‘చంద్రబాబువి పసలేని ఆరోపణలు’ | YSRCP MLA Chintala Ramachandra Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబువి పసలేని ఆరోపణలు’

Published Mon, Sep 23 2019 12:44 PM | Last Updated on Mon, Sep 23 2019 12:44 PM

YSRCP MLA Chintala Ramachandra Reddy Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, చిత్తూరు(పీలేరు) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెట్టడం చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు, లోకేష్‌ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.  ఆదివారం ఆయన పీలేరు మండలంలోని తలుపుల పంచాయతీ, అబ్బవరం వారిపల్లిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 1,34,000 ఉద్యోగాలకు ఒకే విడతలో నోటిఫికేషన్‌ జారీచేసి, అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా పరీక్షలు విజయవంతంగా నిర్వహించారని గుర్తుచేశారు. 11 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం సువర్ణ అక్షరాలతో లిఖించ దగ్గ విషయమన్నాన్నారు. ఎక్కడా పొరపాట్లకు అవకాశం లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో చంద్రబాబు, ఆయన తోక పత్రికలు జీర్ణించుకోలేక పరీక్ష పేపరు లీకైందంటూ ప్రభుత్వంపై బురద జల్లే ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్ర అభివృద్ధిని మరిచి దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. తనకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న పత్రికలకు వందల కోట్ల రూపాయలు దోచి పెట్టి రాష్ట్రాన్ని అవినీతిలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నాన్నారు. ఇకనైనా టీడీపీ నేతలు తమ తీరుమార్చుకోకుంటే ప్రజల్లో మున్న కనీస గుర్తింపు కూడా కోల్పోక తప్పదని జోస్యం చెప్పారు. నాయకులు మల్లికార్జునరెడ్డి, మస్తాన్, చక్రపాణిరెడ్డి, మదన, కేశవరెడ్డి, ఆంజినేయులు, శేఖర్, నాగిరెడ్డి, గేట్‌ పీర్‌ పాల్గొన్నారు.

అబ్బవరం వారిపల్లిలో పార్టీ నాయకులతో ఎమ్మెల్యే చింతల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement