సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి | cpi dharna at anantapur collectorate | Sakshi
Sakshi News home page

సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

Published Wed, Aug 5 2015 11:55 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

cpi dharna at anantapur collectorate

అనంతపురం : అనంతపురం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. జిల్లాకు తక్షణ సహాయం విడుదల చేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కోన శ్రీధర్‌ను కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. కలెక్టర్ పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సీపీఐ నాయకులు ఆరోపించారు. దీంతో సీపీఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీపీఐ కార్యకర్తలను అరెస్ట్‌ చేసి స్టేషన్ కు తరలించడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement