సత్యనారాయణరెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న మల్లు భట్టి విక్రమార్క
మధిర : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతోనే పలు పార్టీల నుంచి వలసలు వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమా ర్క తెలిపారు. మండలంలోని వంగవీడులో టీడీపీకి చెందిన అయిలూరి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాల వారు భట్టి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సత్యనారాయణరెడ్డితో పాటు భూక్యా గోరియా, గుడిద నర్సింహా, ఓబుల వెంకటనర్సిరెడ్డి, బొగ్గుల ఉద్దండురెడ్డి, పలగాని లక్ష్మయ్య తదితరులు పార్టీలో చేరగా, భట్టి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వంగవీడు గ్రామాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ మాత్రమే అభివృద్ధి చేసిందన్నారు. సీసీరోడ్లు, ఇందిర మ్మ ఇళ్లు, సాగర్‌నీరు, జాలిముడి ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు వం టి అనేక అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నది టీఆర్‌ఎస్సేనని ఆరో పించారు. నియోజకవర్గ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, అన్నదాతలకు నీరందించి ఈ ప్రాంతా న్ని సస్యశ్యామలంగా ఉంచడమే తన ధ్యేయమని తెలిపారు. గ్రామపంచాయతీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఆశగా చూపి ప్రజలను కెసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు, అవినీతికి పరాకాష్టగా మారిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం భట్టిని ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, కృష్ణాపురం సర్పంచ్ కర్నాటి రామారావు, నాయకులు శీలం వెంకటరెడ్డి, దుంపా వెంకటేశ్వరరెడ్డి, అద్దం కి రవికుమార్, దారా బాలరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment