
మాట్లాడుతున్న సత్యం
బోయినపల్లి: మండలంలోని విలాసాగర్ గ్రామం లో మే 15న నిర్వహించిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీలో విలాసాగర్ చెరువు నింపే పనుల శంఖుస్థాపన చేస్తానని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు నీళ్ల మూటలటు అయ్యాయని నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడిపల్లి సత్యం ఆరోపించారు. మండల కేంద్రంలోని ఆర్‌ఎంపీ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో సాగు, తాగునీటి వనరులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
విలాసాగర్ సభలో విలాసాగర్ చెరువు నింపాలని మంత్రి ఎదుట పెద్ద మొత్తంలో ప్రజలు, యువకులు నిరసనలు తెలపడంతో తానే వచ్చి శంఖుస్థాపన చేస్తానని మంత్రి అన్నారని గుర్తు చేశారు. రెండు నెలలు గడిచినా ఎలాంటి ప్రగతి లేదన్నారు. ఎల్లంపల్లి నీటితో బోయినపల్లి, తడగొండ, అనంతపల్లి గ్రామాల చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాగునీటి సాధన ఉధ్యమం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంబ లక్ష్మిరాజం, జాగీరు శోభన్‌గౌడ్, ఎండీ.బాబు, రాజుకుమార్, గంగిపెల్లి లచ్చయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment