
సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ప్రశ్నిస్తే తన్ని లోపలేస్తారా అని సోమిరెడ్డిని ప్రశ్నించారు. మంత్రి చేసిన ఆరోపణపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార దర్పంతో తన్నిస్తామనడం ప్రజాస్వామ్యమేనా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment