విష జ్వరం బారిన పడిన భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగాచాల్లపెంట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది.
గజపతినగరం (విజయనగరం): విష జ్వరం బారిన పడిన భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగాచాల్లపెంట గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గొంత రాము, పాపమ్మ దంపతులు విషజ్వరంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందారు. దీంతో వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు.