గజపతినగరం సభలో మాట్లాడుతున్న పవన్
గజపతినగరం : అధికార దాహంతో టీడీపీ నేతలు కనిపించిందల్లా కబ్జా చేస్తూ అక్రమ మైనింగ్, ఇసుక మాఫియాతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు దోచుకోవడం తప్ప వేరే వ్యాపకం లేదన్నారు. జనసేన ప్రజా పోరాటయాత్రలో భాగంగా గజపతినగరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పవన్ విరుచుకు పడ్డారు.
విభజన సమయంలో అనుభం ఉన్న నాయకుడు ఉండాలనే ఉద్యేశంతో కొమ్ముకాస్తే... రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని, ప్రజాధనం కూడబె ట్టుకుంటున్నారన్నారు. వారు చేసే దోపిడీకి ఆధారాలు ఉన్నాయా అని సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రశ్ని స్తున్నారని... వారి అవినీతికి, దోపిడీకి ఎవరైనా రశీదులు, బిల్లులు ఇస్తారా అని చమత్కరించారు. స్థానిక ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు అధికారులపై జులుం చూపిస్తున్నారని, చం పావతి నదిని డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అగ్రిగరోల్డ్ బాధితుల సమస్యలు ఎదురవుతున్నాయని, అధికార పార్టీ పెద్దలు అగ్రిగోల్డ్ భూములను లాక్కుంటే జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వద్దనుం చి లాక్కుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర సీఎంకు ప్రజాసంక్షేమ పథకాలకు, రైతు రుణ మాఫీకి, ప్రజారోగ్యానికి, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులను రెగ్యులరైజ్ చేసేం దుకు నిధులు లేవని, తన అనుచరునికి రూ. 500 కోట్లతో ఫైబర్‌నెట్‌కి అనుమతులు ఇచ్చేం దుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా సీఎం నివాసం ఏర్పరచుకున్నారని, చంద్రబాబు నివాసాలకు రూ.కోట్లు ఖర్చు పెడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి అవసరమైన సాగునీటిప్రాజెక్టులకు నిధులు ఉండవు.. పుష్కరాలకు కోట్లాది రూపాయలు ఖర్చులు చేస్తారంటూ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment