Chinthala ramachandra reddy
-
'నా బిడ్డను అన్యాయంగా చంపేశారు..'
సాక్షి, పీలేరు/కేవీపల్లె: ‘‘నా బిడ్డను అన్యాయంగా చంపేశారు... నిందితులను కఠినంగా శిక్షించండి.’’ అంటూ హతుడి తల్లి బోరున విలపించింది. కేవీపల్లె మండలం ఎగువమేకలవారిపల్లె సమీపంలోని బొప్పాయితోటలో హత్యకు గురైన తేజేష్‌రెడ్డి తల్లి జ్యోతి గురువారం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎదుట తనగోడు వెల్లబోసుకుంది. తేజేష్‌రెడ్డి(8) మృతదేహానికి గురువారం పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఎమ్మెల్యే ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుని బంధువులను ఓదార్చే ప్రయత్నం చేశారు. జ్యోతి మాట్లాడుతూ, తాము ఎవరికీ ఎలాంటి హానీ చేయలేదని, గతంలో అప్పు చేసినా తీర్చేశామని పేర్కొంది. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ అభంశుభం తెలియని బాలుడిని హత్య చేయడం అత్యంత కిరాతకమైన సంఘటనగా అన్నారు. నిందితులు ఎంతటి వారైనా, ఎవరైనా ఉపేక్షించబోమని కఠిన శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ విచారణ తేజేష్‌రెడ్డి హత్యాఘటనపై గురువారం రాత్రి ఎస్పీ సెంథిల్‌కుమార్ గ్రామంలో విచారణ చేపట్టారు. వివిధ కోణాల్లో గ్రామస్తులను సమాచారం అడిగి తెలుసుకుని వివరాలు నమోదు చేశారు. ప్రధానంగా తేజేష్‌రెడ్డి తల్లిదండ్రుల ఆర్థిక లావాదేవీలు కారణమై వుండవచ్చన్న అనుమానాలున్నాయి. ఎస్పీతోపాటు సీఐ, ఎస్ఐ, సిబ్బంది ఉన్నారు. చదవండి: (Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..?) సంకేనిగుట్టపల్లెలో విషాదఛాయలు పోస్టుమార్టం చేసిన మృతదేహాన్ని గ్యారంపల్లె పంచాయతీ సంకేనిగుట్టపల్లెకు తరలించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తల్లి జ్యోతితోపాటు బంధువుల రోదనలు కలచివేశాయి. కువైట్‌లో ఉన్న తండ్రి నాగిరెడ్డి స్వగ్రామానికి వస్తున్నట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. -
ప్రభుత్వ భూముల అక్రమాలపై విచారణ చేపట్టాలి
పీలేరు (చిత్తూరు జిల్లా): పీలేరు మండలంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పీలేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. పీలేరు మండలంలోని గూడరేవుపల్లె, దొడ్డిపల్లె, ఎర్రగుంట్లపల్లె, కాకులారంపల్లె, ముడుపులవేముల, బోడుమల్లువారిపల్లె పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లు వేసి అమాయకులైన ప్రజలకు విక్రయించారని పేర్కొన్నారు. 2009–2014 మధ్య అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో, 2014–2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా ఉన్న నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా 2019–21 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ప్లాట్లు వేసి అమ్ముకున్నారని టీడీపీ నాయకులు అభియోగాలు మోపినందున అన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న రియల్టర్లు, ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన కట్టడాలు తక్షణమే తొలగించాలన్నారు. పీలేరు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల తారుమారుకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులచే సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. -
నల్లారి కుటుంబంపై పీలేరు ఎమ్మెల్యే సవాల్
-
‘చంద్రబాబువి పసలేని ఆరోపణలు’
సాక్షి, చిత్తూరు(పీలేరు) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టడం చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పీలేరు మండలంలోని తలుపుల పంచాయతీ, అబ్బవరం వారిపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 1,34,000 ఉద్యోగాలకు ఒకే విడతలో నోటిఫికేషన్ జారీచేసి, అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించారని గుర్తుచేశారు. 11 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం సువర్ణ అక్షరాలతో లిఖించ దగ్గ విషయమన్నాన్నారు. ఎక్కడా పొరపాట్లకు అవకాశం లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో చంద్రబాబు, ఆయన తోక పత్రికలు జీర్ణించుకోలేక పరీక్ష పేపరు లీకైందంటూ ప్రభుత్వంపై బురద జల్లే ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్ర అభివృద్ధిని మరిచి దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. తనకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న పత్రికలకు వందల కోట్ల రూపాయలు దోచి పెట్టి రాష్ట్రాన్ని అవినీతిలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నాన్నారు. ఇకనైనా టీడీపీ నేతలు తమ తీరుమార్చుకోకుంటే ప్రజల్లో మున్న కనీస గుర్తింపు కూడా కోల్పోక తప్పదని జోస్యం చెప్పారు. నాయకులు మల్లికార్జునరెడ్డి, మస్తాన్, చక్రపాణిరెడ్డి, మదన, కేశవరెడ్డి, ఆంజినేయులు, శేఖర్, నాగిరెడ్డి, గేట్ పీర్ పాల్గొన్నారు. అబ్బవరం వారిపల్లిలో పార్టీ నాయకులతో ఎమ్మెల్యే చింతల -
పార్టీ బలోపేతంలో యువత పాత్ర కీలకం
పీలేరు : వైఎస్సార్సీపీ బలోపేతంలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పీలేరులో పార్టీ యువ నేత కృష్ణచైతన్యరెడ్డి జన్మదిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. వైఎస్సార్సీపీ జెండా రంగులో రూపిందించిన కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గడప గడపకూ తీసుకెళ్లి వివరించడంలో యువత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని కాదని, ముగిసిపోయిన అధ్యాయమని అవహేళన చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. హోదా కోసం ఉద్యమించిన ఎమ్మెల్యేలు, నాయకులు, యువకులపై అక్రమ కేసులు పెట్టించిన సీఎం ఉన్నఫలంగా యూటర్న్ తీసుకుని మరోమారు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని చెప్పారు. సీఎం డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.. తన ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో సీఎం హోదా అంటూ కొత్తనాటకానికి తెరలేపారని విమర్శించారు. రూ. 30 కోట్ల ప్రజాధనంతో దొంగ దీక్ష చేసి తన ధ్వంద నీతిని సీఎం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. సీఎం మాటలకు చేతలకు పొంతన ఉండదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్తాపితం చేయడంలో యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వినర్ నారే వెంటక్రమణారెడ్డి, పార్టీ నాయకులు ఎం. భానుప్రకాష్‌రెడ్డి, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, పెద్దోడు, చైతన్యరెడ్డి, ఆనంద్, శ్యామ్‌రెడ్డి, ఉదయ్, హరి, వెంకటేశ్వర్‌రెడ్డి, జీవన్, నవీన్, సుధాకర్, కిషోర్, మణి తదితరులు పాల్గొన్నారు. భాస్కర్‌నాయుడు కుటుంబానికి పరామర్శ కలకడ: స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు నీళ్ల భాస్కర్‌నాయుడు కుటుంబాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరామర్శించారు. ఆదివారం మండలంలోని కె.బాటవారిపల్లెలో భాస్కర్‌నాయుడు తమ్ముడు భార్య సూర్యకుమారి శుభస్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మనోహర్‌నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకట్రమణరెడ్డి, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కేఎస్ మస్తాన్ తదితరులు ఉన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలి కేవీపల్లె: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ నగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ జి. జయరామచంద్రయ్య, పార్టీ మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, నాయకులు గజ్జెల శీన్‌రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, రమేష్, ధర్మారెడ్డి, నాగసిద్ధారెడ్డి, గణపతిరెడ్డి, సైఫుల్లాఖాన్, అమరేంద్రనాయుడు, యర్రయ్య, చిన్నబ్బ, చెంగయ్య, ప్రభాకర, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చింతల వారి ‘పెళ్లి కానుక’
పంజగుట్ట: ‘బడి–గుడి’ కార్యక్రమంతో ప్రజల కు చేరువైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తన నిమి ఫౌండేషన్ ద్వారా ‘పెళ్లి కానుక’ పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలో వివా హం చేసుకునే జంటకు రూ.50 వేలు విలువ చేసే కానుకలు అందిస్తున్నారు. అర్హులైన 22 జంటలకు గురువారం ఎర్రమంజిల్‌లోని హోట ల్ ఎన్‌కేఎం గ్రాండ్లో పెళ్లికానుకలు అందించారు. అన్ని మతాల వారికీ అమలు చింతల రామచంద్రారెడ్డి తన నియోజకవర్గమైన ఖైరతాబాద్‌కు చెందిన అన్ని మతాల వారికీ ఈ కానుకలు అందిస్తున్నారు. ఇందులో అర తులం పుస్తెలు, అర తులం ఉంగరం, రెండు తులాల వెండి మెట్టెలు, వరుడికి సూటు, వధువుకు పట్టుచీర అందిస్తున్నారు. గురువారం ముస్లి, క్రిస్టియన్లకు కూడా ఇవే అందిచారు. అయితే, ఆ మతస్తులకు పుస్తెలు, మెట్టెల స్థానంలో అంతే ధరలో ఏం ఇవ్వాలనే త్వరలోనే నిర్ణయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వధూవరులు ఇద్దరు అదే నియోజకవర్గం వారైతే ఒక్కరికే ఈ పధకం వర్తిస్తుందన్నారు. ఈ నెల 11వ తేదీన ఈ పథకం ప్రకటించగానే 73 ఆహ్వాన పత్రికలు వచ్చాయని, అందులో ముగ్గురు మైనర్లు కావడంతో అవి తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించాకే.. వివాహం చేసుకునేవారు స్థానిక బూత్ ప్రెసిడెంట్‌ను గాని, డివిజన్ ప్రసిడెంట్ను గాని కలిసి దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ, శుభలేఖ జతచేసి ఇవ్వాలి. ఎమ్మెల్యేనే స్వయం గా వాటిని పరిశీలించి స్వయంగా పెండ్లివారి ఇంటికి వెళ్లి కానుక ఇస్తారు. ‘గతేడాది ‘‘బడి–గుడి’’ కార్యక్రమం ద్వారా 11 వేల మంది విద్యార్థులకు చేరువయ్యాం. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశాం. నియోజకవర్గం ప్రజలకు ఏదైనా చేయాలన్న తపనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నా. నేను బతికున్నత కాలం ఈ పథకాన్ని కొనసా’నని చింతల తెలిపారు. తండ్రిలా అండగా నిలిచారు.. ఈ నెల 22న మా వివాహం ఉంది. ఎమ్మెల్యే తండ్రి పాత్ర పోషిస్తూ పుస్తెలు, మెట్టెలు, ఉంగరం, దుస్తులు అందించారు. మా వివాహానికి కూడా హాజరై మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుటున్నాం. – వందన, సాగర్ ఆయనకు రుణపడి ఉంటాం.. మా కొడుకు పెళ్లికి సుమారు రెండున్నర లక్షల వరకు ఖర్చవుతుంది. అందులో రూ.50 వేల వస్తువులు ఎమ్మెల్యే అందిస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటాము. చేసిన మేలు ఎప్పటికీ మరవలేం. – సయ్యద్ ఉస్మాన్, రహీమా బేగం -
కోట పులకించింది
గోల్కొండ: చారిత్రక గోల్కొండ కోట తొలిసారి పూలవనమై పులకించింది. ఆడపడుచుల బతుకమ్మ ఆటపాటలతో పరవశించింది. గుమ్మడి పూలో.. అమ్మ.. బంతీపూలో.. తంగెడపూలో తల్లి.. ఎంగిలిపూలో.. అంటూ సాగిన జానపదాలు కొండ గాలితో కలిసి నగరాన్ని చుట్టేశాయి. రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం కోటలో బతుకమ్మ వేడుకలు అద్భుతంగా నిర్వహించారు. రకరకాల పూలతో కూర్చిన బతుకమ్మలను ప్రాంగణంలో ఉంచి.. చక్కని పాటలకు మహిళా నేతలంతా లయబద్దంగా కదులుతుంటే.. వారితో కలిసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సైతం పాదం కలిపారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు జి.పద్మజారెడ్డి తదితరులు బతుకమ్మ ఆడారు. -
వర్షం నష్టం నిధులు పంపిస్తాం
బంజారాహిల్స్ : నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల అభివృద్ధి, ఇంకా కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై, అందుకుగల కారణాలపై ఆరా తీసేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని తన నివాసంలో నగర బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ వరద భీభత్సం సృష్టించింది. అందుకు గల కారణాలేంటి అన్నదానిపై ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు పాల్గొన్నారు. -
ఇదేమి ‘కానుక’?..ఇదేమి వేదిక?
చంద్రన్న కానుక పేరుతో గడువుతీరిన సరుకులను ఇస్తున్నారని మంత్రి బొజ్జలను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, స్థానికులు నిలదీశారు. కలకడ మండలంలో నిర్వహించిన జన్మభూమి సభ వేదికపై స్థానిక శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి సీటు లేకపోవడంతో ఆయన ప్రజల మధ్యలోనే కూర్చున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడే నిల్చుని ప్రసంగించారు. -
పట్టిసీమ నుంచి నీరేలా తెస్తారు?
చిత్తూరు: పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఏ విధంగా తెస్తారో చెప్పకుండానే కోట్లు వెచ్చిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం చింతల విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రాంత రైతుల మేలును చెడగొట్టే పరిస్థితిలో వైఎస్సార్సీపీ లేదని ఆయన అన్నారు. రాయలసీమలోని ప్రాజెక్ట్‌లకు పోలవరం ద్వారా నీరు వస్తాయే తప్పా పట్టిసీమ నుంచి కష్టమవుతుందని తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు రాయలసీమకు నీరు తేవాలనే బగీరథుడుగా మారాడని చింతల అన్నారు. అయితే నేడు ఏ ప్రాంతానికి నష్టం కలగకుండా చూడాలన్నదే వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. అనుభవం లేని వారి మాటలు పట్టించుకోనవసరం లేదని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.