![MLA Bandaru Satyanarayana Criticize On Pawan Kalyan - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/30/pawan-kalayan.jpg.webp?itok=MZhBzEBp)
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబుపై పవన్ అసత్యా ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు. ‘మీరు రాజకీయాల్లోకి కొత్తగా ఏమీ రాలేదు. మీ అన్న పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంతకు అమ్మేశారో అందరికీ తెలుసు’ అని అన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా బీజేపీని మీరు ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. పవన్ కేవలం బీజేపీ స్క్రిప్ట్‌నే ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం విషయంలో పవన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. మూడు నెలలుగా విశాఖలోనే ఉండి ఎందుకు రైల్వే జోన్ గురించి పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. మీరు సినిమాలో మాత్రమే నటించాలి కానీ రాజకీయాల్లో కాదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కేవలం వాస్తవాలు మాత్రమే మాట్లాడాలని అన్నారు. కేంద్రంపై విమర్శలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment