ఎస్సీ వర్గీకరణ కోరుతూ అనంత కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు చేపట్టిన ఆందోళన శుక్రవారం ఉద్రిక్తంగా మారింది.
అనంతపురం: ఎస్సీ వర్గీకరణ కోరుతూ అనంత కలెక్టరేట్ వద్ద ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు చేపట్టిన ఆందోళన శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలు కలెక్టరేట్ బిల్డింగ్ మీదికి ఎక్కి హంగామా సృష్టించారు. అసెంబ్లీలో వెంటనే ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి పార్లమెంట్‌లో బిల్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను విధులకు హాజరుకాకుండా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.