పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఏ విధంగా తెస్తారో చెప్పకుండానే కోట్లు వెచ్చిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
చిత్తూరు: పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఏ విధంగా తెస్తారో చెప్పకుండానే కోట్లు వెచ్చిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం చింతల విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రాంత రైతుల మేలును చెడగొట్టే పరిస్థితిలో వైఎస్సార్సీపీ లేదని ఆయన అన్నారు. రాయలసీమలోని ప్రాజెక్ట్లకు పోలవరం ద్వారా నీరు వస్తాయే తప్పా పట్టిసీమ నుంచి కష్టమవుతుందని తెలిపారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు రాయలసీమకు నీరు తేవాలనే బగీరథుడుగా మారాడని చింతల అన్నారు. అయితే నేడు ఏ ప్రాంతానికి నష్టం కలగకుండా చూడాలన్నదే వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. అనుభవం లేని వారి మాటలు పట్టించుకోనవసరం లేదని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.