అమరావతి టైం లైన్‌పై చేతులెత్తేసిన చంద్రబాబు | Chandrababu Declines to Set Amaravati Timeline, Calls It a Continuous Process | Sakshi
Sakshi News home page

అమరావతి టైం లైన్‌పై చేతులెత్తేసిన చంద్రబాబు

Apr 3 2026 2:43 PM | Updated on Apr 3 2026 3:40 PM

Chandrababu Declines to Set Amaravati Timeline, Calls It a Continuous Process

సాక్షి,అమరాతి: రాజధాని భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. అమరావతి నిర్మాణం టైమ్‌లైన్‌పై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ’ అని వ్యాఖ్యానించారు. అమరావతి పూర్తికి ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆయన వెల్లడించలేదు.

పైగా, రాజధాని నిర్మాణంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, భవనాల నిర్మాణంపై పన్నుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుందని చెప్పారు. మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తామని, వాటి ద్వారా ఆదాయం వస్తుందని తెలిపారు. అభివృద్ధి చేసిన భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని, మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement