venkayya naidu
-
‘ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది’
భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పలపాటి వెంకయ్య నాయుడు నాలుగురోజుల దుబాయి పర్యటనలో భాగంగా తెలుగు అసొసియేషన్ భారత కాన్సులేట్ జనరల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్నారు. వెంకయ్య నాయుడును తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ కుమార్ ఉగ్గిన సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా దుబాయిలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి దేశానికి వెంకయ్య నాయుడుగారు చేసిన సేవలను కొనియాడరు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. జనని, జన్మభూమి, చదువుచెప్పిన గురువులను ఎన్నడూ మరువరాదని, మనిషికి మాతృభాష కళ్ళవంటిది అయితే ఇతర భాషలు కళ్ళజోడు వంటివని, మాతృభాషను, మన కట్టు, బొట్టు, ప్రాస, యాస, గోసలను కాపాడుకోవాలని కోరారు. భారతదేశంలో మన వేద పురాణ కాలం నుండే మహిళకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోది పిలిపునిచ్చినట్టుగా ఆడపిల్లలను సంరక్షించాలని, చదివించాలని,ప్రోత్సాహించాలని కోరారు. ప్రపంచం శర వేగంతో ముందుకు వెళ్తోందని, మన భారతదేశం నిపుణతకు, మేధస్సు, నిజాయితీ లకు పెట్టునిల్లు అని, సంకల్పం, దృఢ నిశ్చయం, పట్టుదల, కఠోర పరిశ్రమతో విశ్వగురువుగా మళ్ళీ అవతరించబోతోందని చెప్పారు. సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక,వైజ్ఞానికరంగాల్లో భారత్‌దే పైచేయి అని, ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని చెప్పారు. మన పూర్వ వృత్తాంతన్ని మననం చేసుకుంటూ, మన మూలాలను మరవకుండా, మనుగడను కొనసాగించి పురోభివృద్ది చెందాలని కోరారు. ప్రతీ ఒక్కరూ తమ, తమ కుటుంబ, సమాజ, ప్రాంత, రాష్ట్ర, దేశ శ్రేయస్సు కొరకు పాటుపడాలని సందేశాన్ని ఇచ్చారు య.ఏ.ఈ లోని ఉభయ రాష్ట్రాల తెలుగు వారిని సంఘటిత పరుస్తూ, తెలుగు సంసృతిని సంరక్షిస్తున్న తెలుగు అసోసియేషన్ సేవలను నువెంకయ్యనాయుడు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా దుబాయిలోని చిన్నారులు చేసిన కూచిపూడినృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, ఎస్‌ఆర్‌ఆర్‌బిల్డింగ్ మెటేరియల్స్ అధినేత తోట రామకుమార్, దినేష్ కుమార్ ఉగ్గిన వెంకయ్యనాయుడుని సన్మానించి, సన్మాన పత్రం, శాలువా,జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి వక్కలగడ్డ వేంకట సురేష్, ఆర్జె జాహ్నవి లు సంధానకర్తలు గా వ్యవహరించారు. తెలుగు అసోసియేషన్ తరఫున శ్రీధర్ దామెర్ల,విజయ్ భాస్కర్, మోహన్ ఎంవీఎస్‌కే,అంబేడ్కర్, లతా నాగేశ్, ఫహీమ్, శ్రీనివాస్ యండూరి, సురేంద్ర దండేకుల,నూకల మురళీ కృష్ణకార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. -
స్టాండింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించండి
న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు మంగళవారం లేఖ రాశారు. 31 మంది సభ్యులున్న ఈ స్థాయీ సంఘంలో ఒకే ఒక్క మహిళా ఎంపీ (టీఎంసీకి చెందిన సుస్మితా దేవ్) ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు సంబంధించిన కీలక బిల్లును పరిశీలించడానికి సగం కంటే ఎక్కువమంది మహిళలను స్టాండింగ్ కమిటీలో నియమించాలని కోరారు. అలాగే ఈ కమిటీ మహిళా ఎంపీనే చైర్మన్‌గా నియమించాలని స్వాతి డిమాండ్ చేశారు. చదవండి: వాళ్లు అగాథం పెంచితే.. మేం అభివృద్ధి చేశాం -
మెగాస్టార్ రిక్వెస్ట్.. ‘మా’ సభ్యులకు గుడ్ న్యూస్
దశాబ్ధాలుగా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నిరంతర సేవాకార్యక్రమాల్లో ఉన్న సంగతి తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ .. ఐ బ్యాంక్ సేవలతో ఎందరో అవసరార్థులను ఆదుకుంది ఈ ట్రస్ట్. కరోనా క్రైసిస్ కష్ట కాలంలో ఆక్సిజన్ సేవల్ని ప్రారంభించి ఎందరో ప్రాణాల్ని కాపాడిన సంగతి తెలిసినదే. చేసిన సేవలకు గుర్తింపు గౌరవం దక్కుతోంది. బుధవారం అమీర్‌పేటలో యోదా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా యోధా లైఫ్ డయాగ్నస్టిక్స్ అధినేత సుధాకర్ రూ. 25 లక్షల విరాళం చిరంజీవి ట్రస్ట్ సేవల కోసం అందించారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా ఈ సందర్భంగా చిరంజీవి వారికి కృతజ్ఞతలు తెలిపారు. చిరు మాట్లాడుతూ.. ‘ఇది ఊహించలేదు. ఎన్నో సంవత్సరాలుగా సొంత రిసోర్సెస్‌తోనే ట్రస్ట్‌ను నడిపాను. ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్దలు ముందుకు వచ్చి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవల్ని గుర్తించి సముచిత ఆర్థిక సాయాన్ని అందివ్వడం ఆనందదాయకం. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పైసా అవసరార్ధులకు అందేలా చేస్తా, ఇది మీకు నా హామీ. ఇదే సమయంలో నా వ్యక్తిగత అభ్యర్థన. మా సినీ పరిశ్రమలో చాలా మంది మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) లోని పేద కళాకారులు, జూనియర్ కళాకారులు 24 క్రాష్ట్లోని చిన్న టెక్నీషియన్స్ ఉన్నారు. వారంతా సరైన వైద్యం అందక ఇక్కట్లు పడుతున్నారు. మీ డయాగ్నసిస్ సెంటర్ ద్వారా రోగ నిర్ధారణ పరిష్కారానికి గాను వారికి సాయం చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. చదవండి: నయన్‌కు సామ్ బర్త్‌డే విషెస్, లేడీ సూపర్‌స్టార్‌పై ఆసక్తికరంగా పోస్ట్ దానికి ప్రతిస్పందనగా.. మూవీ ఆర్టిస్టుల సంఘంతో సహా 24 శాఖల కార్మికులకు 50 శాతం తక్కువ ఖర్చులోనే ఆరోగ్య సేవలందిస్తామని యోధ లైఫ్ లైన్ సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ట్విట్టర్లోనూ ప్రశంసలు కురిపించారు. ఇలాంటివి సమాజానికి మంచి సంజ్ఞల్ని ఇస్తాయి. ఎక్కువ మందికి సేవ చేయడం .. వారి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో మాకు సహాయపడతాయి. హైదరాబాద్ లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్స్ వ్యవస్థాపకుడు సుధాకర్ కంచర్ల గారికి హృదయపూర్వక అభినందనలు... అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. My gratitude to #YodaLifeLineDiagnostics for their contribution of Rs.25 Lacs through the hands of Hon’ble Vice President of India Shri.@MVenkaiahNaidu garu to @Chiranjeevi_CT Gestures like these will help us serve more and more people and make a difference in their lives. pic.twitter.com/a49MAUGQ1J — Chiranjeevi Konidela (@KChiruTweets) November 17, 2021 -
పత్రికల్లో పాతతరం విలువలు రావాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, నెల్లూరు: ‘ ప్రస్తుతం రాజకీయాలు చూస్తే రోతపుడుతున్నాయి. అలాగే పత్రికల్లోనూ విలువలు దిగజారిపోయి సంచలనాల కోసం ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నాయి. అన్ని పత్రికలు చదివితే కానీ వాస్తవాలు తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. పత్రికల్లో పాతతరం విలువలు రావాలి’ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో జరిగిన లాయర్ వారపత్రిక 40 వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసగించారు. రాను రాను పత్రికల విలువల్లో మార్పు వస్తోందని ఇది కొందరికే వర్తించే అంశమే అయినా ఈ దిశగా ప్రతి పాత్రికేయుడు ఆలోచించాలని సూచించారు. పాలిటిక్స్, జర్నలి జం, మెడిసిన్ ఈ మూడు వ్యాపార ధోరణిలోకి పోకూడదని.. కానీ ఆ మూడు వ్యాపార దోరణీలోనే ఉన్నాయన్నారు. పాత్రికేయ రంగంలో నార్ల వెంకటేశ్వరరావు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు. నెల్లూరులో పులిబొంగరాల న్నా... శెట్టెమ్మ దోశెలన్నా.. ట్రంకురోడ్డులో తెలిసిన వారితో తిరగాలన్నా.. తనకెంతో ఇష్టమని ఈ పదవుల వల్ల అక్కడికి వెళ్లి తినలేని పరిస్థితి ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా సమయంలో అశువులు బాసిన జర్నలిస్టుల స్మృతికి నివాళులు అర్పించారు. డీఆర్డీవో చైర్మన్ జి.సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శాంతా బయోటెక్ ఎండీ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కొల్లి శ్రీనాథ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. స్వప్నకు తుంగా అవార్డు తుంగా రాజగోపాల్‌రెడ్డి జ్ఞాపకార్థం ప్రతిఏటా ఇచ్చే అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ జర్నలిస్టు స్వప్నను ఎంపిక చేసి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఇచ్చారు. వీఆర్ కళాశాల పూర్వ అధ్యాపకుడు రామచంద్రరావును సన్మానించారు. పుస్తకావిష్కరణ.. లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగా ప్రభాత్‌రెడ్డి (ప్రభు) రచించిన ‘‘విజయపథంలో నెల్లూరీయులు’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. -
టెస్లా బ్యాటరీతో.. ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇప్పుడు ఇండియాలో
సాక్షి, అమరావతి / బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ఉన్న విజయవాడకు చెందిన అవేరా న్యూ, రెనివేబుల్ ఎనర్జీ మోటో కార్ప్ టెక్.. రెట్రోసా స్కూటర్ కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఈ స్థాయి వేగం కలిగిన ఈ–స్కూటర్ భారత్‌లో ఇదేనని కంపెనీ తెలిపింది. టెస్లా బ్యాటరీతో టెస్లా కంపెనీ తయారు చేసే కార్లలో వినియోగిస్తున్న లైఫ్పీవో4 రకానికి చెందిన బ్యాటరీలను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో వినియోగించారు. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఈ తరహా బ్యాటరినీ పొందుపర్చడం ప్రపంచంలో ఇదే తొలిసారని ఆవేరా ఫౌండర్ రమణ తెలిపారు. ఆటోమేటిక్ ఆన్/ఆఫ్ స్కూటర్‌పైన కూర్చోగానే హ్యాండిల్‌కు ఉన్న కెమెరా సెన్సార్స్ ఆధారంగా వాహనం స్టార్ట్ అవుతుంది. వాహనం దిగగానే ఆఫ్ అవుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే ఎకానమీ డ్రైవ్‌లో 148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ధర సబ్సిడీలు పోను రూ.1.25 లక్షలు. బ్యాటరీ చార్జింగ్ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ వాహనాన్ని సోమవారం విజయవాడలో పరిశీలించారు. -
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి గవర్నర్ ఘనస్వాగతం
సాక్షి,కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కి ఉపరాష్ట్రపతి బయలుదేరారు. కాగా నేటి నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జేసీ వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పొరపాటు కూడా లేకుండా రెవెన్యూ, జీవీఎంసీ ఆధికారులు సమన్వయంతో విధులను నిర్వహించాలన్నారు. విధులను నిర్వహించే వారందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. ఉపరాష్ట్రపతి మంగళవారం గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. అక్కడే జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో పాల్గొంటారన్నారు. పోర్ట్ గెస్ట్ హౌస్‌లో జరిగే 61వ నేషన్ డిఫెన్స్ కాలేజ్ కోర్స్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 3,4,5 తేదీల్లో నగరంలోని వివిధ కార్యక్రమంలో పాల్గొని 6వ తేదీ సాయంత్రం ఎయిర్‌పోర్టుకు చేరుకుని పాట్నా వెళతారని తెలిపారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాస మూర్తి, ఆర్డీవో పెంచల కిషోర్, డీఆర్డీఏ పీడీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
యువకులకు రజనీకాంత్ జీవితం ఓ ప్రేరణ: ఉప రాష్ట్రపతి
‘సినిమాల్లో హింస, అశ్లీలతలవంటివి చూపించడాన్ని తగ్గించాలి. సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో బాధ్యత పెంపొందించే విధంగా సినిమాలు ఉండాలి. భారతదేశ సినీ పరిశ్రమలో ఉన్న అపారమైన నైపుణ్యానికి ఈ అవార్డులు ఓ మచ్చుతునక మాత్రమే. మరింతమంది ఔత్సాహిక యువ దర్శకులు, కళాకారులు, సాంకేతిక సిబ్బందిని చిత్రపరిశ్రమ పెద్దలు ప్రోత్సహించాలి. సినీరంగంలో అవకాశాలు వెతుక్కుంటున్న యువకులకు రజనీకాంత్ సినీ జీవితం ప్రేరణాత్మకంగా నిలుస్తుంది’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన 67వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో పాటు పలువురు కళాకారులకు వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ ఎంపిక కాగా ఆ చిత్రదర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత ‘దిల్’ రాజు అవార్డులు స్వీకరించారు. తెలుగులో ఉత్తమ సినిమాగా ఎంపి కైన ‘జెర్సీ’ అవార్డును నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అదే సినిమాకుగాను ఎడిటర్ నవీన్ నూలి అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ‘భోంస్లే’కి మనోజ్ బాజ్‌పాయ్, ‘అసురన్ ’ చిత్రానికి ధనుష్ ఇద్దరూ అందుకున్నారు. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాలకుగాను కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. నన్ను నటుడిగా తీర్చిదిద్దిన నా గురువు బాలచందర్‌గారికి ధన్యవాదాలు. నా అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్ నా తండ్రిలాంటివారు. గొప్ప విలువలు నేర్పించిన ఆయనకు ధన్యవాదాలు. నా మిత్రుడు, డ్రైవర్, ట్రాన్స్పోర్ట్ సహోద్యోగి రాజ్ బహుదూర్ నాలో నటుడు ఉన్నాడని గుర్తించి, నన్ను ప్రోత్సహించారు. వీరితో పాటు నా సినిమా నిర్మాతలు, దర్శకులు, సహ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు, మీడియా మిత్రులు, అభిమానులు, తమిళ ప్రజలకి ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నాను. – రజనీకాంత్ మంచి చిత్రాలు తీస్తూ ఉండాలని ఈ పురస్కారం గుర్తు చేస్తూ ఉంటుంది. వినోదంతో పాటు సందేశం ఇవ్వడం సినిమాతో సాధ్యమవుతుంది. మహేశ్‌బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసినప్పుడు మరింతమంది చూస్తారు. – వంశీ పైడిపల్లి రైతులకు నగర ప్రజలు ఏ విధంగా సాయం చేయాలనే అంశంతో ‘మహర్షి’ సినిమా తీశాం. మహేశ్ బాబు కమర్షియల్ స్టార్. ఆయనకు తగ్గట్టు సినిమాలో పాటలు, ఫైట్లతో దర్శకుడు వంశీ పైడిపల్లి చక్కటి సినిమా తీశాడు. – ‘దిల్’ రాజు ‘జెర్సీ’కి పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు రావడానికి ముఖ్యకారణం హీరో నానీ. – గౌతమ్ తిన్ననూరి – నవీన్ నూలి – సూర్యదేవర నాగవంశీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాబాయి(చినబాబు), డైరెక్టర్‌కు ధన్యవాదాలు. కథను నమ్మి నటించిన నానీకి ప్రత్యేక ధన్యవాదాలు. – సూర్యదేవర నాగవంశీ ఎడిటింగ్‌లో చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ నూలి అవార్డు విజేతల వివరాలు.. ఉత్తమ చిత్రం: ‘మరక్కర్: ది అరేబియన్ కడలింటె సింహం’ (మలయాళం) ఉత్తమ నటుడు: ధనుష్ (‘అసురన్’), మనోజ్ బాజ్‌పాయ్ (‘భోంస్లే’), ఉత్తమ నటి: కంగనా రనౌత్ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పంగా) ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి (తమిళ ‘సూపర్ డీలక్స్’) ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’) ఉత్తమ బాల నటుడు: నాగ విశాల్ (తమిళ చిత్రం – ‘కె.డి’) ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్ ’) ఉత్తమ వినోదాత్మక చిత్రం: ‘మహర్షి’ ఉత్తమ తెలుగు చిత్రం: ‘జెర్సీ’ ఎడిటింగ్: నవీన్ నూలి (జెర్సీ) కొరియోగ్రాఫర్: రాజుసుందరం (మహర్షి) ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమాన్ (తమిళ చిత్రం ‘విశ్వాసం’) ఉత్తమ గాయకుడు: బి. ప్రాక్ (హిందీ ‘కేసరి’) ఉత్తమ గాయని: సావనీ రవీంద్ర (మరాఠీ ‘బర్దో’) ఉత్తమ సినిమాటోగ్రఫీ: గిరీశ్ గంగాధరన్ (మలయాళ చిత్రం – ‘జల్లికట్టు’) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: విక్రమ్ మోర్ (కన్నడ ‘అవనే శ్రీమన్నారాయణ’) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: సిద్ధార్థ్ ప్రియదర్శన్ (మలయాళ ‘మరక్కర్: ది అరేబియన్ ’) ఉత్తమ కాస్ట్యూమ్స్: సుజిత్ సుధాకరన్, వి. సాయి (‘మరక్కర్...’) ఉత్తమ తమిళ చిత్రం: ‘అసురన్ ’ ఉత్తమ మలయాళ చిత్రం: ‘కల్ల నోట్టమ్’ ఉత్తమ కన్నడ చిత్రం: ‘అక్షి’ ఉత్తమ హిందీ చిత్రం: ‘ఛిఛోరే’ ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం: ‘తాజ్‌మహల్’ (మరాఠీ) స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (తమిళం) చదవండి: అరాచకంగా ‘అన్నాత్తే’ టీజర్.. వింటేజ్ రజనీ ఆన్ ది వే -
వైద్య సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వైద్యాన్ని చౌకగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సరైన సమయంలో వైద్యం అందించడాన్ని సైతం ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానికసంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్ రంగం సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం వైద్య కళాశాల స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. మహిళలకు సరైన ప్రోత్సాహం అందించాలి దేశంలో వైద్యం మరింత ఖరీదవుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ భారాన్ని మోయలేకపోతున్న విషయాన్ని ప్రతీ ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్నాతకోత్సవంలో పతకాలు అందుకున్న వారిలో ఎక్కువమంది యువతులు ఉండటాన్ని ప్రత్యేకంగా అభినందించిన వెంకయ్యనాయుడు... మహిళలకు సరైన ప్రోత్సాహాన్నందిస్తే ఏదైనా సాధించగలరనే దానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా వైద్యులు, వైద్య సిబ్బంది పోషించిన పాత్రను సమాజం ఎన్నటికీ మరిచిపోదన్నారు. అయితే దేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తి మధ్య ఉన్న భారీ అంతరాన్ని తగ్గించేందుకు కృషి జరగాలని సూచించారు. వలసవాద విధానాలు విడనాడాలి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ, తత్సంబంధిత ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రానున్న రోజుల్లో ప్రతి రెవెన్యూ కేంద్రానికి ఒక సకల సౌకర్యాలున్న ఆసుపత్రి ఏర్పాటు జరగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. వైద్యరంగం అత్యంత పవిత్రమైన వృత్తుల్లో ఒకటన్న ఉపరాష్ట్రపతి, వైద్య విద్యార్థులు విధుల్లో చేరిన తర్వాత తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంలో, అక్కడి ప్రజలకు వైద్యం అందించడంలో చొరవ తీసుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ కొన్ని వలసవాద విధానాలను కొనసాగించడంపై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన విధానాలను, మన అలవాట్లను భారతీయీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. చట్టసభలు, విద్య, పరిపాలన, న్యాయ ఇలా అన్నిరంగాల్లోనూ భారతీయ విధానాలను అలవర్చుకోవాలన్నారు. న్యాయవ్యవస్థను జాతీయీకరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చదవండి: మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి నిరాకరణ -
ఓటుకు పనితీరే కొలమానం
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, ఎన్నుకోబోయే వ్యక్తి పనితీరు, ప్రజా ప్రయోజనాలనే కొలమానంగా తీసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పోటీచేసే వ్యక్తి గుణగణాలు, సామర్థ్యం, యోగ్యత, నడతను కచ్చితంగా అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కులమతాలు, ధన ప్రభావంతో ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉపరాష్ట్రపతి తన నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి రచించిన ‘ఎకోటి కాలింగ్’పుస్తకాన్ని తెలుగులో అనువదించిన ‘సుపరిపాలన’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రభుత్వం కంటే పాలనే కీలకమైందని, పాలనా ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయ వలసిన అవసరం ఉందని సూచించారు. సౌకర్యాల కల్పనతో పాటు ప్రజలకు అడ్డంకులు లేని ఆనందమయ జీవితాన్ని కల్పించడమే సుపరిపాలన ధ్యేయమన్నారు. ఎన్నుకోబడిన ప్రతినిధులు తమ బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహించాలని, ప్రజలకు పరిపూర్ణమైన సేవలు అందించాలన్నారు. కరదీపికలా సుపరిపాలన పుస్తకం.. కొత్తగా సివిల్ సర్వీసుల్లోకి వచ్చే వారికి సుపరిపాలన పుస్తకం కరదీపికలా పని చేస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలు, ఒత్తిడులు, అడ్డంకులు తదితర ఎన్నో అంశాలను ఇందులో చర్చించినట్లు తెలిపారు. థర్డ్ జండర్స్, న్యాయం లాంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను వెలువరించిన ఈ పుస్తకం, ఉద్యోగంతో పాటు సమాజం పట్ల జోషి చేసిన అధ్యయనాన్ని తెలియజేస్తుందని, రచయిత జోషి రచించిన ఇంగ్లీషు పుస్తకాన్ని సరళమైన, చక్కని తెలుగులో అనువాదం చేసిన అన్నవరపు బ్రహ్మయ్యకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ ఎస్.కె.జోషి, అనువాదకుడు బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
ఉపరాష్ట్రపతిని కలిసిన విజయసాయిరెడ్డి
-
కాగ్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. కాగ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. -
దిశ కేసు: డిసెంబరు 31లోగా ఉరి తీయాల్సిందే..
న్యూఢిల్లీ : కేవలం చట్టాలు చేయడం ద్వారా దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా అరికట్టలేమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇలాంటి హేయమైన నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనపై చర్చకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో నోటీసు ఇచ్చింది. ఈ క్రమంలో చర్చ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ... ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అరాచకాలు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనలపై వెంటనే దర్యాప్తు చేపట్టి దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా కఠినంగా వ్యవహరించినపుడే ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ మరో ఎంపీ అమీ యాజ్నిక్ మాట్లాడుతూ... ప్రభుత్వ వ్యవస్థలన్నీఒకే తాటిపైకి వచ్చినపుడే సామాజిక సంస్కరణలు జరుగుతాయని పేర్కొన్నారు. మరోవైపు లోక్‌సభలో సైతం దిశ ఘటనపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు. క్వశ్చన్ అవర్ తర్వాత ఈ మేరకు చర్చ జరుగనుంది. అప్పుడే న్యాయం: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా మహిళలపై లాంటి ఘటనలు జరుగుతున్నాయి. కేవలం కోర్టులు, చట్టాలతో న్యాయం జరగదు. కింది కోర్టులో శిక్ష పడితే పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్తున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాలి. ఈ పరిస్థితుల్లో మార్పునకు సమాజమంతా సమిష్టి కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలు బోధించాలి. అందరి మైండ్‌సెట్ మారాలి. జాతీయ రహదారుల్లో మద్యం అమ్మకాలు తగ్గించాలి. దేశం సురక్షితం కాదు: విజిలా సత్యనాథ్ ‘ఈ దేశం మహిళలకు, చిన్నారులకు సురక్షితం కాదు. న్యాయం ఆలస్యం కావడం అంటే అన్యాయం జరిగినట్లే. వెంటనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. దిశ హత్య కేసులో నలుగురిని డిసెంబరు 31లోగా ఉరి తీయాలి’ అని అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్ డిమాండ్ చేశారు. -
నేడు మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి
-
హిందీ అందరూ నేర్చుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : దేశంలో ప్రతి పౌరుడు హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమీర్‌పేటలో ఆదివారం నిర్వహించిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ విశారద స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాష భావాన్ని వ్యక్తీకరించేందుకు, మానసిక వికాసానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాష నేర్చుకోవాలని.. మాట్లాడాలని సూచించారు. తల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరిచిపోవద్దని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. దేశంలో హిందీ ఎక్కువగా మాట్లాడుతారని.. అర్థం చేసుకుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో హిందీ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 1935లో విజయవాడలో దక్షిణ భారత హిందీ ప్రచారసభ స్థాపితమైందని, దీని ద్వారా అధ్యాపకులు, ప్రచారకులు తయారయ్యారని తెలిపారు. హిందీ ప్రచార సభల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
‘కేటీఆర్‌కు ఆ అర్హత లేదు’
సాక్షి, హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావులపై వస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేసే వ్యక్తి నీతిమంతుడై ఉండాలని, తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని వెంకయ్య నాయుడే నిరూపించుకోవాల్సి ఉందన్నారు. మంత్రి పదవిలో ఉండే వారు ప్రైవేటు కంపెనీల్లో భాగస్వాములుగా ఉండడానికి వీలులేదని, కేటీఆర్ హిమాన్షు మోటార్స్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని తమ్మినేని తెలిపారు. ‘1951-పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్’ ఈ విషయాన్ని నిర్ధేశిస్తోందని చెప్పారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో, 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయ పన్నుల శాఖకు కంపెనీ తరపున కేటీఆర్ వివరాలను సమర్పించారని అన్నారు. కేటీఆర్ బెదిరింపులతో విమర్శకుల నోళ్లు మూయించలేరన్నారు. నైతిక బాధ్యతతో కేటీఆర్ తన పదవి నుంచి తప్పుకోవాలని, ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల, జిల్లెల గ్రామాల్లో దళితులపై నిర్బంధం పెరిగిందని ఆరోపించారు. స్వయంగా సిరిసిల్ల ఎస్పీ దళితులను చిత్రహింసలకు గురిచేశారని, వాస్తవాలను అంగీకరించి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చౌకబారుగా థర్డ్ డిగ్రీ లేదు, ఉత్త డిగ్రీ లేదంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. -
‘జై ఆంధ్రా’ నుంచి ‘ఉప రాష్ట్రపతి’ వరకు!
-
రేపు ఒంగోలులో కిమ్స్ ఆస్పత్రి ప్రారంభం
ఒంగోలు సెంట్రల్ : ఒంగోలులోని నూతనంగా నిర్మించిన కిమ్స్ వైద్యశాలను జూన్ 1వ తేదీన కేంద్ర అర్బన్ అభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు. మొత్తం 2150 పడకలతో 30 ప్రత్యేక విభాగాలతో ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో గుండె, కిడ్నీ, నరాలు, యూరాలజీ, ఊపిరితిత్తులు, కంటి, చెవి, పళ్లు తదితర విభాగాలలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, ఎంఆర్ఐ స్కాన్, క్యాత్ ల్యాబ్ తదితర ప్రత్యేక విభాగాలును ఏర్పాటు చేశారు. కిమ్స్‌కు ఎన్‌ఎబిల్, ఎన్‌ఎబిహెచ్ గుర్తింపు ఉంది. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వై.సుజనాచౌదరి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, డాక్టర్ పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు తదితరులు పాల్గొంటారు. -
విశాఖ సేఫ్ కాదట!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజధాని నిర్మాణం కా(లే)ని నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆర్థిక రాజధాని, సహజ సౌందర్య నగరి విశాఖపట్నం మీదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫోకస్ ఉంది. అందుకే ప్రతిష్టాత్మక ఐఎఫ్ఆర్ విశాఖలోనే నిర్వహించాం.. సీఐఐలు వరుసగా రెండేళ్లు ఇక్కడే పెట్టాం.. ఐదు దేశాల ప్రతినిధులు పాల్గొన్న బ్రిక్స్ సదస్సుకు ఇదే నగరాన్ని వేదిక చేశాం.. విశాఖ నగరానికి మేము ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు నగరానికి వచ్చినప్పుడుల్లా చేసే వ్యాఖ్యలివి. సదస్సులు, సమావేశాల నిర్వహణే అభివృద్ధికి సూచికలు.. అన్న రీతిలో మాట్లాడే పాలకులు ఇప్పటి వరకు విశాఖ సమగ్రాభివృద్ధికి పక్కాగా ప్రణాళికలే రూపొందించలేదు. ఈ సంగతి అటుంచితే రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనల్లో తుపాన్ల విశాఖను రాజధానికి ఎలా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో వాదించడం వివాదాస్పదమవుతోంది. హుద్‌హుద్ లాంటి విలయాలను కూడా తట్టుకుని నిలిచిన విశాఖను తుపానుల నగరంగా తేలిగ్గా తీసిపారేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ట్రిబ్యునల్ వద్ద వ్యాఖ్యలు చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రిబ్యునల్‌లో ప్రభుత్వ వాదన ఇదీ.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. రాజధాని ఎంపిక విషయంలో ఇతర ప్రాంతాలను పరిగణించారాః? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ.. రాజధానిగా విశాఖ నగరాన్ని కూడా పరిశీలించామని.. ఇది అధిక వర్షపాతం ఉన్న సైక్లోన్ ప్రభావిత ప్రాంతమని, హుద్‌హుద్ వల్ల సుమారు రూ.25వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. అందువల్ల దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాజధానిగా విశాఖను పరిశీలించిదెప్పుడు? ఇక రాజధానిగా విశాఖ నగరాన్ని పరిశీలించామని ప్రభుత్వ న్యాయవాది ట్రిబ్యునల్‌కు నివేదించారు. కానీ వాస్తవానికి ప్రభుత్వం ఎప్పుడూ విశాఖను క్యాపిటల్‌గా పరిశీలించిన దాఖలాలే లేవు. సమైక్యాంధ్ర విభజన సమయంలో ఏర్పాటైన జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పర్యటన మినహా రాజధాని ఎంపిక పరిశీలన నిమిత్తం ఎప్పుడూ.. ఎవ్వరూ.. పర్యటించలేదు. విశాఖపై తుఫానుల ప్రభావం తక్కువ ఆంధ్రప్రదేశ్‌లో ఇంతటి అందమైన నగరం మరొకటి లేదనేని వాస్తవం. వాతావరణ పరంగా విశాఖ ఎంతో అనుకూలం. తుఫానులు అధికంగా నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడల్లో తీరాన్ని తాకుతుంటాయి. విశాఖ ప్రాంతంలో తీరం తాకడం చాలా అరుదు. హుద్‌హుద్ మినహా పెద్ద తుఫానులు విశాఖపై ప్రభావం చూసిన సందర్భాలు లేవు. గోదావరి జలాలను విశాఖకు తరలించడం సులభం. అదే విధంగా విశాఖ నగరాన్ని మూడు వైపుల విస్తరించుకుంటూ వెళ్లే అవకాశం ఉంది. డైవెర్సిఫైడ్ ఆలోచనతో పనిచేస్తే శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు రాజధాని అనుబంధంగా నగరాలు, కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు అధికం. విశాఖ రాజధాని అయితే వ్యవసాయ భూములు నష్టపోకుండా రాజధాని నిర్మాణం జరిగేది. –ఆచార్య ఓ.ఎస్.ఆర్ భాను కుమార్, విశ్రాంత ఆచార్యులు, మెట్రాలజీ, ఓషనోగ్రఫీ విభాగం తప్పుడు వాదనలపై అభ్యంతరాలు వాస్తవానికి హుద్‌హుద్ విలయం 2014 అక్టోబర్‌లో సంభవించింది. అప్పటికే రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కూడా చేసేసింది. కానీ విశాఖను రాజధానిగా ఎంపిక చేయకపోవడానికి హుద్‌హుద్ తుపానునే సాకుగా చూపించడం వివాదాస్పదమవుతోంది. వాస్తవానికి హుద్‌హుద్‌ను తట్టుకుని నిలబడిన నగరంగా విశాఖ చరిత్రకెక్కింది. ఇక అధిక వర్షపాతం ఉన్న సైక్లోన్ ప్రభావిత ప్రాంతంగా విశాఖను పేర్కొనడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క హుద్‌హుద్ మినహా ఇప్పటివరకు తుపాన్లు విశాఖను తీవ్రంగా ప్రభావితం చేసిన దాఖలాలే లేవు. రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదయ్యే నగరంగా కూడా విశాఖ ఇంతవరకు రికార్డులకెక్కలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ట్రిబ్యునల్‌లో విశాఖ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించందంటూ విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలు, ఎండల ముప్పు తీవ్రంగా ఉన్న అమరావతిపై ఉన్న మోజు, రహస్య లావాదేవీల కారణంగానే దాని ఎంపికను సమర్థించుకునేందుకు విశాఖపై బురద జల్లుతున్నారని విమర్శిస్తున్నారు. -
మహా విజయంపై బీజేపీ వేడుకలు
హైదరాబాద్: మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాదించినందుకు తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలమైన శక్తిగా మారుతుందన్నారు. ఎక్కడో గెలిస్తే సంబరాలు కాదని, ఇక్కడ కూడా పార్టీ బలపడాలన్నారు. ప్రజల్లోకి వెళ్ళాలి.. కష్టపడితే పలితం ఉంటుందని.. పోరాటానికి సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మతపర రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వ పతకాలే కార్యకర్తలకు ఆయుధాలని పార్టీ సిద్ధాంతలఫై రాజీపడొద్దన్నారు. తెలంగాణ, ఏపీలకు ఒరిస్సా ప్రేరణ కావాలని సూచించారు. నోట్ల రద్దు తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ కి పట్టం కట్టారని అది ప్రజలకు మోదీపై నమ్మకానికి నిదర్శనమన్నారు. ఒవైసీల పాలనలో పాతబస్తీలోని ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా, మజ్లీస్ ను పోషించింది కాంగ్రెస్ కాదా, కాంగ్రెస్ కు మజ్లీస్ కు పొత్తు లేదా, కేసీఆర్ నోట్ల రద్దు ను స్వాగతిస్తే తప్పా అని ప్రశ్నించారు. నోట్ల బదిలీ ఫై బీజేపీ అనుకున్నంత ప్రచారం చేయలేకపోయామన్నారు. పరిపాలన కాంగ్రెస్ జన్మ హక్కు గా ఫీల్ అవుతోందని, చిదంబరం అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దేశ ఐక్యమత్యానికి విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ముస్లింలు పార్టీకి ప్రత్యర్థులు కారని.. పాత బస్తీలో ప్రజలకు ఏమీ చేయని మజ్లీస్ పార్టీ తమకు ప్రత్యర్థి అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తెలంగాణాలో కూడా బీజేపీ ప్రత్యామ్నాయంగా మారాలని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, మోడీ విధానాలను పల్లెల్లోకి తీసుకుపోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించారు.తెలంగాణ లో కూడా బీజేపీ కి అనుకూల వాతావరణం ఉందని. బీజేపీ ప్రస్తుతం ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కూడా మెజారిటీ తో అధికారం లోకి వస్తుందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు.భారత దేశ రాజకీయాల్లో గొప్ప పరిణామాలు చోటు చేసుకున్నాయని, అన్ని పార్టిలు బీజేపీ ని లక్ష్యంగా పెట్టుకొని విమర్శిస్తున్నాయని, బీజేపీ వైపు అన్నివర్గాల ప్రజలు బీజేపీ తోనే ఉన్నారని ఆయన తెలిపారు. -
దేశంలో అవినీతి రహిత పాలన సాగుతోంది
-
హోదాకే పరిమితం కారాదు :వెంకయ్య
-
ఉపాధి అవకాశాల గని కోస్టల్ కారిడార్
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం చేయూత రాజమండ్రి విమానాశ్రయాభివృద్ధికి చర్యలు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక ప్యాకేజీపై కాకినాడలో అవగాహన సభ బోట్‌క్లబ్ (కాకినాడ) : ఉభయగోదావరి జిల్లాల్లో కోస్టల్ కారిడార్, కాకినాడలో పెట్రో కెమికల్ యూనివర్సిటీల ఏర్పాటు ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. కాకినాడలో శుక్రవారం ‘ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం – ప్రత్యేక ప్యాకేజీ’ అంశంపై నిర్వహించిన అవగాహన సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కేంద్ర సాయంతో అమలు కానున్న ప్రాజెక్టులతో జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా ప్రజలు ఆప్యాయత మరువలేనిదని, తన అల్లుడు ఇక్కడి వాడేనని అన్నారు. పోలవరం నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు ముంపు మండలాలును జిల్లాలో కలపడం జరిగిందని వెంకయ్య చెప్పారు. రాజమండ్రి, గన్నవరం ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సభకు వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఎమ్మార్పీఎస్‌కు మద్దతు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభం పాటి హరిబాబు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా నిధులు కేటాయిస్తుందన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కేంద్రం నుంచి ఏపీకి అన్ని విధాలా సహకరిస్తున్న వ్యక్తి వెంకయ్యనాయుడు అన్నారు. అన్యాయంగా ఏపీని కాంగ్రెస్ ప్రభుత్వం విడదీస్తే 34 వేల ఎకరాల్లో ప్రత్యేక రాజధాని నిర్మాణానికి వెయ్యి కోట్లు మంజూరు చేశారన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీగా ప్రకటించిన ఘనత వెంకయ్యనాయుడిదేనన్నారు. వెంకయ్యనాయుడిని కాకినాడ ప్రజల తరఫున తోట నరసింహం ఘనంగా సత్కరించారు. దారి పొడవునా స్వాగతం ప్రత్యేక ప్యాకేజీపై అవగాహన సభకు వచ్చిన వెంకయ్యనాయుడికి నగరంలో దారిపొడవునా జేజేలు పలికారు. కార్లు, బైక్‌ల ర్యాలీతో కార్యకర్తలు స్వాగతం పలికారు. దారి పొడవునా ఆయనకు వివిధ సంస్థలు స్వాగతం పలికాయి. సినిమారోడ్డులో రెల్లి కులస్థులు ఎస్సీలో కలపాలని వినతి పత్రం సమర్పించారు. వైస్సార్ వారధి వద్ద వివిధ కళాశాలలకు విద్యార్థులు పూలతో స్వాగతం పలికారు. భానుగుడి సెంటర్ వద్ద కిలోమీటరు పొడవు జాతీయ జెండాతో స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంగరాల చినబాబు వెంకయ్యనాయుడుకు పోలవరం నమూనా అందజేశారు. బీజేపీ నాయకుడు సబ్బతి ఫణీశ్వర్ారవు తూరంగికి మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఆయుష్ కార్యకర్తలు రెగ్యులర్ చేయాలని ప్లేకార్డులు చేతపట్టుకని సభకు వచ్చారు. బీజేపీ శాసన సభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు, రాష్ట్ర దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్‌ారజు, బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీరాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిక్కిన విశ్వేశ్వరరావు, పైడా కృష్ణమోహన్, ఉంగరాల చినబాబు, ఆల్డా చైర్మ¯ŒS యాళ్ల దొరబాబు, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ రామ్‌కుమార్, రాష్ట్ర ఇ¯ŒSచార్జ్ సిద్ధార్ధ సింగ్, జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, వెంకయ్యనాయుడు కుమార్తె దీపా, నాయకులు ఏపీఆర్ చౌదరి, బి.రవీంద్రరాజు, చల్లపలి నరసింహారెడ్డి, కర్?ర చిట్టిబాబు , జిల్లాకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
చంద్రబాబులో వెంకయ్యకు ఏం నచ్చింది?
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభినందించడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య తీవ్రంగా తప్పుబట్టారు. ‘చంద్రబాబులో వెంకయ్యకు నచ్చిందేంటో చెప్పాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడమా? రైతులకు నష్టం చేసే విధానాలు అవలంబించడమా? ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమా? ప్రజాధనం దుబారా చేయడమా? ఇవేనా చంద్రబాబులో వెంకయ్యకు నచ్చిన అంశాలు?’ అంటూ సీ రామచంద్రయ్య నిలదీశారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నందుకే చంద్రబాబును వెంకయ్య అభినందించారా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అరుణ్ జైట్లీని అభినందించేందుకే నిన్నటి శంకుస్థాపన సభ పెట్టారని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా విభజన చట్టంలో ఉన్నదేనని చెప్పారు. కమిషన్ల కోసమే పోలవరాన్ని రాష్ట్రం చేపట్టేలా చంద్రబాబు చూసుకున్నారని, అందుకు సహకరించినందుకే అరుణ్‌జైట్లీని ఆయన సన్మానించారని మండిపడ్డారు. -
భారతదేశానికి ఎంతో ఘన చరిత్ర ఉంది
-
వర్షం నష్టం నిధులు పంపిస్తాం
బంజారాహిల్స్ : నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల అభివృద్ధి, ఇంకా కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. నగరంలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై, అందుకుగల కారణాలపై ఆరా తీసేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని తన నివాసంలో నగర బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ వరద భీభత్సం సృష్టించింది. అందుకు గల కారణాలేంటి అన్నదానిపై ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు పాల్గొన్నారు. -
మహాగణపతితో వెంకయ్య..
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతికి ఆదివారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మహా గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ ఖైరతాబాద్‌లో ఇంత పెద్ద ఎత్తున ఉన్నగణపతిని దశాబ్దాలుగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. -
నచ్చని వాళ్లను ఇబ్బందిపెట్టడం అలవాటే..
విశాఖ: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిస్ ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండిస్తోంటే, కాంగ్రెస్ మాత్రం మతం రంగు పులుముతోందని విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులమత శక్తులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని వైఖరిని ప్రజలు గమనించాలని వెంకయ్య నాయుడు కోరారు. తనకి నచ్చని వాళ్లని ఇబ్బందులకు గురి చేయడం కాంగ్రెస్ కు అలవాటేనని వెంకయ్య ఆరోపించారు. ప్రజల తీర్పుతో అసహనానికి గురైన కాంగ్రెస్... నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడాన్ని జీర్తించుకోలేకపోతోందన్నారు. అందుకే ఎన్డీయే సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండి పడ్డారు. దేశంలో అసహనం పెరుగుతోందంటూ అవార్డు వాపసీ పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై... నీతి ఆయోగ్ లో చర్చ జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య నాయుడు వివరించారు. -
పాత పాటే..
► పారిశ్రామిక కారిడార్..ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా మారుస్తానంటూ హామీ ► ఇచ్చిన హామీలకు నిధుల ప్రస్తావన లేదు ► రిజర్వాయర్ల కింద సాగు చేసింది 6 లక్షల ఎకరాలైతే.. 8.50 లక్షల ఎకరాలకు నీరిచ్చామన్న సీఎం. ► లక్షల ఎకరాలు ఎండిపోతే.. పంటల్ని కాపాడామని గొప్పలు ► పింఛను తొలగించారని ప్రశ్నించిన వికలాంగుడు ► సీఎం ప్రసంగిస్తుండగానే లేచి వెళ్లిపోయిని మహిళలు ► హడావుడిగా సాగిన సీఎం చంద్రబాబు కార్యక్రమం సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ముఖ్యమంత్రి హోదాలో ఆరోసారి జిల్లాకు వచ్చిన బాబు కార్యక్రమం హడావుడిగా.. చప్పగా ముగిసింది. కొత్తసీసాలో పాత సారా అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం సాగింది. గతంలో ఇచ్చిన హామీలకు ఎటువంటి క్లారిటీ లేకుండా కార్యక్రమాన్ని ముగించుకుని తిరుగు పయనమయ్యారు. తూపిలిపాళెంలో సుమారు రూ.600 కోట్లతో ఏర్పాటు చేయనున్న సునామీ, సముద్ర పరిశోధన కేంద్రానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, హర్షవర్ధన్, అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, తిరుపతి ఎంపీ వరప్రసాద్, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసరావు, నారాయణ, గోపాలకృష్ణారెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తదితరులు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కొత్త వరాలతో పాటు.. గతంలో ఇచ్చిన హామీల అమలుకు నిధులు మంజూరు విషయంపై ప్రకటన చేస్తారని భావించారు. అయితే ఎక్కడా ఆ ప్రస్తావన రాలేదు. అయితే నెల్లూరు జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంచుతానని ప్రకటించారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలు పారిశ్రామిక కారిడార్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మరోసారి చెప్పుకొచ్చారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... జిల్లాలో రిజర్వాయర్ల కింద 6 లక్షల ఎకరాలు సాగైతే.. 8.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పంటలను కాపాడమని చెప్పటం సభకు హాజరైన రైతులు నవ్వుకోవటం కనిపించింది. సాగునీరందక సుమారు లక్ష ఎకరాలకుపైగా పంటలు ఎండిపోతే... ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎండిన పంటల గురించి కానీ.. అకాల వర్షంతో నష్టపోయిన పంటల గురించి ప్రస్తావించకుండా.. అంతా బాగుందనే విధంగా సీఎం మాట్లాడటంవిమర్శలకు దారితీసింది. రుణమాఫీకి ఇంత వరకు నిధులు విడుదల చేయకపోయినా.. రైతులను రుణ విముక్తుల్ని చేసిన ఘనత తమదేనని గొప్పలు చెప్పారు. పింఛను తొలగించారంటూ వికలాంగుడు ఆగ్రహం సీఎం సభలో పింఛన్ల గురించి ప్రస్తావన కొచ్చిన సమయంలో వికలాంగుడొకరు లేచి తనకు పింఛను తీసేశారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వెళ్లి వికలాంగుడు నోరెత్తకుండా అడ్డుకున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చెప్పిన విషయాలే మళ్లీ చెపుతుండటంతో మహిళలకు విసుగొచ్చి మధ్యలోనే లేచి వెళ్లిపోవటం కనిపించింది. దీంతో సీఎం చంద్రబాబు ఒకింత నిరాశకు గురికావటంతో పోలీసులు అప్రమత్తమై వెళ్లిపోతున్న వారిని కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. ఇక చేసేది లేక సీఎం తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించేశారు. సభలో మోదీ, వెంకయ్యని పొగిడిన సీఎం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటంతో జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని, వెంకయ్యనాయుడు, సీఎం దిష్టిబొమ్మలను తగులబెడుతుంటే... సీఎం చంద్రబాబు మాత్రం ఎన్డీఏ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తటం గమనార్హం. అదేవిధంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా సీఎం చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. తెప్పించుకునే విధంగా పోరాడకపోయినా ఒకరినొకరు పొగుడుకుంటుండటంతో సభకు హాజరైన వారంతా నవ్వుకోవటం కనిపించింది. -
'భూసేకరణ బిల్లుపై ఏకాభిప్రాయం వస్తుంది'
భూసేకరణ బిల్లుపై విపక్షాలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేంద్రం వివిధ పార్టీలకు నచ్చజెప్పే పనిలో పడింది. ఆయా పార్టీల సూచనలను బిల్లులో చేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఈ విషయంలో ఏకాభిప్రాయం లభిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. సీనియర్ మంత్రులందరూ రాజకీయ పార్టీలకు నచ్చజెప్పే పనిలో ఉన్నారని బుధవారంతెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఢిల్లీలో స్మారకం నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో రాజకీయమేమీ లేదన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లభించగానే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపడతామని తెలిపారు. ఆయన బుధవారం స్వీడన్ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి అన్నా జాన్సన్ బృందంతో భేటీ అయ్యారు. -
కుదిరితే పొత్తు... లేదంటే పోటీ !
-
కాంగ్రెస్ తీరుపై బీజేపి ఆగ్రహం
-
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎస్టేట్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు
-
సీబీఐ కాంగ్రెస్ జేబు సంస్థ బీజేపీ ఆరోపణ