new groom died
-
తెల్లారితే పెళ్లి.. అంతలోనే మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా: కాసేపట్లో పెళ్లి జరగాల్సిన ఇంట... నవ వరుడి ఆకస్మిక మరణంతో విషాదం చోటు చేసుకుంది. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నెబోయిన యాదయ్య, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నవీన్ యాదవ్ (24) అలియాస్ గురుకి ఇటీవలే బంధువుల అమ్మాయితో వివాహం ఖాయం కాగా.. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం ఉదయం ఎప్పట్లాగే నవీన్ తమ వ్యవసాయబావి వద్ద కోళ్లఫారంలో కోళ్లకు దాణా పెట్టేందుకు వెళ్లాడు. పెండ్లి కొడుకును చేసే సమయం అవుతున్నా నవీన్‌యాదవ్ ఇంటికి రాకపోవడంతో అతడి సోదరుడు కోళ్లఫారం వద్దకు వెళ్లాడు. అక్కడ నవీన్‌యాదవ్ విగతజీవిగా పడి ఉన్నాడు. నవీన్ మృతికి కారణాలు తెలియరాలేదు. అతని అంత్యక్రియలు బుధవారం సాయంత్రం పూర్తి చేశారు. -
రెండు నెలల కిందటే వివాహం.. మృత్యువు దారి కాచి మరీ వరుడిని మింగేసింది...
ఆ నవ వధువు కలలన్నీ ఛిద్రమైపోయాయి. ఆ కుటుంబంలోని ఆనందమంతా ఆవిరైపోయింది. చదువు, ఉద్యోగం, వివాహం అంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన ఆ యువకుడి జీవితం అక్కడితోనే ముగిసిపోయింది. కొల్లవానిపేట రైల్వేగేటు వద్ద కాపు కాచిన మృత్యుదేవత నవ వరుడిని తనతో తీసుకెళ్లిపోయింది. రెండు నెలల కిందటే వివాహం చేసుకున్న ఆ యువకుడి మృతితో కుటుంబం తల్లడిల్లిపోయింది. నరసన్నపేట: చక్కగా చదువుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. మరో ఉద్యోగినితో వివాహం జరిగింది. ఇక జీవితమంతా హాయిగా కలిసి బతక వచ్చని ఆశ పడిన ఆ వధూవరులపై విధి పగబట్టింది. మృత్యువు దారి కాచి మరీ వరుడిని మింగేసింది. నరసన్నపేట మండలం కామేశ్వరిపేటలో సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మట్ట సోమేశ్వరరావు (28) కొల్లవానిపేట రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం 10.20 గంటల సమయంలో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదు నిమిషాల్లో కామేశ్వరిపేట చేరుకుంటాడనగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని బలగకు చెందిన మట్ట శ్యామలరావు కుమారుడు సోమేశ్వరరావు చక్కగా చదువుకున్నాడు. సచివాలయంలో ఇంజినీరింగ్ సహాయకుడిగా ఉద్యోగం వచ్చింది. మంచి సంబంధం రావడంతో రెండు నెలల కిందటే వివాహం చేశారు. ఆమె కూడా రణస్థలం మండలంలోని సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ లాగానే సోమేశ్వరరావు బుధవారం తన బండిపై కామేశ్వరిపేటలోని సచివాలయానికి బయల్దేరాడు. దారిలో కొల్లవానిపేట వద్ద గేటు వేశారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు సోమేశ్వరరావు ప్రాణాలు తీశాయి. గేటు లేవడంతోనే.. సరిగ్గా ఉదయం 10.16కు కొల్లవానిపేట గేటు వేసి ఉంది. రెండు వైపులా వాహనాలు నిలిచి ఉన్నాయి. ఆమదాలవలస నుంచి తిలారు వైపునకు గూడ్స్ ట్రైన్ వెళ్లింది. ఆ రైలు వెళ్లగానే గేటు లేచింది. దీంతో కొల్లవానిపేట నుంచి ఒక కారు, ఆటో గేటు లోపలికి వచ్చాయి. సోమేశ్వరరావు కూడా తన బండితో ముందుకు కదిలాడు. అంతే.. అదే ట్రాక్‌పై ఊహించని వేగంతో వచ్చిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సోమేశ్వరరావును అమాంతం ఢీకొట్టింది. ఆ ధాటికి అతడి శరీరం తునాతునకలైంది. రైలు పట్టాలన్నీ రక్తంతో తడిచిపోయాయి. క్యారేజీ, హెల్మెట్ ఇలా ఆ యన వస్తువులన్నీ చాలాదూరం ఎగిరిపడ్డాయి. అయితే తమ కళ్ల ముందే ప్రమాదం జరగడంతో గే టు వద్ద ఉన్న వాహనదారులు నిశ్చేష్టులైపోయారు. రెప్పపాటులో తాము ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రత్యక్ష సాక్షులు వేళాల రమేష్, ఆర్.రామకృష్ణ, పుల్లట వెంకటరమణ తెలిపారు. ఆటోలో పది మంది, కారులో నలుగురు ఉన్నారని, వెంట్రుక వాసిలో వీరు ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు. కన్నీరుమున్నీరు.. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇలా దుర్మరణం పాలవ్వడంతో మృతుని తల్లిదండ్రులు శ్యామలరావు, సరస్వతిలు కన్నీరుమున్నీరయ్యారు. అతని సోదరి గౌతమి కూడా తల్లడిల్లిపోయింది. సోమేశ్వరరావు భార్య జయశ్రీ వేదన చూసి అంతా కన్నీరుపెట్టుకున్నారు. నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. కేసు నమోదు.. ఈ ప్రమాదంలో సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని ఆమదాలవలస రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆమదాలవలస స్టేషన్ మాస్టర్ రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఏ ఎస్ఐ చిట్టిబాబు, హెచ్‌సీ మధుసూదనరావు వచ్చా రు. రైల్వేగేట్‌మెన్ మధుపర్ మిశ్రో నుంచి వివరణ తీసుకున్నామని, ప్రమాదవశాత్తు జరిగినట్లు కేసు నమోదు చేశామన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ సోమేశ్వరరావు మృతిపై నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ, ఎంపీడీఓ మదుసూదనరావు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు మోహనరావు, ఉదయ భాస్కర్, పంచాయ తీ కార్యదర్శుల సంఘం మండల విభాగం అధ్యక్షు డు ముకుందరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులు దివ్య, కామేశ్వరిపేటకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు వాకముళ్లు చక్రధర్, జోగినాయుడులు సంతాపం వ్యక్తం చేశారు. -
పెళ్లి సెలవులు ముగించుకుని డ్యూటీకెళ్తూ.. కానరాని లోకాలకు
నల్గొండ: పైళ్లెన 19 రోజులకే నవ వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలంలోని పెండ్లిపాకల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్, అలివేలు దంపతుల ఏకై క కుమారుడు బొడ్డుపల్లి వెంకటేశ్(29) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 11న వెంకటేశ్‌కు గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తిరిగి ఉద్యోగానికి వెళ్తున్న వెంకటేశ్ ఆదివారం సెలవు దినం కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. కాగా పెండ్లిపాకల గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు ఉండడంతో సెలవులు పెట్టేందుకు సోమవారం వెంకటేశ్ స్వగ్రామం నుంచి బైక్‌పై హైదరాబాద్‌కు బయల్దేరి ఆఫీస్ పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి పయనయ్యాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొండమల్లేపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ మూలమలుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. పైళ్లెన కొద్దిరోజులకే రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బొడ్డుపల్లి వెంకటేశ్ బీజేపీలో కొనసాగుతూ పెండ్లిపాకల గ్రామంలో 135వ బూత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. వెంకటేశ్ మరణ వార్త తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి సురేష్‌కుమార్, లాలునాయక్, బొడిగ సాంబశివగౌడ్, పేర్ల జితేందర్, భరత్‌కుమార్, కుంభం యాదగిరి, పాక నగేశ్, బోడ కృష్ణ, చిలువేరు శ్రీధర్, ఎండీ జహీర్, తారయ్య తదితరులున్నారు. -
హనీమూన్‌లో విషాదం..
యశవంతపుర: చూడ చక్కని జంట. ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన ఆ దంపలను చూసి విధికి కన్నుకుట్టింది. హనీమూన్ ముగించుకొని ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను మోసుకొని ఇంటికి వస్తుండగా మృత్యువు పంజా విసిరి నవ వరుడిని బలి తీసుకుంది. ఈ విషాద ఘటన హావేరి జిల్లా హిరేకరూరు తాలూకా కొడద గ్రామం వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. దావణగెరె జిల్లా హరిహర తాలూకా జిగళి గ్రామానికి చెందిన మఠం రాజయ్య, శోభ దంపతుల కుమారుడు సంజయ్(28) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. నవంబర్ 28న బైలహొంగలకు చెందిన టెక్కీ ప్రీతితో వివాహమైంది. కాపురం ఉండేందుకు బెంగళూరులో అద్దె ఇల్లు చూశారు. 12న ఆ ఇంటిలో చేరాల్సి ఉంది. అయితే హనీమూన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. శనివారం ఉదయం సిగందూరు చౌడేశ్వరిని దర్శించుకున్న జంట.. ఆదివారం శిరసి మారికాంబా దేవిని దర్శించుకొని తిరిగి జిగళికి వస్తుండగా హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా కొడద వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఇద్దరికీ బలమైన గాయాలు కావడంతో రాణెబెన్నూరు ఆస్పత్రికి, తర్వాత దావణగెరెకు తరలిస్తుండగా మార్గం మధ్యలో సంజయ్ మృతి చెందాడు. స్ట్రెచర్‌లో విగతజీవిగా ఉన్న సంజయ్‌ను చూసి భార్య ప్రీతి కన్నీరుమున్నీరైంది. పోస్టుమార్టం అనంతరం సంజయ్ మృతదేహాన్ని జిగళి గ్రామానికి తరలించారు. -
రంగారెడ్డి: పెళ్లయిన పన్నెండు రోజులకే..
సాక్షి, రంగారెడ్డి: పెళ్లయిన పన్నెండు రోజు లకే నూరేళ్లు నిండాయి. బైక్‌ను యూ టర్న్‌ను తీసుకుంటుండగా ఓ ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మొయినాబాద్‌మండల పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన కుమ్మరి పరంధామ(23) ప్రగతి రిసార్ట్స్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గతనెల 25న వివాహం జరిగింది. మొయినాబాద్ మండలం జీవన్‌గూడలో ఉన్న బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు ఆదివారం రాత్రి వచ్చాడు. ఫంక్షన్‌కు వచ్చిన బంధువులను హిమాయత్‌నగర్ చౌరస్తాలో దింపేందుకు సోమవారం సాయంత్రం బైక్‌పై వచ్చాడు. వారిని దింపి తిరిగి జీవన్‌గూడకు వెళ్లేందుకు చౌరస్తాలో బైక్ యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో మండల పరిధిలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందిన బస్సు నగరం వైపు అతివేగంతో వెళ్తూ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతను రోడ్డుపై పడిపోవడంతో నడుము భాగం పై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సుకు చెందిన ప్రైవేట్ కళాశాల ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి వద్ద ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. చదవండి: కేఏపాల్‌తో మా కుటుంబానికి ప్రాణహాని.. నా భర్తను విడిపించండి’ -
కాళ్ల పారాణి ఆరకముందే...
కాళ్ల పారాణి ఆరలేదు.. మామిడి తోరణాలు తీయలేదు... వధూవరుల ఇంట పెండ్లి సందడి ముగియలేదు.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. పెళ్లయిన 24 రోజులకే వరుడు కన్నుమూశాడు. అత్తవారింటికి వెళ్లిన తన కుమారుడు శవమై రావడంతో వరుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లిలో చేసిన బాసలు మరిచి నన్ను వదిలి వెళ్లిపోయావా అంటూ నూతన వధువు భర్త మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. విజయనగరం / బలిజిపేట: పెళ్లయిన 24 రోజులకే నవవరుడు మృత్యువాత పడిన సంఘటన పెదపెంకిలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. తెర్లాం మండలం కుసుమూరు గ్రామానికి చెందిన మజ్జి సూర్యనారాయణ (23)కు బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన పి.జ్యోతితో గత నెల 16న వివాహం జరిగింది. రాకపోకల్లో భాగంగా సూర్యనారాయణ భార్య జ్యోతితో కలిసి శుక్రవారం అత్తవారింటికి వచ్చాడు. సూర్యనారాయణ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు కావడంతో అత్తవారి పొలంలో ఎరువు చల్లేందుకు శనివారం వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత తిరిగివస్తూ మార్గమధ్యలో ఉన్న శనపతి కోనేరులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. పొలానికి వెళ్లిన భర్త ఎంతకీ రాకపోవడంతో భార్య ఆందోళన చెందడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఇంతలో కోనేరులో సూర్యనారాయణ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా అందరూ గగ్గోలు పెట్టారు. భర్త మృతదేహంపై పడి జ్యోతి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. మృతుడి తల్లిదండ్రులు, జ్యోతి తల్లిదండ్రులు గణపతి, సింహాద్రమ్మలు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ పెంకి పార్వతి, వేణనాయుడు, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ఓదార్చారు. -
పెళ్లయిన నెలరోజులకే మృత్యుఒడికి
ఆ గుమ్మాలకు కట్టిన మావిడాకులు ఇంకా వాడలేదు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన పెళ్లి కూతురు కాళ్ల పారాణి ఆరలేదు. చేతికి పెట్టుకున్న గోరింటాకు ఇంకా విడిచిపెట్టలేదు. బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లకు ఇంకా ఆ జంట పూర్తిగా వెళ్లనే లేదు. ఆషాఢం పూర్తయ్యాక తీర్థయాత్రలు చేయాలనుకున్న ఆ నవదంపతులు కల తీరలేదు. ఎన్నో ఏళ్లు కలసి జీవించాలనుకున్న ఆ జంటపై విధి చిన్నచూపు చూసింది. లారీ రూపంలో ఆ యువకుడిని వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందడంతో.. పెళ్లింట తీవ్ర విషాదం అలుముకుంది. ఆ నవ వధువు గుండెలవిసేలా విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. బూర్జ విజయనగరం : మండలంలోని రామన్నపేట గ్రామానికి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో లారీ ఢీకొని తోటవాడ గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని బెహరా సంతోష్‌కుమార్(22) దుర్మరణం చెందాడు. తోటవాడ నుంచి పాలకొండ మండలం బాసూరులో తన చెల్లి ఇంటి వద్ద ఉన్న భార్యను తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. ఇంతలో రామన్నపేట వద్ద పాలకొండ వెళుతున్న లారీకి ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో సంతోష్ సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సంతోష్‌కుమార్‌కు ఒడిశా రాష్ట్రం లబ్బ గ్రామానికి చెందిన జ్యోతితో గత నెల 22 వివాహం జరిగింది. ప్రస్తుతం వ్యవసాయ పనుల బిజీగా ఉన్నాయి. దమ్ములు పూర్తి కాగానే ఆషాఢం వెళ్లాక తీర్థయాత్రలు చేయాలని ఎన్నో బాసలు చేసుకున్నారు. ఎన్నో కలలు కన్నారు. మూడు రోజులు కిందట పాలకొండలో జరుగుతున్న జగన్నాథస్వామి రథయాత్రకు వెళ్లారు. బాసూరులో ఉన్న చెల్లి ఇంటికి తీసుకువెళ్లారు. మంగళవారం వచ్చి ఇంటికి తీసుకువెళ్తానని చెప్పారని కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని హృదయ విదారకంగా విలపిస్తున్న తీరు అందరినీ కదిలించింది. ఆ కాళ్ల పారాణి చెరగకముందే భర్త చనిపోవడంతో భార్య జ్యోతి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. సంతోష్‌కుమార్ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు భార్య జ్యోతి, అమ్మ మంగమ్మ, నాన్న సత్యం ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కొత్త పెళ్లికొడుకు దుర్మరణం
గజపతినగరం: విజయనగరం జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కొత్త పెళ్లికొడుకు మృతి చెందాడు. గజపతినగరం మండలం మధుపాడ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మానాపురం నుంచి గజపతి నగరం వెళ్తున్న వ్యాన్ ఎదురుగా విజయనగరం నుంచి బొబ్బిలి వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో వ్యాన్ డ్రైవర్ రాజు (24) మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఈ మధ్యనే వివాహం అయినట్లు సమాచారం. రాజు మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.