న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచే బిల్లుపై అధ్యయనం చేయనున్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు మంగళవారం లేఖ రాశారు. 31 మంది సభ్యులున్న ఈ స్థాయీ సంఘంలో ఒకే ఒక్క మహిళా ఎంపీ (టీఎంసీకి చెందిన సుస్మితా దేవ్) ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలకు సంబంధించిన కీలక బిల్లును పరిశీలించడానికి సగం కంటే ఎక్కువమంది మహిళలను స్టాండింగ్ కమిటీలో నియమించాలని కోరారు. అలాగే ఈ కమిటీ మహిళా ఎంపీనే చైర్మన్‌గా నియమించాలని స్వాతి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment