Warangal Lok Sabha constituency
-
కామ్రేడ్ కోరిక
వామపక్ష భావజాలం కలిగిన ఓ నేతను త్వరలో జరగనున్న వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాయి వామపక్షాలు. తెలంగాణలో పేరున్న నేత కూడా అయినందున వామపక్షాలు ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోవడానికి ఉపయోగపడుతాయని ఆ పార్టీలు భావించాయి. ఏదో పోటీలో ఉండాలని అనుకోవడానికి ఆయనేమీ అల్లా టప్పా వ్యక్తి కాదు కదా...మీరు కాంగ్రెస్‌ను ఒప్పించండి...ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉండేలా ప్రకటన చేయండి...అప్పుడు గానీ నేనూ పోటీ చేయనంటూ షరతు పెట్టేసరికి వామపక్ష నేతలు ఉస్సూరుమంటూ వెనుదిరిగారట. ఇంతకు కాంగ్రెస్ పార్టీని సంప్రదించారా అని ఓ వామపక్ష నేతను అడిగితే...అబ్బే వాళ్లెందుకు ఒప్పుకుంటారు...ఒకవేళ అడిగి కాదంటే...మాకెందుకు ఎవరో ఒకరిని వెతికి పెడతామంటూ సమాధానమిచ్చాడు ఆ నేత. -
మందకృష్ణ, గద్దర్, మీరాలను ఎదిరిస్తా..
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి వరంగల్: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పిస్తే మంద కృష్ణమాదిగ, గద్దర్, పార్లమెంట్ మాజీ స్పీకర్ మీరాకుమార్లను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా లద్నూరులో శనివారం విలేకరులతో మాట్లాడారు. 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఒక సాథనంలో పోటీ చేసేందుకు దళితుడిని తయారు చేసేకోలేకపోయిందన్నారు. పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ పోటీచేసే పది మంది దళితులను తయారు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి సీఎం ఎవరిని నిలబెట్టిన వారి గెలుపు కోసం కృషిచేస్తామని అన్నారు.