గ్లామర్ ప్రపంచంలో పరిచయాలతో రెండు, మూడో పెళ్లిళ్లు చేసుకున్నాడు.
 
  ప్రస్తుత భార్య మెలానియా.. స్లోవేకియా మోడల్. ఈమె వర్క్ వీసాపై వచ్చి ఇక్కడ సెటిలైందనే విమర్శలున్నారుు. ట్రంప్ కంపెనీలో పనిచేసే చాలా మంది అమ్మాయిలు ఇలాగే వచ్చామని వెల్లడించారు. మహిళల విషయంలో ట్రంప్‌పై చాలా వివాదాలున్నారుు. తనకు 13 ఏళ్ల వయసులో పలుమార్లు ట్రంప్ అత్యాచారం చేశాడంటూ 20 ఏళ్ల తర్వాత ఇటీవల ఓ మహిళ ఆరోపించింది. అంతే కాదు సొంత కూతురిపైనా పచ్చిబూతులు మాట్లాడిన వీడియో ఒకటి ఎన్నికలకు ముందు విడుదలవటం.. దీనిపై ట్రంప్ పశ్చాత్తాపం వ్యక్తం చేయటం తెలిసిందే.
 
 అటు రాజకీయ పరంగానూ ట్రంప్ రూటే సెపరేటు. అమెరికా అధ్యక్షుడు కావాలన్న ప్రగాఢమైన కాంక్షతో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల్లోకి పలుమార్లు మారారు. రియల్ ఎస్టేట్ దిగ్గజంగా పరిచయం ఉన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ద్వారానే అమెరికన్లకు బాగా సుపరిచితుడైన ట్రంప్ మహిళలతో అసభ్యంగా వ్యవహరిస్తాడని ప్రత్యర్థి జట్టు బలంగా ప్రచారం చేసింది. ఈయన వివాదాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసి విపరీతంగా ప్రచారం చేసింది. కానీ.. ఇవేవీ ట్రంప్ విజయాన్ని ప్రభావితం చేయలేకపోయాయి. వివాదాలెన్నున్నా.. ఈయన్ను శ్వేతసౌధానికి పంపించారు అమెరికన్లు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement