మాట్లాడుతున్న అంబటి శ్రీనివాస్
కాజీపేట : ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు కొనసాగడం వల్లే తెలంగాణ జన సమితి ఆవిర్భావం జరిగిందని వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అంబటి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో సీమాంధ్ర నాయకులతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజా వ్యతిరేకతో కూడిన కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు.
మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ అస్పష్టమైన విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. జిల్లా కోఆర్డినేటర్ బోట్ల భిక్షపతి మాట్లాడుతూ ఆదివారం ఎర్రగట్టు గుట్ట కింద ఉన్న బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించే రాజ కీయ శిక్షణ తరగతులను విజయవంతం చే యాలన్నారు. రాజేంద్రప్రసాద్, రాజేందర్, పులి సత్యం, తిరునహరి శేషు, శ్యాంసుందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ఛత్రపతిశివాజీ, డా.కృష్ణ, శ్రావణ్, శ్రీకాంత్, శివ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment