Badeti Bujji
-
మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతి
-
ఏలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, ఏలూరు : టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. కాగా, బుజ్జి 2014లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం.. మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి భౌతికకాయానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నివాళులర్పించారు. బుజ్జి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, పలువురు ప్రముఖులు కూడా బుజ్జి భౌతికకాయానికి నివాళులర్పించినవారిలో ఉన్నారు. -
బుజ్జి మార్కు రౌడీయిజం
సాక్షి, ఏలూరు : ఓటమి భయంతో తెలుగుదేశం నాయకులు పలుచోట్ల దాడులకు దిగారు. ఏదోవిధంగా ఓటింగ్‌కు జనం రాకుండా చేయాలనే కుట్రలు పన్నారు. అయినా వారి పన్నాగాలు సాగలేదు. ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు తరలివచ్చారు. దీంతో పలుచోట్ల తెలుగుదేశం నాయకులు వీరంగం వేశారు. ఏలూరులో ఎమ్మెల్యే బడేటి బుజ్జి పలువురిపై స్వయంగా పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలపై దాడులు చేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకూ పలు పోలింగ్ కేంద్రాలకు తిరుగుతూ అక్కడ కనిపించిన నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం, వారిని బెదిరించడం వంటి పనులకు పూనుకున్నారు. పలువురు రౌడీషీటర్లను వెంటేసుకుని హల్చల్ చేశారు. ఎన్నికల సమయంలో రౌడీషీటర్లను బైండోవర్ చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే పక్కన తిరుగుతున్నా వారిని అదుపులోకి తీసుకోకపోవడంతో వారు రెచ్చిపోయారు. ఉదయం శనివారపుపేట పోలింగ్ కేంద్రానికి వెళ్లిన బడేటి బుజ్జి వైసీపీ కార్యకర్త మట్టా రాజును తీవ్రస్థాయిలో గాయపరిచారు, అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన రాజుపై అక్కడ కూడా దాడి చేసి వెంటాడి మరీ కొట్టారు. మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, మాజీ కార్పొరేటర్ అక్కిశెట్టి చందు, మరో కార్యకర్త కొండబాబు, మరో ఇద్దరిపై బుజ్జి స్వయంగా దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ మరికొందరు రౌడీషీటర్లతో కలిసి బుజ్జి హల్చల్ చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూసింది తప్ప అడ్డుకునే యత్నమే చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏలూరు నగరంలో రామకోటి సమీపంలోని బాలికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద మరోసారి బుజ్జి గొడవకు దిగారు. మాజీ డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్‌పై దాడి చేశారు. ఓటర్లను సైతం భయబ్రాంతులకు గురిచేస్తూ చెలరేగిపోయారు. అనంతరం 3వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ అక్కిశెట్టి చందుపై దౌర్జన్యం చేశారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. చందుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. అనంతరం వంగాయగూడెంలో 16, 17డివిజన్లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన బడేటి బుజ్జి మరోసారి అక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొండబాబు, ఇతర వ్యక్తులపై దాడి చేశారు. పోలీసులూ బడేటికి వంతపాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే లాఠీలు ఝుళిపించారు. బుజ్జి వైఖరిని ఖండిస్తూ ఏలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఆళ్ళనాని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన రౌడీషీటర్లు బయట తిరుగుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. టీడీపీకి చెందిన రౌడీషీటర్లు భీమవరపు సురేష్, గుండాల దుర్గారావు తదితరులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. దీంతో ఎస్పీ రవిప్రకాష్ స్పందించి బడేటి బుజ్జి వెనుక ఒక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను పంపడంతో బుజ్జి ఆగడాలకు అడ్డుకట్టపడింది. టీడీపీ నేతల హల్చల్ కార్లు, మోటారుసైకిళ్ళపై టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని అక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా గొడవలకు దిగారు. ఎమ్మెల్యే బుజ్జి అల్లుడు కొట్టు మనోజ్ గురువారం సాయంత్రం వీరంగం చేశారు. స్థానిక 150వ పోలింగ్ స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్త రామరాజుపై మనోజ్, అతని అనుచరుల దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామరాజును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం పోలింగ్ స్టేషన్ వద్ద డబ్బులు పంచుతున్నారని సమాచారం ఇచ్చిన రామరాజు అతని తల్లి తండ్రులపై బుజ్జి దాడి చేశారు. మరోసారి రామరాజుపై ఎమ్మెల్యే అల్లుడు కొట్టు మనోజ్ దాడిచేయడం విమర్శలకు దారితీసింది. ఉంగుటూరులో ఉదయం ఎన్నికల సమయంలో టీడీపీ చెందిన నేత వైఎస్సార్ సీపీకి చెందిన దళితులను దూషించడంపై రాత్రి ఎన్నిక ముగిసిన తర్వాత మరోవర్గం వారు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది. భీమవరం నియోజకవర్గంలో జనసేన ఓటమి పాలవుతుందన్న విషయాన్ని జీర్జించుకోలేక జనసైనికులు వైఎస్సార్సీపీ నేతలపై గురువారం దౌర్జన్యానికి దిగారు. వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో జనసైనికులు ఎరుపు రంగు తువాలు కట్టుకుని ప్రచారం నిర్వహించారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిలిపివేయాలని ఎర్రకండువాలు తొలగించాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. ఇదే విషయాన్ని ఎన్నికల అధికారికి తెలియచేయడంతో కండువాలు తొలగించాలని వివరించారు. ఈ సమయంలో కొంత మంది జనసైనికులు వైఎస్సార్సీపీ నాయకులపైకి దౌర్జన్యానికి దిగారు. ఇదే మండలం రాయకుదురులో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. రోడ్డుపై ఓటర్లను కలుసుకుంటున్న సందర్భంలో కొంతమంది టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు. ఏలూరు రూరల్ మండలం పత్తికోళ్ల లంకలో ఇరువర్గాల మద్య జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు. -
అద్దె డబ్బు అడిగితే బెదిరింపు
ఏలూరు (సెంట్రల్): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఓ మహిళ కన్నీటిపర్యంతమైంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరుడినంటూ టీడీపీ నాయకుడు ఒకరు రెండు సంవత్సరాలుగా మా ఇంట్లో అద్దెకు ఉంటూ మమ్మల్నే బెదిరిస్తున్నాడని బాధితురాలు మల్లాది పద్మప్రియ వాపోయింది. ఇంటిని ఖాళీ చేయకుండా, ఇంటి యజమానులమైన మమ్మల్నే ఇంట్లోకి రానివ్వకుండా బెదిరిస్తున్నాడని ఆరోపించింది. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాము విశాఖపట్నంలో నివాసం ఉంటున్నామని, ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని ఆగ్రహారంలో డోర్ నెంబర్ 4–13–17లో తమకు ఇల్లు ఉందని వివరించింది. తన భర్త రామచంద్రమూర్తి అమరావతిలో సమాచార శాఖ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారని, ఏలూరులో ఉన్న ఇంటిలో నివాసం ఉంటూ ప్రతి రోజు అమరావతికి వెళ్లి వస్తుంటారన్నారు. ఇంటి కింద భాగం ఖాళీగా ఉండడంతో 2017 మే నెలలో ఏలూరుకు చెందిన టీడీపీ నాయకుడు మర్గాని చంద్రకిరణ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలసి ఉండేందుకు ఇల్లు అద్దెకు తీసుకున్నాడని తెలిపింది. ఇంటి అద్దె చెల్లించకుండా ప్రశ్నించిన తమను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. చంద్రకిరణ్ బెదిరింపులకు భయపడి తన భర్త అమరావతిలోనే ఉంటున్నారని పద్మప్రియ తెలిపారు. ఈ విషయంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్లిన పట్టించుకోలేదని, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. -
తొక్కతీస్తా...ఈడ్చి పారేస్తా..బడేటి బుజ్జి వీరంగం
సాక్షి, ఏలూరు : దళితులపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చిందులు తొక్కారు. తమ సమస్యలపై నిలదీసిన వారిపై నోరు పారేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోణంగి గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోణంగి వెళ్లిన బడేటి బుజ్జిని... అయిదేళ్లుగా తమ సమస్యలను పరిష్కరించకపోవడంపై హరిజనపేటకు చెందిన కొందరు యువకులు నిలదీశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. ఇళ్లు ఇస్తామని టీడీపీలో చేర్చుకుని... మోసం చేశారని యువకులు ప్రశ్నలు సంధించారు. దళిత యువకులు తనను ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే బుజ్జి...’ నా సంగతి మీకు తెలియదు...తొక్క తీస్తా.. ఈడ్చి అవతల పారేస్తా’ అంటూ బెదిరించారు. కాగా చంద్రబాబు నాయుడు పాలనలో దళితులకు అడుగడుగునా అవమానం జరుగుతోంది. ఎన్నికల సమయంలోనూ దళితులపై టీడీపీ అభ్యర్థులు నోరుపారేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం దళితులు రాజకీయాలకు పనికిరారంటూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇటీవలే ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలో దళితులపై దాడి జరిగింది. టీడీపీ నేతల వైఖరిపై దళితులు మండిపడుతున్నారు. -
దళితులపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చిందులు
-
బుజ్జి నామినేషన్‌కు రండి.. 1000 పట్టుకెళ్లండి
సాక్షి, ఏలూరు : ఏలూరు అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి బుజ్జి నామినేషన్ కార్యక్రమానికి రండి రూ.1000 పట్టుకెళ్లండి అంటూ కార్పొరేటర్లు డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రెండు రోజుల నుంచి నగరంలోని పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు డ్వాక్రా మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ పిలుస్తున్నారు, వెళ్లకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందకుండా చేస్తారేమోనని వెళ్తున్న మహిళలకు కార్పొరేటర్లు ఈ ఆఫర్లు ఇస్తున్నారు. బుజ్జి నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీకి వస్తే కార్పొరేటర్లు రూ.500, బుజ్జి మరో రూ.500 ఇస్తారని చెబుతున్నారు. అలాగే బుజ్జిని రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత డ్వాక్రా మహిళలపై ఉందని, ఇప్పటివరకూ వారికి ప్రభుత్వం నుంచి వివిధ విధాలుగా అందిన రుణాలు, రుణమాఫీ వంటివన్నీ బుజ్జి చలువే అన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల్లో బుజ్జికి ఓటు వేసేందుకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారని(ఎంత ఇస్తారో ప్రకటించడం లేదు) చెబుతున్నారు. బుజ్జి అత్యధిక మెజార్టీతో గెలిస్తే ప్రతి డ్వాక్రా మహిళకూ ఖరీదైన చీర బహూకరిస్తారని ప్రలోభ పెట్టారని ఈయా సమావేశాలకు హాజరైన మహిళల్లో కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు. -
పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): ఏపీలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయి. వారికి ఎవరైనా అడ్డుచెప్పినా, ఎదురుతిరిగినా, ప్రశ్నించినా దాడికి దిగటం టీడీపీ నాయకులకు సర్వసాధారణంగా మారింది. తాజాగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఏకంగా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఏలూరు టౌన్ హాల్లో లక్షల రూపాయల్లో జూదం ఆడుతున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. దీంతో చిర్రెత్తుకుపోయిన బడేటి బాబ్జి హాల్ వద్దకు చేరుకుని పోలీసులపై విరుచకుపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే తీరుతో ఒక్కసారిగా విస్తుతపోయిన పోలీసుల సర్దిచెప్పె ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే వినలేదు. అయితే గత ఏడాది రెండు సార్లు దాడి చేశామని, లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు. -
ఏలూరులో పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
-
మాజీ కార్పొరేటర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కక్ష సాధింపు
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాజీ కార్పొరేటర్ చింతా దుర్గా రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కక్ష సాధింపులు ఎక్కువ అయ్యాయి. కొన్ని నెలలుగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి రావాలని మాజీ కార్పొరేటర్‌పై ఒత్తిడి చేశారు. టీడీపీలో చేరకపోవడంతో ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఒత్తిడితో అయిదో డివిజన్లో నిర్మాణంలో ఉన్న మాజీ కార్పొరేటర్ చింతా దుర్గా రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. టీడీపీలో చేరకపోవడంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారని చింతా దుర్గా రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని సంఘటనా ప్రాంతానికి చేరుకుని మాజీ కార్పొరేటర్‌కు అండగా నిలిచారు. ఏపీలో టీడీపీ అరాచకాలు పెరిగిపోయాయని ఆళ్లనాని వ్యాఖ్యానించారు.పార్టీలో చేరలేదని ఎమ్మెల్యే బడేటి బుజ్జి కక్ష సాధింపులకు దిగటం చాలా దారుణమన్నారు. ఏలూరులో టీడీపీ అక్రమాలకు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. మరో ఆరు నెలల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. -
బుజ్జి వర్సెస్ పెదబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) నగరపాలక సంస్థ కో–ఆప్షన్ సభ్యుడు, మేయర్ నూర్జహాన్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో పెదబాబు నగరంలో ఏర్పాటు చేసిన కటౌట్లను తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించడం, తర్వాత వాటిని తొలగించడం తెలిసిందే. అప్పటి నుంచి ఇరువురి మధ్య మొక్కుబడి సంబ«ంధాలే కొనసాగుతున్నాయి. తాజాగా వాట్సాప్‌లో మేయర్ కార్యాలయ సిబ్బంది తయారు చేసిన ప్రచార పర్వంలో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడం, దీనిపై ఎమ్మెల్యే పెదబాబును నిలదీయడంతో వివాదం చెలరేగింది. దీంతో తాను, మేయర్ తమ పదవులకు రాజీనామా చేస్తామని పెదబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... స్థానిక పోణంగిరోడ్డులో పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లను మేయర్, కార్పొరేటర్ల బృందం రెండు రోజుల క్రితం పరిశీలించి వచ్చింది. ఆ తర్వాత మేయర్ సందర్శన ఫొటోలను ఫొటోషాపులో డిజైన్ చేశారు. అందులో మేయర్ నూర్జహాన్, అమె భర్త పెదబాబు ఇతర కార్పొరేటర్ల ఫొటోలతో పాటు సీఎం చంద్రబాబు ఫొటో మాత్రమే ఉంది. అందులో ఎక్కడా ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఫొటో లేదు. వీటిని పార్టీకి చెందిన అన్ని వాట్సాప్ గ్రూపులలో పంపించారు. అయితే ఇందులో తమ ప్రమేయం లేదని మేయర్ వర్గం వాదిస్తోంది. తన ఫొటో లేకుండా మేయర్, ఆమె భర్త ఫొటోలు హల్చల్ చేయడంతో ఎమ్మెల్యే బుజ్జి ఆగ్రహించారు. సోమవారం సాయంత్రం ఆయన కో–ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబుకు ఫోన్ చేసి ఈ ఫొటోల గురించి నిలదీశారు. ఇది మంచి సంప్రదాయం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందులో తమ ప్రమేయం లేదని, ఎవరో చేసిన పనికి తనను నిలదీస్తే ఎలా అంటూ పెదబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగినట్లు సమాచారం. తాను పైసా కూడా ఆశించకుండా నగరాభివృద్ధి కోసం, పార్టీ కోసం పనిచేస్తుంటే ప్రతిసారి తనను టార్గెట్ చేయడం సరికాదని చెప్పిన పెదబాబు తాము మేయర్, కో–ఆప్షన్ పదవుల నుంచి తప్పుకుంటామని చెప్పి ఫోన్ పెట్టేసినట్లు తెలిసింది. దీంతో సోమవారం రాత్రి ఎమ్మెల్యే బుజ్జి తమ కార్పొరేటర్లతో ఈ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా ఉండటమే మంచిదని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు తెలిసింది. మంగళవారం పలువురు కార్పొరేటర్లు మేయర్‌ను కలిసి రాజీనామా చేసే ఆలోచన చేయవద్దని కోరారు. అయితే వారు తమ నిర్ణయం తెలపకుండా మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. మనసులో ఏదో పెట్టుకుని పదేపదే వేధిం చడం కరెక్టు కాదని పెదబాబు తమను కలిసిన వారితో వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎమ్మెల్యే, మేయర్ విభేదాలతో కార్పొరేటర్లు ఆయోమయంలో పడ్డారు. -
‘పవన్ పోటీచేసినా నేనే గెలుస్తా’
సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘జనసేనాని పవన్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్ తన విలువ కోల్పోతున్నారు’ అని బుజ్జి కామెంట్లు చేశారు. కామినేని రాకతో.. ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన దిగ్గజ నటుడు స్వర్గీయ ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఓ కలయిక చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే బడేటి బుజ్జి(ఎస్వీఆర్కు బుజ్జి బంధువు) ఆధ్వర్యంలో ఎస్పీ రంగారావు శత జయంతి వేడుకలు జరగ్గా.. ఆ కార్యక్రమానికి బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఎస్వీఆర్ విగ్రహావిష్కరణలో కామినేని పాల్గొన్నారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. అయితే ఎస్వీఆర్ కుమారుడు కామినేనికి క్లాస్మేట్ కావటం, పైగా తాను ప్రత్యేకంగా ఆహ్వానించటంతోనే ఈ కార్యక్రమానికి కామినేని హాజరైనట్లు ఎమ్మెల్యే బుజ్జి చెబుతున్నారు. -
టీడీపీ నేతలను పవన్ కలవడంపై అనుమానం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి జనసేన వైపు చూస్తున్నారా? ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారా? తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బడేటి బుజ్జి జరిపిన ఏకాంత భేటీ తెలుగుదేశం పార్టీలో చర్చకు దారితీసింది. జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య ఇంటికి గురువారం రాత్రి పవన్ కల్యాణ్ వచ్చిన సందర్భంలో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను మాత్రమే కలవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాఘవయ్య తల్లిని పరామర్శించిన సందర్భంలోనే పవన్ కల్యాణ్ ఇటీవలే వివాహమైన బడేటి బుజ్జి కుమార్తె, అల్లుడిని ఆశీర్వదించారు. బుజ్జి అల్లుడికి రాఘవయ్య దగ్గర చుట్టం కావడంతో పెళ్లికి పవన్ కల్యాణ్ రావాల్సి ఉందని, కుదరకపోవడంతో గురువారం ఆశీస్సులు అందించారని చెబుతున్నారు. ఈ సందర్భంగా పవన్‌తో బుజ్జి ఏకాంతంగా భేటీ అయ్యారు. అల్లుడి కోసమా? అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఎమ్మెల్యే బడేటి బుజ్జికి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సీటు ఇచ్చే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. బుజ్జి గెలిచిన తర్వాత ఏలూరులో చోటు చేసుకున్న రౌడీ రాజకీయాలు, హత్యలు, భూకబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఈసారి కొత్తవ్యక్తికి అవకాశం ఇస్తారని తెలుగుదేశం వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సీటు రాని పక్షంలో జనసేన నుంచి తానుగానీ తన అల్లుడుగానీ నిలబడాలని బుజ్జి భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అల్లుడిని ప్రజల ముందుకు తీసుకువచ్చే యత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఇటీవల ఎయిడ్స్ బాధిత పిల్లల సహాయార్థం అంటూ రోటరీ క్లబ్ తరపున నిర్వహించిన 5కే రన్ కోసం నగరంలో విస్త్రత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో క్లబ్ అధ్యక్షుని హోదాలో ఎమ్మెల్యే అల్లుడికి విపరీతమైన ప్రచారం కల్పించారు. బాధితులకు ఎంత సహాయం చేసారో ఇంకా బయటకు రాలేదు గానీ అంతకు మించి ప్రచారం కోసం ఎక్కువ ఖర్చు చేశారన్న విమర్శలు వచ్చాయి. అయితే ఈ ప్రచారం కూడా ఒక పథకం ప్రకారం చేశారని తెలుగుదేశం వర్గాలు చర్చించుకుంటున్నాయి. అవసరమైతే జనసేన తరఫున తన అల్లుడిని అభ్యర్థిగా ఫోకస్ చేసే యత్నం జరుగుతున్నట్టు సమాచారం. టీడీపీ నేతలను పవన్ కలవడంపై అనుమానం ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినందున ఏలూరులోని జనసేన నాయకులు, అభిమానులను కలవడం లేదని పవన్ చెప్పినా, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను మాత్రం కలవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు చెప్పిందే పవన్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు నగరానికి వచ్చిన తమ నేత కేవలం ఆ పార్టీ నాయకులనే కలవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేన నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం వచ్చిన సందర్భంలోనూ వచ్చిన అభిమానులను పట్టించుకోకపోవడం, జనసేన నాయకులను కలిసే యత్నం కూడా చేయకపోవడం వల్ల వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఉదయం నుంచి జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలను తీసుకుని వచ్చిన నాయకులకు పవన్‌కల్యాణ్ వ్యవహరించిన తీరు బాధ కలిగించింది. బౌన్సర్ల చేతిలో అవమానాలు మాత్రం మిగిలాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆ ఇసుక నిల్వలు టీడీపీ ఎమ్మెల్యేవి?
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిసరాల్లోని కండ్రిగగూడెం పంచాయతీ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 లారీల ఇసుకను పోలీసులు, రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. ఎస్పీకి అందిన సమాచారం మేరకు ఆయన ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఇసుక నిల్వల వద్ద ఉన్న వ్యక్తులను విచారించగా... ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆధ్వర్యంలో ఇసుకను నిల్వ చేసినట్టు వారు బదులిచ్చారు. -
ఏ1 ముద్దాయి ముద్రగడ తప్పించుకోలేరు
మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరోసారి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. ఈ సారి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నోరు పారేసుకున్నారు. ముద్రగడ వల్లే అనేక మంది అమాయకపు కాపులపై కేసులు నమోదయ్యాయని విమర్శించారు. కేసుల నుంచి ఏ1 ముద్దాయి ముద్రగడ తప్పించుకోలేరని బడేటి బుజ్జి అన్నారు. కులాలతో ఓట్లు రాలవని, అందరూ ఓటేస్తేనే గెలుస్తారంటూ వ్యాఖ్యానించారు. తాను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కాపులతో పాటు వైశ్యులూ ఓటేశారని, అందువల్లే గెలిచానని చెప్పారు. కుల రాజకీయాలతో ప్రయోజనం ఉండదంటూ చంద్రబాబుకి సూచించారు. -
రౌడీయిజం.. మోసమే నైజం
దెందులూరులో చింతమనేని దందాలు సెటిల్మెంట్ల కింగ్ ఏలూరు అభ్యర్థి బడేటి బుజ్జి మోసాల్లో దిట్ట గన్ని వీరాంజనేయులు ఇతర ప్రాంతాల్లోని అభ్యర్థులపైనా వెల్లువెత్తుతున్న విమర్శలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : రౌడీ కార్యకలాపాలు.. మోసాలు.. సెటిల్మెంట్లు.. రాజకీయం ముసుగులో జిల్లాలోని టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలివి. వారే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో ఆయా నియోజకవర్గాల్లో జనం భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. తమకంటే గొప్పవాళ్లు లేరని, తమ పార్టీ కంటే గొప్ప పార్టీ మరొకటి లేదని చెప్పుకునే టీడీపీ తరఫున కొందరు అరాచకవాదులు ఎన్నికల బరిలో ఉండడం గమనార్హం. వారి అరాచకాలను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుతూ వచ్చిన టీడీపీ అధిష్టానం చివరకు వారినే ఎన్నికల్లో పోటీ చేయిస్తోంది.చింతమనేని దౌర్జన్యకాండ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో అధికార యంత్రాగాన్ని ఆయన భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకూ అందరిపైనా జులుం ప్రదర్శించారు. అనేక పనులకు సంబంధించిన కాం ట్రాక్టులను సొంత మనుషులతో చేయించి బిల్లుల కోసం అధికారులపై దౌర్జన్యం చేయడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. పోలవరం ఎడమ కాలువ గట్టు నుంచి గ్రావెల్, తమ్మిలేరు నుంచి ఇసుకను రోడ్లు ఇతర పనులకు వాడిన ఆయన ఆ తర్వాత వాటికి బిల్లులు చేయించుకుని జేబులో వేసుకున్నారు. పలుమార్లు అధికారులను కొట్టి గాయపరిచిన ఉదంతాలున్నాయి. ఏడాది క్రితం పెదవేగిలో ఎస్సైపై దాడి చేశారు. ఇటీవలే అధికారులను దుర్భాషలాడటంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా ఆయనకు ఎదురుతిరిగారు. వారినీ ఆయన ఇష్టానుసారం తిట్టారు. తన అరాచకానికి ఎదురుతిరిగిన వారిపై దాడి చేయడం, కొట్టడం ఆయన నైజంగా మారింది. ఇలాంటి వ్యవహారాల్లోనే ఆయనపై లెక్కకు మిక్కిలిగా కేసులున్నాయి. ఇప్పటికే అనేకసార్లు అరెస్టు కూడా అయ్యారు. ఆయన్ను భరించలేక ఆ నియోజకవర్గం నుంచి పలువురు అధికారులు సెలవుపై వెళ్లిపోయారు. కొంతమంది బదిలీలు చేయించుకుని ఆయనకూ దూరంగా పారిపోయారు. ఆయన అండ చూసుకుని గ్రామాల్లో చింతమనేని అనుచరులు రెచ్చిపోయి ఆగడా లు చేయడం కూడా సర్వసాధారణమే. ఆయన మరోసారి ఎమ్మెల్యే అయితే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయని జనం భయపడుతున్నారు. టీడీపీలోనే అనేక మంది చింతమనేని రౌడీ రాజకీయాలపై అసంతృప్తితో ఆయనకు దూరమై అతనికి సీటివ్వొదని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయినా చంద్రబాబు అరాచకానికే ఓటువేసి చింతమనేనికి సీటిచ్చారు. సెటిల్మెంట్ల కింగ్ బుజ్జి ఏలూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బడేటి బుజ్జిపై అనేక ఆరోపణలున్నాయి. సెటిల్మెంట్ల కింగ్‌గా ఆయన పేరుగడించారు. బుజ్జి బారినపడి అనేక మంది అష్టకష్టాల పాలయ్యారనే విషయం ఏలూరులో బహిరంగ రహస్యం. వివాదాలున్న స్థలాల వ్యవహారాల్లో తలదూర్చి వాటిని సెటిల్ చేసే పేరుతో సామాన్యులను ఇబ్బందిె పట్టడం, వారి ఆస్తులను దోచుకోవడం లేదా ఇతరుల పరం చేయడం ఆయన నైజం. ఏలూరు వన్‌టౌన్‌లోని చాలామంది వ్యాపారులు బుజ్జి పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు. మునిసిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను బెదిరించి లొంగదీసుకోవడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేశారు. తన మాట వినలేదని పలువురిపై దాడులు కూడా చేయించారు. ఏ పదవీ లేకుండానే ఇంత అరాచకం చేసిన బుజ్జి ఎమ్మెల్యే అయితే తాము బతకలేమనే చర్చ నగరంలో చాలాకాలం నుంచే జరుగుతోంది. కొద్దినెలల క్రితం విజయవాడలోని ఒక ఇంట్లో వ్యభిచారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆయన ఊచలు కూడా లెక్కబెట్టారు. ఈ కేసును ఎలాగోలా మాఫీ చేసుకున్నా ఆయన వ్యవహార శైలి మాత్రం నగరంలో అందరికీ అర్థమైపోయింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తుండడం విశేషం. ‘రియల్’ చీటర్ ఉంగుటూరు టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు గతంలో చీటింగ్ కేసులో అరెస్టయ్యారు. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఒక వ్యవహారంలో ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు వీరాంజనేయుల్ని అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. ఆయన అండ చూసుకుని అనుచరగణం కూడా బెదిరింపులు, దాడులకు దిగుతోంది. నాలుగు రోజుల క్రితం భీమడోలు మండలంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కారును టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఇలా తీవ్రమైన ఆరోపణలున్న వారిని టీడీపీ అభ్యర్థులుగా నిలబెట్టడంతో స్థానికంగా ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అరాచకవాదులకు అవకాశం ఇస్తే అన్నీ అరాచకాలే జరుగుతాయనే భయం ప్రజల్లో కనిపిస్తోంది.