gajapathi nagaram
-
రాజకీయాల్లో అవినీతికి అడ్రస్ చంద్రబాబే : ఎమ్మెల్యే అప్పల నర్సయ్య
-
విజయనగరం జిల్లా వాసుల్ని వెంటాడుతున్న పులి భయం
-
ఇక్కడి పంచాయతీ ఓటు .. ఎమ్మెల్యేకు రూటు
బొండపల్లి: జిల్లాలోని అన్ని గ్రామాలతో పోల్చితే గజపతినగరం మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీగా గుర్తింపుపొందింది పురిటిపెంట గ్రామం. గజపతినగరం నియోజకవర్గంలోని ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఓటర్ల పరంగా అధికమేకాకుండా ఈ గ్రామంలో ఓటరుగా నమోదైన వారే అధికంగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆ విశేషాలను ఓసారి పరిశీలిస్తే... ప్రసుత్త శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య పదిహేను సంవత్సరాలకుపైగానే పురిటిపెంటలోని మండలవారి కాలనీలో స్ధిరనివాసం ఏర్పరుచుకొని మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు గెలుపొందారు. అయనతోపాటు అయన కటుంబ సభ్యులందరి ఓట్లు కూడా ఈ పంచాయతీలోనే ఉన్నాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి పడాల అరుణ కూడా పురిటిపెంటలోని న్యూ కాలనీలో ఎంపీడీఓ కార్యాలయానికి పక్కన స్థిరనివాసం ఏర్పరుచుకొని ఓటు హక్కును ఇక్కడే వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణప్పలనాయుడు కూడా పురిటిపెంటలోని న్యూకాలనీలోనే నివాసం ఏర్పరుచుకొని ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇలా ఇక్కడ ఓటరుగా నమోదైనవారే ఎమ్మెల్యే పదవులను అలంకరించడం ఓ విశేషంగా చెప్పుకుంటున్నారు. చదవండి: 82 శాతానికి పైగా సీట్లలో వైఎస్సార్సీపీ అభిమానుల విజయ భేరి -
ఒక అసెంబ్లీ... ఇద్దరు ఎమ్మేల్యేలు...
సాక్షి, అమరావతి: ఎన్నికలు మొదలైన తొలి దశకంలో కొన్నిచోట్ల ద్విసభ్య (ఇద్దరు సభ్యుల) నియోజకవర్గాలు ఉండేవి. వాటిలో ఒకటి ఎస్సీలకు, మరొకటి జనరల్‌కు కేటాయించేవారు. అప్పట్లో ఎస్సీ ఓటర్లు అధికంగా ఉండేచోట్ల ఈ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యేవారు. 1962 ఎన్నికల నుంచి ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. శ్రీకాకుళం, అదే జిల్లాలో పాతపట్నం ద్విసభ్య నియోజకవర్గాలుగా ఉండేవి. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, గజపతినగరం, విజయనగరం, శృంగవరపుకోట ద్విసభ్య స్థానాలు ఉండేవి. విశాఖ జిల్లాకు వస్తే.. పాడేరు (అప్పట్లో గొలుగొండ), నర్సీపట్నంలో ఈ స్థానాలు ఉండేవి. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు (అప్పట్లో పల్లిపాలెం. 2009లో రద్దయిన నియోజకవర్గం), కాకినాడ, అమలాపురం, రాజోలు, రాజానగరం నియోజకవర్గాలు ద్విసభ్య జాబితాలో ఉండేవి. పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే.. కొవ్వూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం ఉండేవి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ (అప్పట్లో దివి), ప్రకాశం జిల్లా ఒంగోలు, కందుకూరు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం (ప్రస్తుతం కోవూరు), నెల్లూరు, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు ద్విసభ్య స్థానాలుగా ఉండేవి. కడప జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని, అనంతపురం జిల్లా గుంతకల్లు, కల్యాణదుర్గం, హిందూపూర్, ధర్మవరం, చిత్తూరు జిల్లా పుంగనూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు నియోజకవర్గాల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను ఎన్నుకునేవారు. ఈ నియోజకవర్గాల్లో ప్రతి ఓటరు ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం ఉండేది. గుంటూరు జిల్లాలో మాత్రం ఒక్కటి కూడా ద్విసభ్య నియోజకవర్గం లేకపోవటం గమనార్హం. గుర్తుందా! 1967కి ముందు విశాఖ నగరం మొత్తం ఒకే నియోజకవర్గంగా ఉండేది. 1967లో ఇది విశాఖ–1, విశాఖ–2 స్థానాలుగా విడిపోయింది. 2009లో ఆ రెండు నియోజకవర్గాలు రద్దవగా, పునర్విభజనతో విశాఖ (తూర్పు), విశాఖ (పశ్చిమ), విశాఖ (దక్షిణం), విశాఖ (ఉత్తరం) నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. అదే ఏడాది పరవాడ నియోజకవర్గం రద్దవగా, ఆ స్థానంలో గాజువాక ఏర్పాటైంది. 1955, 62 ఎన్నికల్లో కొండకర్ల నియోజకవర్గం ఉండేది. 1967లో అది రద్దయ్యింది. 1962 ఎన్నికల్లో బొడ్డం నియోజకవర్గం ఉండేది. ఆ తరువాత రద్దయ్యింది. 1955 ఎన్నికల్లో గూడెం (ఎస్టీ) నియోజకవర్గం ఉండేది. 1962 ఎన్నికల్లో అది చింతపల్లి (ఎస్టీ)గా మారింది. 2009 పునర్విభజనలో చింతపల్లి రద్దయి, ఆ స్థానంలో అరకు (ఎస్టీ) ఏర్పాటైంది. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఏర్పాటైన గొలుగొండ 1967లో రద్దయ్యి, పాడేరు (ఎస్టీ) ఏర్పాటైంది. 1967లో ఏర్పడిన జామి నియోజకవర్గం 1978లో రద్దయి పెందుర్తి నియోజకవర్గం తెరపైకి వచ్చింది. -
పూరింట్లో కలెక్టర్
గజపతినగరం : ఇక్కడ పూరింట్లో మంచంపై కూర్చున్నదెవరో తెలుసా... సాక్షాత్తూ జిల్లా కలెక్టరే. గజపతినగరం మండలంలో పర్యటనకు వచ్చిన ఆయన అక్కడి దిగువ వీధిలో ఉన్న హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ దారి లో గంట్రేటి లక్ష్మి అనే వృద్ధురాలు కలెక్టర్ హరిజవహర్ లాల్‌ను కలసి తాను నివాసం ఉంటున్న ఇంటి కి పట్టా ఇప్పించాలని ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగలేదని చెప్పగా వెంటనే ఆయన ఆమె గుడిసెలోకి వెళ్లి మంచంపై కూ ర్చుని ఆమె కష్టసుఖాలు తెలుసుకున్నారు. అంతేగాదు తహసీల్దార్ శేషగిరికి ఫోన్ చేసి తక్షణమే ఆమెకు పట్టామంజూరు చేయాలని ఆదేశించారు. దీంతో ఆమె ఉబ్బి తబ్బిబ్బయ్యింది. -
టీడీపీ నేతలపై విరుచుకుపడిన పవన్‌కల్యాణ్
గజపతినగరం : అధికార దాహంతో టీడీపీ నేతలు కనిపించిందల్లా కబ్జా చేస్తూ అక్రమ మైనింగ్, ఇసుక మాఫియాతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు దోచుకోవడం తప్ప వేరే వ్యాపకం లేదన్నారు. జనసేన ప్రజా పోరాటయాత్రలో భాగంగా గజపతినగరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పవన్ విరుచుకు పడ్డారు. విభజన సమయంలో అనుభం ఉన్న నాయకుడు ఉండాలనే ఉద్యేశంతో కొమ్ముకాస్తే... రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని, ప్రజాధనం కూడబె ట్టుకుంటున్నారన్నారు. వారు చేసే దోపిడీకి ఆధారాలు ఉన్నాయా అని సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రశ్ని స్తున్నారని... వారి అవినీతికి, దోపిడీకి ఎవరైనా రశీదులు, బిల్లులు ఇస్తారా అని చమత్కరించారు. స్థానిక ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు అధికారులపై జులుం చూపిస్తున్నారని, చం పావతి నదిని డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అగ్రిగరోల్డ్ బాధితుల సమస్యలు ఎదురవుతున్నాయని, అధికార పార్టీ పెద్దలు అగ్రిగోల్డ్ భూములను లాక్కుంటే జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వద్దనుం చి లాక్కుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర సీఎంకు ప్రజాసంక్షేమ పథకాలకు, రైతు రుణ మాఫీకి, ప్రజారోగ్యానికి, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులను రెగ్యులరైజ్ చేసేం దుకు నిధులు లేవని, తన అనుచరునికి రూ. 500 కోట్లతో ఫైబర్‌నెట్‌కి అనుమతులు ఇచ్చేం దుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా సీఎం నివాసం ఏర్పరచుకున్నారని, చంద్రబాబు నివాసాలకు రూ.కోట్లు ఖర్చు పెడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి అవసరమైన సాగునీటిప్రాజెక్టులకు నిధులు ఉండవు.. పుష్కరాలకు కోట్లాది రూపాయలు ఖర్చులు చేస్తారంటూ దుయ్యబట్టారు. -
పచ్చకామెర్లతో దంపతుల మృతి
-
విషజ్వరంతో భార్యాభర్తలు మృతి
గజపతినగరం (విజయనగరం): విష జ్వరం బారిన పడిన భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగాచాల్లపెంట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గొంత రాము, పాపమ్మ దంపతులు విషజ్వరంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందారు. దీంతో వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు. -
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
గజపతినగరం: విజయనగరం జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 15 ఇళ్లు కాలి బూడిదైపోయాయి. ఈ సంఘటన గజపతినగరం మండలం మరుపెల్లి గ్రామంలో శుక్రవారం సాయత్రం జరగింది. ప్రమాద వశాత్తూ అగ్ని కీలలు ఎగిపిపడటంతో పాటు వాటికి గాలి కూడా తోడవడంతో.. మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘట నా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 15 ఇళ్లు కాలిపోగా ఇంకా మంటలు వ్యాపిస్తుండటంతో ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందో తెలియరాలేదు. -
రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు దుర్మరణం
గజపతినగరం: విజయనగరం జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కొత్త పెళ్లికొడుకు మృతి చెందాడు. గజపతినగరం మండలం మధుపాడ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మానాపురం నుంచి గజపతి నగరం వెళ్తున్న వ్యాన్ ఎదురుగా విజయనగరం నుంచి బొబ్బిలి వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో వ్యాన్ డ్రైవర్ రాజు (24) మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఈ మధ్యనే వివాహం అయినట్లు సమాచారం. రాజు మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.