కేవీపల్లె: సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
పీలేరు : వైఎస్సార్‌సీపీ బలోపేతంలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పీలేరులో పార్టీ యువ నేత కృష్ణచైతన్యరెడ్డి జన్మదిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ జెండా రంగులో రూపిందించిన కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గడప గడపకూ తీసుకెళ్లి వివరించడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని కాదని, ముగిసిపోయిన అధ్యాయమని అవహేళన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. హోదా కోసం ఉద్యమించిన ఎమ్మెల్యేలు, నాయకులు, యువకులపై అక్రమ కేసులు పెట్టించిన సీఎం ఉన్నఫలంగా యూటర్న్ తీసుకుని మరోమారు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని చెప్పారు.
సీఎం డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు..
తన ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో సీఎం హోదా అంటూ కొత్తనాటకానికి తెరలేపారని విమర్శించారు. రూ. 30 కోట్ల ప్రజాధనంతో దొంగ దీక్ష చేసి తన ధ్వంద నీతిని సీఎం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. సీఎం మాటలకు చేతలకు పొంతన ఉండదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్తాపితం చేయడంలో యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వినర్ నారే వెంటక్రమణారెడ్డి, పార్టీ నాయకులు ఎం. భానుప్రకాష్‌రెడ్డి, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, పెద్దోడు, చైతన్యరెడ్డి, ఆనంద్, శ్యామ్‌రెడ్డి, ఉదయ్, హరి, వెంకటేశ్వర్‌రెడ్డి, జీవన్, నవీన్, సుధాకర్, కిషోర్, మణి తదితరులు పాల్గొన్నారు.
భాస్కర్‌నాయుడు కుటుంబానికి పరామర్శ
కలకడ: స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు నీళ్ల భాస్కర్‌నాయుడు కుటుంబాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఆదివారం మండలంలోని కె.బాటవారిపల్లెలో భాస్కర్‌నాయుడు తమ్ముడు భార్య సూర్యకుమారి శుభస్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మనోహర్‌నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వెంకట్రమణరెడ్డి, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కేఎస్ మస్తాన్ తదితరులు ఉన్నారు.
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
కేవీపల్లె: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ నగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ జి. జయరామచంద్రయ్య, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, నాయకులు గజ్జెల శీన్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, రమేష్, ధర్మారెడ్డి, నాగసిద్ధారెడ్డి, గణపతిరెడ్డి, సైఫుల్లాఖాన్, అమరేంద్రనాయుడు, యర్రయ్య, చిన్నబ్బ, చెంగయ్య, ప్రభాకర, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment