రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు దుర్మరణం | new groom died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు దుర్మరణం

Published Fri, Nov 6 2015 2:34 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

new groom died in road accident

గజపతినగరం: విజయనగరం జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కొత్త పెళ్లికొడుకు మృతి చెందాడు. గజపతినగరం మండలం మధుపాడ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

మానాపురం నుంచి గజపతి నగరం వెళ్తున్న వ్యాన్ ఎదురుగా విజయనగరం నుంచి బొబ్బిలి వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో వ్యాన్ డ్రైవర్ రాజు (24) మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఈ మధ్యనే వివాహం అయినట్లు సమాచారం. రాజు మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement