కామ్రేడ్ కోరిక
వామపక్ష భావజాలం కలిగిన ఓ నేతను త్వరలో జరగనున్న వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాయి వామపక్షాలు. తెలంగాణలో పేరున్న నేత కూడా అయినందున వామపక్షాలు ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోవడానికి ఉపయోగపడుతాయని ఆ పార్టీలు భావించాయి. ఏదో పోటీలో ఉండాలని అనుకోవడానికి ఆయనేమీ అల్లా టప్పా వ్యక్తి కాదు కదా...మీరు కాంగ్రెస్‌ను ఒప్పించండి...ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉండేలా ప్రకటన చేయండి...అప్పుడు గానీ నేనూ పోటీ చేయనంటూ షరతు పెట్టేసరికి వామపక్ష నేతలు ఉస్సూరుమంటూ వెనుదిరిగారట. ఇంతకు కాంగ్రెస్ పార్టీని సంప్రదించారా అని ఓ వామపక్ష నేతను అడిగితే...అబ్బే వాళ్లెందుకు ఒప్పుకుంటారు...ఒకవేళ అడిగి కాదంటే...మాకెందుకు ఎవరో ఒకరిని వెతికి పెడతామంటూ సమాధానమిచ్చాడు ఆ నేత.