కదం తొక్కిన కామ్రేడ్స్
* హామీలు అమలు చేయూలని ధర్నా
* కలెక్టరేట్‌ను ముట్టడించిన వామపక్షాలు
* 300 మంది నాయకులు, కార్యకర్తల ఆందోళన
* హామీలు అమలు చేయూలని ధర్నా
* కలెక్టరేట్‌ను ముట్టడించిన వామపక్షాలు
300 మంది నాయకులు, కార్యకర్తల ఆందోళనసీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్‌యుసీఐ(సీ) ఆధ్వర్యంలో వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దక్షిణమూర్తి పర్యవేక్షణలో పోలీ సులు మోహ రించారు. హన్మకొండ ఏకశిలా పార్కు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వామపక్ష నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. సుబేదారి బస్టాప్, కలెక్టర్ బంగ్లా మీదుగా ట్రాఫిక్‌ను పోలీసు లు దారి మళ్లించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట 300 మంది వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.
ప్రకటనలకే పరిమితం.. అమలు శూన్యం..
ధర్నాను ఉద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, పింఛన్ల పెంపు, అర్హులైన వారికి రేషన్‌కార్డులు, రైతులకు ఏడు గంటల నిరంతర విద్యుత్ వంటి పథకాలు ప్రకటించారన్నారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, కాం ట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కేజీ టు పీజీ వర కు ఉచిత విద్య, నూతన ఉద్యోగాలు, భూ సమస్య, సంక్షేమ పథకాలు, సాగు, తాగునీటి ప్రాజెక్టులను ప్రకటించి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి నాగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కరెంట్‌కోతలు ఎత్తివేయాలని, ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవాలన్నారు. పోడు భూము లు సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. విద్యార్థుల ఫీజు రీరుుంబర్స్‌మెంట్ అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంకన్న, చంద్రన్న, అశోక్, సత్యం, శివాజీ, వేణు పాల్గొన్నారు.