Left leaders
-
వామపక్షాలకు మేమంటేనే నచ్చదు
విజయనగరం గంటస్తంభం: వామపక్షాల నేతలు ఇతర పార్టీలను ఒక్క మాట అనరని.. బీజేపీ ఎన్ని మంచి పనులు చేసినా తీవ్ర విమర్శలు చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఆదివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, వైఎస్ జగన్ అంటే వామపక్షాలకు ప్రేమ ఎక్కువన్నారు. ప్రధాని మోదీ మాత్రం వారికి నచ్చరన్నారు. రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీలు, జూట్ పరిశ్రమలు మూతపడినా ఏమీ మాట్లాడరని.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేస్తున్నారని మాత్రం తెగ గోల చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ఏటా నిధులు విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. -
విద్యుత్ చట్ట సవరణలు వెంటనే ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ప్రజలకు నష్టం చేసే ఈ సవరణలను వెనక్కు తీసుకోకపోతే గతంలో విద్యుత్ ఉద్యమ షాక్ తగిలి ఏపీ ప్రభుత్వం కూలిపోయిన మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా షాక్ తగులుతుందని హెచ్చరించారు. కేంద్రం విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోకపోతే విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని షహీద్‌చౌక్ వద్ద విద్యుత్ ఉద్యమ అమరులు బాలాస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌లకు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అమరవీరుల 21వ సంస్మరణ సభలో కేంద్ర విద్యుత్ చట్టాల సవరణకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. గతంలో జరిగిన ‘బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమం’మహత్తరమైన ఉద్యమమని, ఆ ఉద్యమం కారణంగానే ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలను పెంచే సాహసం చేయలేదని, పైగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ తదితర సదుపాయాలను కల్పించాయని వక్తలు పేర్కొ న్నారు. ఒకే దేశం–ఒకే పన్ను తదితర నినాదాలతో బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా చట్టాలను సవరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ముందుకు రావాలని సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి కోరారు. నాడు ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను అమలు చేసిందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఉధృతంగా ప్రపంచ బ్యాంకు, పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తోందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కార్యక్రమంలో అజీజ్‌పాషా, పశ్య పద్మ (సీపీఐ), జి.నాగయ్య, డీజీ నరసింహారావు, బి.వెంకట్, టి.సాగర్ (సీపీఎం), ఎం.సుధాకర్ (ఎంసీపీఐ–యూ), కె. మురహరి (ఎస్‌యూసీఐ–సీ), అచ్యుత రామారావు, ఎస్.ఎల్.పద్మ (న్యూడెమోక్రసీ) తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో ‘తెలంగాణం’
తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. దేశమంతా కాంగ్రెస్ హవా ఏకపక్షంగా వీస్తున్నా.. తెలంగాణలో మాత్రం వామపక్ష నేతలు ఆ జోరును సమర్థవంతంగా అడ్డుకున్నారు. కానీ రెండోసారి ఎన్నికల నాటికి పరిస్థితిలో పూర్తిగా మారిపోయింది. ఈ ఎన్నికల నాటికి మద్రాసు స్టేట్ నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయి తెలంగాణలో కలిసి.. ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. అప్పటివరకు హైదరాబాద్ స్టేట్‌లోని కన్నడ, మరాఠా ప్రాంతాలు అప్పటి మైసూరు, బొంబాయి స్టేట్స్లో కలిసి పోయాయి. అయితే 1957లో అసెంబ్లీ ఎన్నికలు కేవలం తెలంగాణలో మాత్రమే జరిగాయి. ఏపీ సీఎం నీలం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులు పీడీఎఫ్ పేరుతోనే పోటీచేశారు. తెలంగాణ సభ్యుల రెండోసారి ప్రమాణం.. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిపి) ఆవిర్భావం తర్వాత 1957లో తెలంగాణ జిల్లాల పరిధిలోని స్థానాలకు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనూ (తెలంగాణ ప్రాంతంలోని సీట్లతో కలిపి) 1957లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దరిమిలా హైదరాబాద్ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు 101 మంది 1956 డిసెంబర్ 3న ఏపీ ఎమ్మెల్యేలుగా మరోసారి ప్రమాణం చేశారు. ఈ కొత్త అసెంబ్లీకి ఆంధ్ర ప్రాంతానికి చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు శాసనసభాపతిగా, తెలంగాణకు చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల ఐదేళ్ల కాలపరిమితి ముగియడంతో 1957 ఫిబ్రవరి 25న ఈ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. రెండేళ్లు అదనంగా ఏపీ ఎమ్మెల్యేలు.. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు 1955లో జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంత ఎమ్మెల్యేల పదవీకాలం 1960 వరకు కొనసాగింది. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల కాలపరిమితి 1962 వరకు ఉండడంతో (1957లో ఎన్నికలు జరిగినందున) ఆంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేల పదవీకాలం రెండేళ్లు పొడిగించారు. ఈ విధంగా 1962లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు కలిపి) లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలైంది. 1957లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ద్విసభ్య నియోజకవర్గాలుండేవి. 1961లో ద్విసభ్య నియోజకవర్గాల రద్దు చట్టం అమల్లోకి రావడంతో ఈ విధానం రద్దయింది. దీంతో 1962 ఎన్నికల నుంచి ఏకసభ్య నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరిగాయి. 1957 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే.. ఈ ఎన్నికల్లో ఆల్ ఇండియా భారతీయ జన్‌సంఘ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్ పార్టీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, ప్రజాపార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్, పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీలతో పాటు స్వతంత్రులు వివిధ స్థానాలకు పోటీచేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 109 సీట్లకు పోటీ చేసి 68 సీట్లు గెలుపొందగా.. 65 సీట్లకు పోటీ చేసిన పీడీఎఫ్ 22 చోట్ల విజయం సాధించింది. ప్రజాసోషలిస్టు పార్టీ, ప్రజాపార్టీ, షెడ్యూల్ కాస్ట్స్ ఫెడరేషన్ ఒక్కో స్థానంలో విజయం సాధించారు. స్వతంత్రులు 12 చోట్ల గెలుపొందారు. అప్పుడు అసెంబ్లీకి ఎన్నికైన నామినేటెడ్ సభ్యుడి పేరు టీటీ ఫెర్నాండేజ్. ఆంధ్రాలోనూ కాంగ్రెస్ హవా.. ఆంధ్ర ప్రాంతంలోని 28 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ 24 స్థానాలు కైవసం చేసుకుంది. సీపీఐ రెండు, స్వతంత్రులు మరో రెండు సీట్లలో గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఎన్జీ రంగా (తెనాలి), మండలి వెంకటకృష్ణారావు (మచిలీపట్నం), కొత్త రఘురామయ్య (గుంటూరు), ఎం.అనంతశయనం అయ్యంగార్ (చిత్తూరు), పెండేకంటి వెంకటసుబ్బయ్య (ఆదోని) వంటి ప్రముఖ నాయకులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీపీఐ నుంచి తరిమెల నాగిరెడ్డి (అనంతపురం), సీపీఐ నుంచే ఉద్దరాజు రామం (నరసాపురం), ఇండిపెండెంట్‌గా పూసపాటి విజయరామ (పీవీజీ), గజపతిరాజు (విశాఖపట్టణం) లోక్‌సభకు ఎన్నికయ్యారు. తగ్గని మహిళా చైతన్యం ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కలుపుకుని మొత్తం 17 మంది మహిళలు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది, పీడీఎఫ్ నుంచి ఇద్దరు, పీఎస్పీ నుంచి ఒకరు, స్వతంత్రులు ముగ్గురు పోటీచేశారు. వారిలో పదిమంది విజయం సాధించారు. వీరిలో బాన్స్వాడ నుంచి సీతాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 1952తో పాటు 1957లోనూ మాసుమా బేగం గెలిచారు. ఇందులో టీఎన్ సదాలక్ష్మి 1960–62 మధ్య డిప్యూటీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆర్మూర్‌లో అంజయ్య, మంథని నుంచి పీవీ ముషీరాబాద్ నుంచి కె. సీతయ్యగుప్తా, బేగం బజార్ నుంచి జేవీ నరసింగరావు, ఆసిఫ్‌నగర్ నుంచి వీబీ రాజు, హైకోర్టు నియోజకవర్గం నుంచి గోపాలరావు ఎగ్బోటే, జూబ్లీహిల్స్ జనరల్ నుంచి నవాబ్ మెహదీ నవాబ్‌జంగ్, షాబాద్ జనరల్ నుంచి కొండా వెంకట రంగారెడ్డి, వికారాబాద్ జనరల్ నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, జహీరాబాద్ నుంచి ఎం.బాగారెడ్డి, ఆర్మూర్ నుంచి టి. అంజయ్య, మంథని నుంచి పీవీ నరసింహారావు (మొదటిసారి ఎమ్మెల్యే), కరీంనగర్ నుంచి జె.చొక్కారావు, ధర్మసాగర్ నుంచి టి.హయగ్రీవాచారి, చిల్లంచెర్ల నుంచి ఎమ్మెస్ రాజలింగం, ఖమ్మం నుంచి టి.లక్ష్మీకాంతమ్మ, చిన్నకొండూరు నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి ముఖ్యæ నాయకులు కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన వారిలో ఉన్నారు. వేంసూరు నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు సోదరుడు కొండలరావు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. నాగర్‌కర్నూల్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పి. మహేంద్రనాథ్ గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో.. 1957లో తెలంగాణ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాగంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని మొత్తం 43 లోక్‌సభ సీట్లలో 27 ఏకసభ్య, 8 ద్విసభ్య నియోజకవర్గాలుండేవి. వాటిలో తెలంగాణ ప్రాంతంలో 15 ఎంపీ సీట్లు (మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ ద్విసభ్య నియోజకవర్గాలు కలిపి), ఆంధ్ర పరిధిలో 28ఎంపీ స్థానాలకు (5 ద్విసభ్య నియోజకవర్గాలతో సహా) ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 13 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, పీడీఎఫ్ రెండు స్థానాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జె.రామేశ్వరరావు (మహబూబ్‌నగర్), వినాయక్‌రావు (హైదరాబాద్), సంగెం లక్ష్మీబాయి (వికారాబాద్) తదితర నేతలు విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థులుగా దేవులపల్లి వెంకటేశ్వరరావు (నల్లగొండ), విఠల్‌రావు (ఖమ్మం) గెలుపొందారు. ఉప ఎన్నికల విజేతలు 1958లో బుగ్గారం జనరల్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి, కమ్యూనిస్టు నేత బద్దం ఎల్లారెడ్డి కాంగ్రెస్‌టికెట్‌పై పోటీచేసిన ఎల్.నరసింహారావుపై గెలిచారు. 1959లో ఆసిఫ్‌నగర్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసిన ఎన్పీ జైస్వాల్‌పై.. స్వతంత్ర అభ్యర్థి వీఆర్‌రావు గెలిచారు. 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ జనరల్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై రోడామిస్త్రీ విజయం సాధించారు. ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థి ఎంజేఏ బేగ్‌పై గెలుపొందారు. సరోజిని నాయుడు కొడుకు ఓటమి హైకోర్టు స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన డాక్టర్ ఎన్.ఎం. జయసూర్య (సరోజిని నాయుడు, డా.ముత్యాల గోవిందరాజులు నాయుడు కుమారుడు)ను కాంగ్రెస్ అభ్యర్థి గోపాలరావు ఎగ్బోటే ఓడించారు. సిర్పూర్ (ఎస్సీ) సీటు నుంచి ప్రజా సోషలిస్ట్ పార్టీ (పీఎస్పీ) అభ్యర్థి కోదాటి రాజమల్లు కాంగ్రెస్ అభ్యర్థి వెంకటస్వామి చేతిలో ఓడిపోయారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీపడిన నెమురుగొమ్ముల యతిరాజారావుపై పీడీఎఫ్ అభ్యర్థి ఎస్.వెంకటకృష్ణ ప్రసాదరావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 319 అభ్యర్థులు పోటీ చేయగా.. 81 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. 1957 శాసనసభ ఎన్నికల్లో... మొత్తం ఓటర్లు 75,58,880 (ద్విసభ్య నియోజకవర్గాలు కలిపి) పోలైన ఓట్లు 36,03,585 పోలింగ్ శాతం 47.67 ‘ద్విసభ్య’ జూబ్లీహిల్స్: హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ ప్రాంతం 1957 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ద్విసభ్య నియోజకవర్గం. అంటే ఒక జనరల్ సీటుతో పాటు మరో సీటు ఎస్సీలకు రిజర్వ్‌చేశారు. 1952, 1957 ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గాల్లో ఎస్సీలకు ఒక సీటు చొప్పున రిజర్వ్‌చేస్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినపుడు జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జేసీ దివాకర్‌రెడ్డి ఒక మానసిక రోగి
-
టీడీపీ నేతలు వెధవలైతే.. చంద్రబాబు ఏమవుతారు?
సాక్షి, విజయవాడ : కమ్యూనిస్టులు దొంగలంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వామపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వామపక్ష నేతలను దూషించిన ఎంపీ జేసీ ఒక మానసిక రోగి అని దుయ్యబట్టారు. జేసీ వెంటనే కమ్యూనిస్టులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ‘జేసీ కన్న పెద్ద దొంగ రాష్ట్రంలో మరొకరు లేరు. ఒక బస్సుకు పర్మిషన్ తీసుకొని నాలుగు బస్సులు నడుపుతున్న దొంగ జేసీ. బినామీల పేరుతో వందల ఎకరాల భూములు కాజేసి సిమెంట్ ఘనుడు జేసీ’ అని వామపక్ష నేతలు విరుచుకుపడ్డారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను వెధవలు అన్న జేసీ.. మరీ వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ఏమవుతారో చెప్పాలని ప్రశ్నించారు. వామపక్ష నేతలు ఎక్కడ దొంగతనం చేశారో జేసీ చెప్పాలని నిలదీశారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి అని, ఆయన కల్లు తగిన కోతి లాంటి వాడు అని మండిపడ్డారు. జేసీ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై కేసులు పెడతామని హెచ్చరించారు. తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మర్తాడు క్రాస్ సమీపంలో మంగళవారం రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎందుకూ పనికిరాని వెధవలంటూ తిట్టిపోసిన ఆయన.. కమ్యూనిస్టులు పెద్ద దొంగలంటూ వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీకి వెళ్లకముందు కమ్యూనిస్టులంటే చాలా మంచివారనే అభిప్రాయంతో ఉండేవాడిననీ, కానీ కమ్యూనిస్టులంత దొంగలు ఎక్కడా లేరని ఆ తర్వాత తెలుసుకున్నానన్నారు. -
కార్పొరేట్ తొత్తులుగా సర్కార్లు
ధ్వజమెత్తిన వామపక్షాలు - ‘బషీర్‌బాగ్’ విద్యుత్ అమరులకు నివాళులు సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాల అణచివేతకు పూనుకుంటున్నాయని పలువురు వామపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని స్తూపం వద్ద విద్యుత్ అమరవీరులకు 10 వామపక్ష పార్టీల నేతలు నివాళులర్పించారు. విద్యుత్ ఉద్యమంలో విష్ణువర్ధన్‌రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ అసువులుబాసి 15 సంవత్సరాలు పూర్తై సందర్భంగా వామపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా స్తూపం వద్దకు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. విద్యుత్ అమరవీరుల పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తామంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ‘ప్రజా ఉద్యమాలు- ప్రభుత్వాల అణచివేత’ అంశంపై నిర్వహించిన సదస్సులో సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ప్రయోజనాల కోసం 2000 ఆగస్టులో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని, అందుకు నిరసనగా వామపక్ష పార్టీలు చేసిన ఉద్యమంపై బాబు దమనకాండ కు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఉద్యమకారులను గుర్రాలతో తొక్కించి, తుపాకులతో కాల్చి హత్యలకు కూడా పూనుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు కూడా దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేట్ శక్తులు తమ చేతుల్లోకి తీసుకునే విధంగా ఉన్నాయని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులు, వరల్డ్ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయని, నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లిందని విమర్శించారు. దేశంలో అమలవుతున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ మోదీ తిరంగా యాత్ర పేరుతో దేశాన్ని తిరోగమనం పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయాలని చూస్తే, చివరికి ఆ ఉద్యమాలే ప్రభుత్వాలకు ఉరితాళ్లు అవుతాయని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విద్యుత్‌చార్జీలు పెంచి ప్రజలపై రూ.1600 కోట్లు భారం మోపిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే చార్జీలను అధికంగా పెంచి చంద్రబాబుకు తానేమీ తీసిపోనట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తీవ్రమైన నిర్బంధం: సీపీఎం విద్యుత్‌చార్జీల పెంపునకు నిరసనగా చేస్తున్న ఉద్యమంలో నాడు చంద్రబాబు ప్రభుత్వం ముగ్గురిని పొట్టనబెట్టుకున్నదని, అప్పటి ఉద్యమంలో కలసి వచ్చిన కేసీఆర్ నేడు అవే కార్పొరేట్‌శక్తులకు వంత పాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తెలంగాణలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్బంధం అమలవుతోందని, దీనికి మల్లన్నసాగర్ ఉదాహరణ అని, 144 సెక్షన్‌ను విధించి గ్రామాల చుట్టూ ముళ్లకంచెలను వేసి ప్రజలకు ఇబ్బం దులు కలగ చేశారని అన్నారు. అమరులకు నివాళులర్పించినవారిలో సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ నాయకులు రమ, గోవర్ధన్ , విజయ్‌కుమార్, ఎంసీపీఐ నేత తాండ్ర కుమార్, ఎస్‌యూసీఐ (మురారి), జానకిరాములు (ఆర్ఎస్పీ), సంధ్య(పీవోడబ్ల్యూ), సీపీఐ (ఎంఎల్) నాయకుడు భూతం వీరన్న తదితరులున్నారు. -
కామ్రేడ్ కోరిక
వామపక్ష భావజాలం కలిగిన ఓ నేతను త్వరలో జరగనున్న వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాయి వామపక్షాలు. తెలంగాణలో పేరున్న నేత కూడా అయినందున వామపక్షాలు ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోవడానికి ఉపయోగపడుతాయని ఆ పార్టీలు భావించాయి. ఏదో పోటీలో ఉండాలని అనుకోవడానికి ఆయనేమీ అల్లా టప్పా వ్యక్తి కాదు కదా...మీరు కాంగ్రెస్‌ను ఒప్పించండి...ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉండేలా ప్రకటన చేయండి...అప్పుడు గానీ నేనూ పోటీ చేయనంటూ షరతు పెట్టేసరికి వామపక్ష నేతలు ఉస్సూరుమంటూ వెనుదిరిగారట. ఇంతకు కాంగ్రెస్ పార్టీని సంప్రదించారా అని ఓ వామపక్ష నేతను అడిగితే...అబ్బే వాళ్లెందుకు ఒప్పుకుంటారు...ఒకవేళ అడిగి కాదంటే...మాకెందుకు ఎవరో ఒకరిని వెతికి పెడతామంటూ సమాధానమిచ్చాడు ఆ నేత. -
ఎప్పుడైనా వస్తా!
- ఉద్యమ పాటగానే కొనసాగుతా - రాజకీయ ప్రవేశాన్ని భవిష్యత్తే నిర్ణయిస్తుంది: గద్దర్ - వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా కోరిన లెఫ్ట్ నేతలు సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రజలు కోరితే ఎప్పుడైనా వస్తా.. అది రేపైనా కావొచ్చు లేదా ఎల్లుండైనా కావొచ్చు.. పదేళ్లయినా కావొ చ్చు’’ అని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ‘‘నేను ఉద్యమపాట గానే కొనసాగుతా. రాజకీయాల్లోకి వచ్చే అంశంపై ఇప్పుడే చెప్పలేను. రాజకీయరంగ ప్రవేశాన్ని భవిష్యతే నిర్ణయిస్తుంది. ప్రజాభిప్రాయం మేరకు భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటాను’’ అని వెల్లడించారు. వరంగల్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వివిధ వామపక్షాల తరఫున పోటీ చేయాలని ఆ పార్టీల నాయకులు కోరారని ఆయన మీడియాకు తెలిపారు. మంగళవారం రాత్రి గద్దర్‌ను ఆయన నివాసంలో కలిసి వామపక్షాల నాయకులు... వరంగల్ నుంచి పోటీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ‘‘వామపక్ష నేతలందరూ కలసి వచ్చారు. పోటీపై ఆలోచిస్తా.. రేపు రావొచ్చు, ఎల్లుండి రావొచ్చు... వామపక్షాల తరఫున వరంగల్ ఎంపీ సీటుకు అభ్యర్థిగా ఎవరిని పెట్టినా ప్రచారం చేయడానికి సిద్ధం’’ అని గద్దర్ స్పష్టం చేశారు. గద్దర్‌ను కలిసినవారిలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), వేములపల్లి వెంకటరామ య్య, రమ (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), జానకి రాములు, గోవింద్ (ఆర్ఎస్పీ), బండ సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), మురహరి (ఎస్‌యూసీఐ-సీ) ఉన్నారు. వారు మాట్లాడుతూ... వరంగల్ ఎంపీ సీటుకు గద్దర్‌ను పోటీ చేయాలని కోరుతున్నామన్నారు. లిక్కర్‌పై ఉద్యమం: గద్దర్‌ను కలిసేందుకు ముందు లెఫ్ట్ నేతలు మఖ్దూంభవన్‌లో సమావేశమయ్యారు. ఈ ఏడు పార్టీల నాయకులతో పాటు కె.గోవర్ధన్(న్యూడెమోక్రసీ-చంద్రన్న), భూతం వీరయ్య (సీపీఐ-ఎంఎల్) ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా గద్దర్‌ను కోరేందుకు తాము రాలేమని గోవర్ధన్ స్పష్టం చేసినట్లు సమాచారం. బుధవారం జరగనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలుపుతూనే పార్టీలుగా కాకుండా కార్మిక సంఘాలుగా పాల్గొనాలని, చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ నెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, ఎంసీపీఐ-యూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 10న చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఆమె విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం నేత బృందా కారత్ హాజరు కానున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో గద్దర్ అభ్యర్థి కాకపోతే, వామపక్షాల తరఫున సీపీఐ నేత గుండా మల్లేష్ లేదా సీపీఎం నేత జాన్వెస్లీలను పోటీకి నిలపాలని ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, సీపీఐ (ఎంఎల్) నాయకులు సూచించారు. పోటీకి విముఖత! వామపక్షాల నాయకులతో అంతర్గత భేటీలో వరంగల్ ఎంపీ సీటుకు పోటీపై గద్దర్ విముఖత వ్యక ్తం చేసినట్లు సమాచారం. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ తన పట్ల వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని గద్దర్ పేర్కొనట్లు సమాచారం. కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు కూడా బలపరిచేలా చూస్తామని వామపక్ష నాయకులు సూచించగా.. వామపక్షాలు ఎవరిని పెట్టినా గెలుపు సాధ్యమేనని, భవిష్యత్ ఎర్రజెండాదేనని, రాబోయే రోజులు ప్రజలవేనని గద్దర్ అన్నట్లు తెలిసింది. -
వారితో ఒరిగిందేమీ లేదు
నల్లగొండ రూరల్: వామపక్షాల నేతలతో కార్మికులకు ఒరిగిందేమీ లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్‌లోనే ప్రస్తావించారని, వారి వేతనాల పెంపు ప్రకటన నేడో, రేపో వస్తుందని తెలుసుకొని వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టడం సరికాదన్నారు. తమవల్లే కార్మికుల సమస్యలు పరిష్కారమైనట్టు చెప్పుకునేందు కు వామపక్షాల నేతలు రాజకీయ ప్రయోజనం కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పే అవకా శం ఉందన్నారు. రాష్ట్రానికి పూర్తి స్థాయి లో ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టును రెండుగా విభజించి నిర్మించాలని భావిస్తున్నారన్నారు. తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మి స్తే ఆదిలాబాద్ జిల్లాకు, కాళేశ్వరం దగ్గర బ్యారేజీ నిర్మాణం వల్ల నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌కు నీరు అందుతుందని తెలి పారు. ప్రయోజనకరమైన ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అండగా ఉండాల్సిన నాయకులు తమ స్వప్రయోజనాల కోసం వ్యతిరేకించడం సరికాదన్నారు. గుత్తాకు ఏం తెలుసు? ఉపాధి ఉద్యోగుల సమస్యలపై ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందన్న విషయం ఎంపీ గుత్తాకు తెలియదా...? అని ప్రశ్నించారు. ఉపాధి ఉద్యోగుల సమస్యలను ఎంపీగా పార్లమెంట్లో లేవ నెత్తాలని సూచించారు. గుత్తాకు అధికారం లేకపోయేసరికి కమీషన్లు, పర్సం టేజీలు, పైరవీలు కరువైనట్టు ఆయన తెలిపారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. సమావేశంలో సాగర్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య, రాష్ట్ర నాయకులు చాడ కిషన్‌రెడ్డి, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, ఫరీద్, గోలి అమరేందర్‌రెడ్డి, చింత శివరామకృష్ణ, జి.సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కామ్రేడ్స్
* హామీలు అమలు చేయూలని ధర్నా * కలెక్టరేట్‌ను ముట్టడించిన వామపక్షాలు * 300 మంది నాయకులు, కార్యకర్తల ఆందోళన * హామీలు అమలు చేయూలని ధర్నా * కలెక్టరేట్‌ను ముట్టడించిన వామపక్షాలు 300 మంది నాయకులు, కార్యకర్తల ఆందోళనసీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్‌యుసీఐ(సీ) ఆధ్వర్యంలో వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దక్షిణమూర్తి పర్యవేక్షణలో పోలీ సులు మోహ రించారు. హన్మకొండ ఏకశిలా పార్కు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వామపక్ష నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. సుబేదారి బస్టాప్, కలెక్టర్ బంగ్లా మీదుగా ట్రాఫిక్‌ను పోలీసు లు దారి మళ్లించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట 300 మంది వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రకటనలకే పరిమితం.. అమలు శూన్యం.. ధర్నాను ఉద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, పింఛన్ల పెంపు, అర్హులైన వారికి రేషన్‌కార్డులు, రైతులకు ఏడు గంటల నిరంతర విద్యుత్ వంటి పథకాలు ప్రకటించారన్నారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, కాం ట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కేజీ టు పీజీ వర కు ఉచిత విద్య, నూతన ఉద్యోగాలు, భూ సమస్య, సంక్షేమ పథకాలు, సాగు, తాగునీటి ప్రాజెక్టులను ప్రకటించి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నాగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కరెంట్‌కోతలు ఎత్తివేయాలని, ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవాలన్నారు. పోడు భూము లు సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంకన్న, చంద్రన్న, అశోక్, సత్యం, శివాజీ, వేణు పాల్గొన్నారు. -
మూడో కూటమికి ఈ నెలలోనే రూపురేఖలు: కారత్