
వారితో ఒరిగిందేమీ లేదు
నల్లగొండ రూరల్: వామపక్షాల నేతలతో కార్మికులకు ఒరిగిందేమీ లేదని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్‌లోనే ప్రస్తావించారని, వారి వేతనాల పెంపు ప్రకటన నేడో, రేపో వస్తుందని తెలుసుకొని వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టడం సరికాదన్నారు. తమవల్లే కార్మికుల సమస్యలు పరిష్కారమైనట్టు చెప్పుకునేందు కు వామపక్షాల నేతలు రాజకీయ ప్రయోజనం కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పే అవకా శం ఉందన్నారు. రాష్ట్రానికి పూర్తి స్థాయి లో ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టును రెండుగా విభజించి నిర్మించాలని భావిస్తున్నారన్నారు. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మి స్తే ఆదిలాబాద్ జిల్లాకు, కాళేశ్వరం దగ్గర బ్యారేజీ నిర్మాణం వల్ల నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌కు నీరు అందుతుందని తెలి పారు. ప్రయోజనకరమైన ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అండగా ఉండాల్సిన నాయకులు తమ స్వప్రయోజనాల కోసం వ్యతిరేకించడం సరికాదన్నారు.
గుత్తాకు ఏం తెలుసు?
ఉపాధి ఉద్యోగుల సమస్యలపై ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందన్న విషయం ఎంపీ గుత్తాకు తెలియదా...? అని ప్రశ్నించారు. ఉపాధి ఉద్యోగుల సమస్యలను ఎంపీగా పార్లమెంట్‌లో లేవ నెత్తాలని సూచించారు. గుత్తాకు అధికారం లేకపోయేసరికి కమీషన్లు, పర్సం టేజీలు, పైరవీలు కరువైనట్టు ఆయన తెలిపారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. సమావేశంలో సాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య, రాష్ట్ర నాయకులు చాడ కిషన్‌రెడ్డి, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, ఫరీద్, గోలి అమరేందర్‌రెడ్డి, చింత శివరామకృష్ణ, జి.సురేందర్ తదితరులు పాల్గొన్నారు.