వైఎస్సార్‌సీపీలో చేరిన మైనార్టీలతో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
బద్వేలు అర్బన్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అదే స్థాయిలో మైనార్టీల అభివృద్ధి జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 9,10,11,12 వార్డుల్లోని 100 మైనార్టీ కుటుంబాలు సరిటాల మౌలాలి, నజీర్, మన్సూర్ ఆధ్వర్యంలో శనివారం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా స్థానిక మహబూబ్‌నగర్‌లోని ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ మైనార్టీలకు పెద్ద పీట వేశారని, వారి ఇబ్బందులను కళ్లారా చూసి వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పించారని తెలిపారు.
అప్పట్లో 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాజశేఖర్‌రెడ్డి భావించినా.. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సుప్రీంకోర్టులో కేసు వేసి అడ్డుకున్నారని పేర్కొన్నారు. నేడు మైనార్టీలపై కపటప్రేమ చూపిస్తూ లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కే సురేష్‌బాబు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీ శాఖకు వేరే వర్గాల వారిని మంత్రిగా పెట్టి మైనార్టీలపై తనకున్న వివక్షతను చూపారని విమర్శించారు.
పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ జీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన అందిస్తారని తెలిపారు. ఇందుకోసం మైనార్టీలు జగన్‌కు అండగా నిలవాలని కోరారు. అనంతరం పార్టీలో చేరుతున్న వారికి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మున్సిపాలిటీ కన్వీనర్ కరీముల్లా, బ్రాహ్మణపల్లె, బీ కోడూరు సింగిల్‌విండో అధ్యక్షులు జీ సుందర్‌రామిరెడ్డి, ఓ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ బీ మునెయ్య, 6వ వార్డు కౌన్సిలర్ గోపాలస్వామి, అట్లూరు మాజీ ఎంపీపీ బాలమునిరెడ్డి, వేమలూరు సర్పంచు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపాలిటీ నాయకులు వాకమళ్ల రాజగోపాల్‌రెడ్డి, యద్దారెడ్డి, సింగసాని శివయ్య, చెన్నకృష్ణారెడ్డి, మల్లేష్, నాగేశ్వర్‌రావు, మురళి, కుప్పాల శ్రీరాములు, చెన్నయ్య, మల్లికార్జునరెడ్డి, సాంబశివారెడ్డి, హుస్సేన్, బాబు, ముంతాజ్, షరీఫ్, అల్తాఫ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment