హామీలను విస్మరించిన ప్రభుత్వాలు | BSP Leader Criticize On State, Central Governments Adilabad | Sakshi
Sakshi News home page

హామీలను విస్మరించిన ప్రభుత్వాలు

May 6 2018 12:34 PM | Updated on Nov 9 2018 5:52 PM

BSP Leader Criticize On State, Central Governments Adilabad - Sakshi

మాట్లాడుతున్న రాజన్న

నిర్మల్‌టౌన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాజన్న అన్నారు. నిర్మల్‌రూరల్‌ మండలంలోని మంజులాపూర్‌లో గ్రామ ప్రజల సమస్యలను ఆయన శనివారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. నాలుగేళ్ల నుంచి ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నాయని ఆరోపించారు.

డబ్బే ప్రధాన లక్ష్యం చేసుకుని ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బహుజనులంతా ఏకమై బీఎస్పీనే గెలిపించాలని కోరారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఈ నెల 8 నుంచి జోనల్‌ స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు బాపురావు, నాయకులు సాయన్న, ప్రకాష్, ముత్యం, నాగరావు, దిగంబర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement