
సీమకు పట్టిసీమ నీళ్లు రావు: జేసీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నేరుగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు రావని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
'పట్టిసీమ నుంచి కృష్ణానదికి నీరు మళ్లిస్తారు. అక్కడి నుంచి రాయలసీమకు ఎంతవరకు నీరు వస్తుందనేది అనుమానమే. అసలు వస్తాయా? రావా? అనే విషయం కూడా తెలియదు. ఈ క్రమంలోనే రాయలసీమకు ప్రత్యేక కేటాయింపులు ఇవ్వాలని కోరుతాం' అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.