వర్షం నష్టం నిధులు పంపిస్తాం | The rain will be sent to the funding loss | Sakshi
Sakshi News home page

వర్షం నష్టం నిధులు పంపిస్తాం

Published Mon, Sep 26 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

వెంకయ్యనాయుడతో సమావేశమైన నగర బీజేపీ ఎమ్మెల్యేలు...

వెంకయ్యనాయుడతో సమావేశమైన నగర బీజేపీ ఎమ్మెల్యేలు...

బంజారాహిల్స్‌ : నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల అభివృద్ధి, ఇంకా కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై, అందుకుగల కారణాలపై ఆరా తీసేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని తన నివాసంలో నగర బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ వరద భీభత్సం సృష్టించింది. అందుకు గల కారణాలేంటి అన్నదానిపై ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు.  ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement