కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
Published Sat, Jul 23 2016 1:05 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM
అనంతపురం: అనంతపురం కలెక్టరేట్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ రాజధాని అమరావతిని ఫ్రీజోన్ చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టరేట్ లో దూసుకెళ్లేందుకు సీపీఐ కార్యకర్తలు, విద్యార్థులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ సహా 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
Advertisement