ఇద్దరు మోసగాళ్లతో ఏపీకి  అన్యాయం | Cm Chandrababu Naidu And Narendra Modi Ap Special Status Was Cheated | Sakshi
Sakshi News home page

ఇద్దరు మోసగాళ్లతో ఏపీకి  అన్యాయం

Published Mon, Apr 16 2018 12:09 PM | Last Updated on Sat, Aug 18 2018 9:09 PM

 Cm Chandrababu Naidu And Narendra Modi Ap Special Status Was Cheated - Sakshi

డాక్టర్‌ సిద్ధారెడ్డికి మద్దతుగా దీక్షలో పాల్గొన్న మహిళలు

కదిరి : ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ఎంత మోసం చేశాడో... హోదా తెచ్చే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతకన్నా ఎక్కువ మోసం చేశాడు. ఈ ఇద్దరు మోసగాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలను బంగాళాఖాతంలో కలపాలి’ అని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ.సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదా కోసం పోరాడుతున్న జగన్‌ వెంటే జనం ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబు ఇప్పుడు హోదా జపం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలేం అమాయకులు కాదని, ఎవరు చిత్తశుద్ధిగా పోరాడుతున్నారో వారికి బాగా తెలుసని అన్నారు.
 హారతి పట్టిన మహిళలు
ప్రత్యేకహోదా కోసం తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న సిద్ధారెడ్డిని పట్టణంలోని పలువురు మహిళలు అభినందించారు. ఆయనకు హారతి పట్టి మీ సంకల్పం నెరవేరాలని ఆశీర్వదించారు. మేము సైతం అంటూ వారు కూడా దీక్షలో కూర్చున్నారు. హోదాకు తూట్లు పొడుస్తున్న చంద్రబాబుకు ఓటు ద్వారా బుద్ధి చెబుతామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సిద్ధారెడ్డికి హారతినిస్తున్న మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement