ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(పాత చిత్రం)
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మాజీ కార్పొరేటర్ చింతా దుర్గా రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కక్ష సాధింపులు ఎక్కువ అయ్యాయి. కొన్ని నెలలుగా వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి రావాలని మాజీ కార్పొరేటర్‌పై ఒత్తిడి చేశారు. టీడీపీలో చేరకపోవడంతో ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఒత్తిడితో అయిదో డివిజన్‌లో నిర్మాణంలో ఉన్న మాజీ కార్పొరేటర్ చింతా దుర్గా రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. టీడీపీలో చేరకపోవడంతోనే ఎమ్మెల్యే బడేటి బుజ్జి తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారని చింతా దుర్గా రెడ్డి ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని సంఘటనా ప్రాంతానికి చేరుకుని మాజీ కార్పొరేటర్‌కు అండగా నిలిచారు. ఏపీలో టీడీపీ అరాచకాలు పెరిగిపోయాయని ఆళ్లనాని వ్యాఖ్యానించారు.పార్టీలో చేరలేదని ఎమ్మెల్యే బడేటి బుజ్జి కక్ష సాధింపులకు దిగటం చాలా దారుణమన్నారు. ఏలూరులో టీడీపీ అక్రమాలకు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. మరో ఆరు నెలల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment