
ఎమ్మెల్యే బడేటి బుజ్జి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్
సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘జనసేనాని పవన్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్ తన విలువ కోల్పోతున్నారు’ అని బుజ్జి కామెంట్లు చేశారు.
కామినేని రాకతో.. ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన దిగ్గజ నటుడు స్వర్గీయ ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఓ కలయిక చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే బడేటి బుజ్జి(ఎస్వీఆర్‌కు బుజ్జి బంధువు) ఆధ్వర్యంలో ఎస్పీ రంగారావు శత జయంతి వేడుకలు జరగ్గా.. ఆ కార్యక్రమానికి బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఎస్వీఆర్ విగ్రహావిష్కరణలో కామినేని పాల్గొన్నారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. అయితే ఎస్వీఆర్ కుమారుడు కామినేనికి క్లాస్‌మేట్ కావటం, పైగా తాను ప్రత్యేకంగా ఆహ్వానించటంతోనే ఈ కార్యక్రమానికి కామినేని హాజరైనట్లు ఎమ్మెల్యే బుజ్జి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment