ఇక్కడి పంచాయతీ ఓటు .. ఎమ్మెల్యేకు రూటు | Puritipenta Panchayat Voters As MLAs In Srikakulam District | Sakshi
Sakshi News home page

ఇక్కడి పంచాయతీ ఓటు .. ఎమ్మెల్యేకు రూటు

Published Wed, Feb 10 2021 8:12 AM | Last Updated on Wed, Feb 10 2021 10:35 AM

Puritipenta Panchayat Voters As MLAs In Srikakulam District - Sakshi

పురిటిపెంట గ్రామ వ్యూ

బొండపల్లి: జిల్లాలోని అన్ని గ్రామాలతో పోల్చితే గజపతినగరం మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీగా గుర్తింపుపొందింది పురిటిపెంట గ్రామం. గజపతినగరం నియోజకవర్గంలోని ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఓటర్ల పరంగా అధికమేకాకుండా ఈ గ్రామంలో ఓటరుగా నమోదైన వారే అధికంగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.

విశేషాలను ఓసారి పరిశీలిస్తే... 

  • ప్రసుత్త శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య పదిహేను సంవత్సరాలకుపైగానే పురిటిపెంటలోని మండలవారి కాలనీలో స్ధిరనివాసం ఏర్పరుచుకొని మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు గెలుపొందారు. అయనతోపాటు అయన కటుంబ సభ్యులందరి ఓట్లు కూడా ఈ పంచాయతీలోనే ఉన్నాయి.  
  • నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి పడాల అరుణ కూడా పురిటిపెంటలోని న్యూ కాలనీలో ఎంపీడీఓ కార్యాలయానికి పక్కన స్థిరనివాసం ఏర్పరుచుకొని ఓటు హక్కును ఇక్కడే వినియోగించుకున్నారు.  
  • మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణప్పలనాయుడు కూడా పురిటిపెంటలోని న్యూకాలనీలోనే నివాసం ఏర్పరుచుకొని ఓటు హక్కు కలిగి ఉన్నారు.   ఇలా ఇక్కడ ఓటరుగా నమోదైనవారే ఎమ్మెల్యే పదవులను అలంకరించడం ఓ విశేషంగా చెప్పుకుంటున్నారు.

చదవండి:  82 శాతానికి పైగా సీట్లలో వైఎస్సార్‌సీపీ అభిమానుల విజయ భేరి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement