హిల్లరీ ఊపిరి.. ట్రంపు ముంపు! | Special story on US presidential elections 2016 | Sakshi
Sakshi News home page

హిల్లరీ ఊపిరి.. ట్రంపు ముంపు!

Published Tue, Nov 8 2016 1:06 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

హిల్లరీ ఊపిరి.. ట్రంపు ముంపు! - Sakshi

హిల్లరీ ఊపిరి.. ట్రంపు ముంపు!

ఇదీ.. మార్కెట్ల తాత్కాలిక వైఖరి
రేపు మార్కెట్ల ఆరంభంకల్లా తొలి ఫలితాలు
ఫలితమేదైనా తక్షణ స్పందన దూకుడుగానే!
మధ్య, దీర్ఘకాలంలో దేశీ మార్కెట్లు పటిష్ఠమే
 హిల్లరీ గెలిస్తే డిసెంబర్లో ఫెడ్ రేటు పెంపు చాన్స్
 మన మార్కెట్లకు ట్రంప్ కన్నా పెద్ద సమస్య ఫెడ్ రేటే
 మెల్లగా డాలరు నిధులు తరలిపోయే అవకాశం
 ట్రంప్ గెలిస్తే తక్షణం బారీ పతనానికి అవకాశం
  ఫెడ్ రేటు మాత్రం పెరగకపోవచ్చు...

 
 సాక్షి, బిజినెస్ విభాగం  :

 హిల్లరియా.. ట్రంపా?
 మరో 24 గంటల్లో ఈ ప్రశ్నకు సమాధానం రావచ్చు. కానీ ఆ సమాధానం వచ్చాక మన మార్కెట్ల పరిస్థితేంటి? ఎగబాకుతాయా? పడిపోతాయా? మామూలుగా ఉంటాయా? ఇవే ఇపుడు ఇన్వెస్టర్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజంగా అమెరికా ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. అధ్యక్ష ఎన్నికా అందుకు అతీతమేమీ కాదు. గెలుపోటములు ఇద్దరి మధ్యా ఎలా దోబూచులాడుతున్నాయో... గత 10 రోజులుగా మార్కెట్లలో హెచ్చుతగ్గులూ అలాగే ఉంటున్నారుు. దాదాపు 7-8 రోజులపాటు మన మార్కెట్ దాదాపు 5 శాతం పతనంకాగా, సోమవారం 1.2 శాతం వరకూ ర్యాలీ జరిపింది.
 
 డొనాల్డ్ ట్రంప్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలతో సహా వివిధ అంశాలపై చేస్తున్న ప్రకటనలతో ఈక్విటీ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఏదో ఒరిగిపోతుందన్న భావన లేనప్పటికీ, ప్రస్తుత విధానాలు కొనసాగుతాయన్న ఆశాభావంతో ఇన్వెస్టర్లు స్థిమితంగా ఉన్నారు. ట్రంప్ గెలిస్తే ప్రపంచ మార్కెట్లు మరో 3-5% మధ్య క్షీణించవచ్చని సిటీ గ్రూప్ అంచనావేస్తుండగా, హిల్లరీ విజయం సాధిస్తే... మార్కెట్లు ఇప్పటివరకూ చవిచూసిన నష్టశాతాన్ని పూడ్చుకోవొచ్చన్న అంచనాలున్నాయి.  2-4% మధ్య పెరగవచ్చు.
 
 హిల్లరీ గెలిస్తేనే ఫెడ్ రేటు పెంపు!!
 విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే... గెలుపోటములు వెల్లడైన ఒక్కరోజులో ఏమీ జరిగిపోదు. కానీ మార్కెట్ల స్పందన తాత్కాలికమే అ యినా ఆ రోజు దూకుడుగానే ఉంటుంది.  మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం క్లింటన్ గెలిస్తే డిసెంబర్‌లో ఫెడ్ తన ఫండ్ రేటును పెంచే అవకాశాలుంటాయి. రేట్ల పెంపునకు అనువైన దిశగా అక్కడి జాబ్స్ మార్కెట్ మెరుగుపడటం, ద్రవ్యోల్బణం పెరగడం జరుగుతోంది. దీంతో ఆ నెలలో రేట్ల పెంపునకు 80% వరకూ అవకాశాలున్నట్లు అక్కడి ఫెడ్ ఫండ్‌‌స ఫ్యూచర్స్‌లో జరుగుతున్న ట్రేడింగ్ సూచిస్తోంది. అందుకే హిల్లరీ అనుకూల ప్రీపోల్ సర్వే ప్రభావంతో సోమవారం డాలరు ఇండెక్స్ భారీగా పెరిగింది. మరోవైపు బంగారం ధర పడిపోయింది.అమెరికా స్టాక్ మార్కెట్లు, ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లకంటే పెద్ద ర్యాలీ జరుపుతున్నాయి. అక్కడ వడ్డీ రేట్ల పెంపు భారత్‌లాంటి వర్థమాన మార్కెట్లకు ముప్పుగానీ, అమెరికాకు కాదు. ఇతర దేశాల్లోకి తరలివెళ్లిన డాలరు పెట్టుబడులన్నీ మళ్లీ స్వదేశానికొచ్చే అవకాశాలుండటమే ఇందుకు కారణం.
 
 అరుుతే ట్రంప్ గెలిస్తే ఫైనాన్షియల్ మార్కెట్లు తాత్కాలికంగా అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంటుంది. రష్యా వంటి ఒకటి రెండు దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లూ కరెక్షన్‌కు గురవుతారుు. పరిస్థితులు దిగజారుతాయి కనక డిసెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో డాలరు బలహీనపడుతుంది. బంగారం ధర పెరుగుతుంది. కానీ ఇది భారత్ స్టాక్ మార్కెట్‌కు దీర్ఘకాలంలో అంత సమస్యాత్మకమేమీ కాదని విశ్లేషకులు వాదిస్తున్నారు. ఎందుకంటే భారత్, ఇండోనేషియా వంటి మార్కెట్లు సొంత వృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్నాయని, అందుకని వీటికి సమస్యలొచ్చినా అవి తాత్కాలికమేనని వారు చెబుతున్నారు.
 
 వడ్డీ రేట్ల పెరుగుదలే పెద్ద రిస్క్....
 గతేడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచాక రెండు నెలలపాటు మన మార్కెట్ 20 శాతం వరకూ పడిపోరుుంది. ఇక్కడి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.40,000 కోట్లకుపైగా నిధుల్ని ఉపసంహరించుకోవటమే ఇందుకు కారణం. ఈ డిసెంబర్‌లో రేట్లు పెరిగితే మరింత భారీగా నిధులు మన మార్కెట్ నుంచి తరలివెళ్లే అవకాశాలుంటాయి. విదేశీ ఇన్వెస్టర్లు గడిచిన రెండేళ్లుగా ఇండియాలో ఈక్విటీ కంటే డెట్ మార్కెట్లోనే అత్యధికంగా పెట్టుబడి పెట్టారు. అమెరికాలో రేట్లు పెరిగితే... వారికి ఇక్కడ బాండ్ల నుంచి వచ్చే కరెన్సీ రిస్క్‌తో కూడిన 7-8 శాతం రాబడి ఆకర్షణీయంగా కనిపించదు. పైగా అమెరికా బాండ్లు ఆకర్షణీయంగా మారతారుు. దాంతో ఇక్కడి డెట్ మార్కెట్ నుంచి డాలరు నిధుల్ని వారు తరలించుకుపోయే ప్రమాదం ఉటుంది. . కానీ ట్రంప్ గెలిస్తే ఫెడ్ రేట్ల పెంపు భయం ఉండదని, దాంతో తాత్కాలికంగా స్టాక్ మార్కెట్ పడిపోరుునా, మధ్యకాలికంగా తిరిగి పుంజుకుంటుందని, నిధులు తరలివెళ్లే ప్రమాదం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.
 
 ఎవరు గెలిస్తే ఏమవుతుందో..
 అమెరికన్ స్టాక్స్                      

 ట్రంప్ గెలిస్తే: పతనం కావచ్చు. హెచ్చుతగ్గులు పెరుగుతాయి. ఫైనాన్షియల్ స్టాక్స్ దెబ్బతింటాయి. దీర్ఘకాల ఇన్‌ఫ్రా షేర్లు బాగుంటాయి.
 
 హిల్లరీ గెలిస్తే: ఈ మధ్య జరిగిన పతనాన్ని పూడుస్తూ ర్యాలీ జరగొచ్చు. బ్యాంకులు, ఫార్మా సంస్థలు నియంత్రణ భయాలతో దెబ్బతినొచ్చు.
 
 అమెరికన్ డాలర్
 ట్రంప్: రక్షణాత్మక వాదం కారణంగా అభివృద్ధి చెందిన స్విస్ ప్రాంక్, జపాన్ యెన్ వంటి కరెన్సీలతో పోలిస్తే పడిపోవచ్చు. కానీ పన్ను రాయితీలు, వ్యయం పెరిగితే మెల్లగా కోలుకోవచ్చు.
 
 హిల్లరీ: అభివృద్ధి చెందిన కరెన్సీలతో పోలిస్తే పెరగొచ్చు. రూపాయి వంటి వర్థమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే పెద్దగా మార్పు ఉండదు.
 
 కమోడిటీలు
 ట్రంప్: అందరూ ఇటే చూస్తారు కనక బంగారం, ఇతర విలువైన లోహాలు బాగా పెరుగుతాయి. ఇరాన్ వ్యతిరేక వైఖరితో చమురు ధరలు స్థిరంగా ఉండొచ్చు. బొగ్గుకు అనుకూల వైఖరి గ్యాస్‌కు మంచిదికాదు.
 
 హిల్లరీ: చమురు, బొగ్గుకు హిల్లరీ విధానాలు ఏమంత అనుకూలం కావు. సంప్రదాయేతర ఇంధన వనరులకు మంచి రోజులొస్తారుు.
 
 అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు
 ట్రంప్: వాణిజ్య ఒప్పందాలపై దాటవేత వైఖరి వల్ల రష్యాకు తప్ప ఇతర దేశాల మార్కెట్లకు ప్రతికూలమే. పటిష్ఠ ఆర్థిక వ్యవస్థల కారణంగా ఇండియా వంటి మార్కెట్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.
 
 హిల్లరీ: రిస్కుతో కూడిన ఇన్వెస్ట్‌మెంట్లవైపు మరిన్ని అమెరికన్ కంపెనీలు మొగ్గు చూపుతాయి. విదేశీ మార్కెట్లలో సానుకూల పరిస్థితి ఉంటుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement