TJSC Call
-
ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ పాలన
కాజీపేట : ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు కొనసాగడం వల్లే తెలంగాణ జన సమితి ఆవిర్భావం జరిగిందని వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అంబటి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో సీమాంధ్ర నాయకులతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజా వ్యతిరేకతో కూడిన కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అస్పష్టమైన విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. జిల్లా కోఆర్డినేటర్ బోట్ల భిక్షపతి మాట్లాడుతూ ఆదివారం ఎర్రగట్టు గుట్ట కింద ఉన్న బాలాజీ ఫంక్షన్హాల్లో నిర్వహించే రాజ కీయ శిక్షణ తరగతులను విజయవంతం చే యాలన్నారు. రాజేంద్రప్రసాద్, రాజేందర్, పులి సత్యం, తిరునహరి శేషు, శ్యాంసుందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ఛత్రపతిశివాజీ, డా.కృష్ణ, శ్రావణ్, శ్రీకాంత్, శివ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్.. ద్రోహులమయం
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ఉద్యమ నేపథ్యంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి గాదె ఇన్నయ్య అన్నారు. ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకుని గూండాల్ల వ్యవహరించిన వాళ్లంతా టీఆర్ఎస్లో మంత్రులుగా కొనసాగుతున్నారని, చీమలపుట్టలో పాములు చేరిన చందంగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం తెలంగాణ జన సమితి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాదె ఇన్నయ్య మాట్లాడారు. ‘‘అంకుల్ తెలంగాణ వచ్చేది కాదు సచ్చేదికాదు మా నాన్నను డిస్టర్బ్ చేయకండి.. ఇంకెవరినన్న చూసుకోండి’ అంటూ 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ప్రస్తుత మంత్రి కేటీఆర్ తనకు ఫోను చేసి వేడుకున్నాడని, అలాంటి వ్యక్తి ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నాడని అన్నారు. టీఆర్ఎస్ మొత్తం కుటుంబపాలన, తెలంగాణ ద్రోహుల మయమైందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసిన వాళ్లే ఎక్కువగా ఆ పార్టీలో ఉన్నారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పెట్టినప్పుడు కేసీఆర్ ’నాకెవరున్నారు.. నేను నా భార్యే.. నా పిల్లలు రాజకీయాల్లోకి రారు’ అన్నారని, ఇప్పుడు మొత్తం కుటుంబపాలనే అయ్యిందన్నారు. ఉద్యమ ఆకాంక్ష పూర్తిచేసేందుకే టీజేఎస్ పుట్టిందని, అసమానతలు లేని, పరిపాలన మార్పు, మెజార్టీ ప్రజల అభివృద్ధి అనే మూడు లక్ష్యాలను సాధించేందుకు పాటుపడుతుందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచే తమ విజయ ప్రస్థానం మొదలవుతుందని జోస్యం చెప్పారు. తెలం గాణ జన సమితి తరఫున వార్డు అనుబంధ సభ్యులను ప్రకటిస్తామని, ఉద్యమంలో భాగస్వాములైన వారు, సామాజిక సేవ నేపథ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశమిస్తామన్నారు. దివ్యాంగులకు, అనాథ యువతకు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమావేశంలో టీజేఎస్ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఇన్చార్జిలు, నాయకులు ముక్కెర రాజు, జేవీ రాజు, జనగామ నర్సింగ్, కనకం కుమారస్వామి, స్రవంతి, ఎస్.గంగారెడ్డి, గడ్డం రవిందర్ రెడ్డి, డొంకెన రవిలతో పాటు పలువురు పాల్గొన్నారు. -
శాంతియుతంగా విడిపోదాం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సీమాంధ్ర, తెలంగాణ భాయీ.. భాయీ. విడిపో యి కలిసుందాం.. అంటూ సద్భావన శాంతిసందేశాన్ని అందించేందుకు ఓరుగల్లు వేదికైంది. సీమాంధ్ర ఉద్య మానికి వ్యతిరేకంగా.. తెలంగాణ ఉద్యోగులపై దాడుల కు నిరసనగా శుక్రవారం టీజేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా టీఎన్జీఓలు, ఉద్యోగులు, న్యాయవాదులు, తెలంగాణవాదులు, జేఏసీల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ లు నిర్వహించారు. వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిం చారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండించారు. సంఘటన లు ఇలాగే జరిగితే ‘ఆంధ్రా ఉద్యోగులు గోబ్యాక్’ నినాదాన్ని తీసుకోవాల్సి ఉంటుందని రాష్ర్ట బార్ కౌన్సిల్ మెంబర్ ముద్దసాని సహోదర్‌రెడ్డి హెచ్చరించారు. అనంతరం డీఆర్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్ర మం చేపట్టారు. తెలంగాణపై వెనక్కి తగ్గితే వచ్చే ఉద్యమాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష్, గుడిమల్ల రవికుమార్, అబ్దుల్నబీ, రాజేంద్రకుమార్, జనార్దన్‌గౌడ్, నీలా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పరకాలలో.. పరకాలలో స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కోర్టు ప్రాంగణం నుంచి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అమరధామంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యోగులపై దాడులను ఖండించారు. సహృద్భావ వా తావరణంలో విడిపోయేందుకు అన్ని వర్గాలు సహకరిం చాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు పున్నం రాజిరెడ్డి, నాయకులు నరేష్‌రెడ్డి, రాజ మౌళి, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొర్రూరులో.. తొర్రూరు కోర్టు నుంచి న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరారు. కురవిలో తెలంగాణవాదులు సీమాంద్రుల దాడులను ఖండిస్తూ నిరసన తెలియజేశారు. ట్రైబల్ జేఏసీ ఆధ్వర్యంలో.. అమరవీరుల స్థూపం వద్ద దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ జైసింగ్ రాథోడ్, సమ్మయ్య, బానోతు బాలాజీ, సజ్జన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ములుగురోడ్డులో.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులపై దాడులపట్ల నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. విద్యుత్ జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు సంపత్‌రావు, నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.