పెళ్లి కానుక అందుకున్న వారితో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
పంజగుట్ట: ‘బడి–గుడి’ కార్యక్రమంతో ప్రజల కు చేరువైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తన నిమి ఫౌండేషన్ ద్వారా ‘పెళ్లి కానుక’ పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలో వివా హం చేసుకునే జంటకు రూ.50 వేలు విలువ చేసే కానుకలు అందిస్తున్నారు. అర్హులైన 22 జంటలకు గురువారం ఎర్రమంజిల్‌లోని హోట ల్ ఎన్‌కేఎం గ్రాండ్‌లో పెళ్లికానుకలు అందించారు.
అన్ని మతాల వారికీ అమలు
చింతల రామచంద్రారెడ్డి తన నియోజకవర్గమైన ఖైరతాబాద్‌కు చెందిన అన్ని మతాల వారికీ ఈ కానుకలు అందిస్తున్నారు. ఇందులో అర తులం పుస్తెలు, అర తులం ఉంగరం, రెండు తులాల వెండి మెట్టెలు, వరుడికి సూటు, వధువుకు పట్టుచీర అందిస్తున్నారు. గురువారం ముస్లి, క్రిస్టియన్లకు కూడా ఇవే అందిచారు. అయితే, ఆ మతస్తులకు పుస్తెలు, మెట్టెల స్థానంలో అంతే ధరలో ఏం ఇవ్వాలనే త్వరలోనే నిర్ణయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వధూవరులు ఇద్దరు అదే నియోజకవర్గం వారైతే ఒక్కరికే ఈ పధకం వర్తిస్తుందన్నారు. ఈ నెల 11వ తేదీన ఈ పథకం ప్రకటించగానే 73 ఆహ్వాన పత్రికలు వచ్చాయని, అందులో ముగ్గురు మైనర్లు కావడంతో అవి తిరస్కరించినట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించాకే..
వివాహం చేసుకునేవారు స్థానిక బూత్ ప్రెసిడెంట్‌ను గాని, డివిజన్ ప్రసిడెంట్‌ను గాని కలిసి దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ, శుభలేఖ జతచేసి ఇవ్వాలి. ఎమ్మెల్యేనే స్వయం గా వాటిని పరిశీలించి స్వయంగా పెండ్లివారి ఇంటికి వెళ్లి కానుక ఇస్తారు. ‘గతేడాది ‘‘బడి–గుడి’’ కార్యక్రమం ద్వారా 11 వేల మంది విద్యార్థులకు చేరువయ్యాం. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశాం. నియోజకవర్గం ప్రజలకు ఏదైనా చేయాలన్న తపనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నా. నేను బతికున్నత కాలం ఈ పథకాన్ని కొనసా’నని చింతల తెలిపారు.
తండ్రిలా అండగా నిలిచారు..
ఈ నెల 22న మా వివాహం ఉంది. ఎమ్మెల్యే తండ్రి పాత్ర పోషిస్తూ పుస్తెలు, మెట్టెలు, ఉంగరం, దుస్తులు అందించారు. మా వివాహానికి కూడా హాజరై మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుటున్నాం. – వందన, సాగర్
ఆయనకు రుణపడి ఉంటాం..
మా కొడుకు పెళ్లికి సుమారు రెండున్నర లక్షల వరకు ఖర్చవుతుంది. అందులో రూ.50 వేల వస్తువులు ఎమ్మెల్యే అందిస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటాము. చేసిన మేలు ఎప్పటికీ మరవలేం. – సయ్యద్ ఉస్మాన్, రహీమా బేగం
Comments
Please login to add a commentAdd a comment